-
సస్పెన్స్.. హారర్.. థ్రిల్
సమీర్‌ఖాన్ హీరోగా షేర్ దర్శకత్వంలో కె. వెంకటరాంరెడ్డి నిర్మించిన చిత్రం ‘కేఎస్ 100’. శైలజ, సునీతా పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. షేర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం అమ్మాయిలు సమాజంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు? అనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ అంశాలతో పాటు యూత్‌కి కావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉండటంతో ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ‘‘ట్రైలర్ చూసి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకు. ‘ఆర్ఎక్స్ 100’ కంటే ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘లయన్’ సాయివెంకట్. -
యాక్షన్ ఎంటర్టైనర్
మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ జంటగా నటించిన చిత్రం ‘కెఎస్ 100’. షేర్ దర్శకత్వంలో చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. షేర్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మా సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన రావడంతో విజయంపై మంచి అంచనాలున్నాయి. సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. అక్షిత, అషి, పూర్వీసునీత, శ్రద్ధా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, కెమెరా: వంశీ, నేపథ్యసంగీతం: రామ్ మోహన్ చారి. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ షేర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెఎస్ 100’. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షేర్ మాట్లాడుతూ– ‘‘కెఎస్100’ టైటిల్‌కి తగ్గట్టుగానే వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రం. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జానర్స్‌లో ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించాం. యువతను, మహిళలను ఆకట్టుకునే అంశాలుంటాయి. గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. చాలామంది మోడల్స్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. తెలుగులో ఎక్కువ మోడల్స్‌ని పరిచయం చేస్తున్న తొలి చిత్రం మాదే. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. అక్షిత, అషి, సునీత, శ్రద్ధా, నందిని, కల్పనా అజీమ్, పూరివి, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, సంగీతం: నవనీత్ చారి. -
సిల్క్స్మితపై మరాఠీ సినిమా!
రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శృంగార సామ్రాజ్ఞి సిల్క్‌స్మిత. తన కైపు కళ్లతో సినీ ప్రపంచాన్ని ఏలగలిగినా... వాస్తవ ప్రపంచం మాత్రం ఆమెకు కన్నీరే మిగిల్చింది. ‘సినీ రంగుల ప్రపంచంలో ఎలా బతకకూడదు’ అనేదానికి నిలువెత్తు సాక్ష్యం సిల్క్ స్మిత జీవితం. ఆమెది ఫెయిల్యూర్ స్టోరీనే అయినా, ఇప్పుడదే పలువురు నిర్మాతలకు సక్సెస్ఫుల్ స్టోరీగా నిలిచింది. హిందీలో ‘డర్టీ పిక్చర్’, మలయాళంలో ‘క్లైమాక్స్’, కన్నడంలో ‘సిల్క్ సక్కత్ మగా’ అన్నవి స్మిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రాలు. ఇవన్నీ సదరు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి.ఇప్పుడు సిల్క్ జీవితం మరాఠీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమీర్‌ఖాన్ అనే దర్శకుడు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా చేయడానికి సన్నాహాలు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి సమీర్‌ఖాన్ మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ ‘సిల్క్’ జీవితంపై వచ్చిన ఏ సినిమాలోనూ ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించలేదు. నేను చేయనున్న సినిమాలో సిల్క్ స్మిత జీవితంలోని అన్ని కోణాలూ ఉంటాయి. రంగుల ప్రపంచంలో ఆమె పడిన కష్టాలు, సినీలోకంలో చీకటి కోణాలు, చాలామందికి తెలియని సిల్క్ స్మితలోని పాజిటీవ్ కోణం, విధితో పోరాటలేక ఆమె ప్రాణాలు తీసుకున్న తీరు... ఇవన్నీ నా సినిమాలో ఉంటాయి. మరాఠీ భాషలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటిలో చాలా ధైర్యంగా తెరపై దృశ్యాలు చూపే సినిమా ఇదే. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తా’’ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement