-
అరుంధతి ఔట్!
న్యూఢిల్లీ: తదుపరి ఆర్బీఐ గవర్నర్ పదవికోసం అభ్యర్థి ఎంపికలో ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్యకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం మరింత కుదించింది. ఈ షార్ట్ లిస్ట్ ను నాలుగు నుంచి రెండుకు కుదించిందని గురువారం నివేదికలు వెల్లడించాయి. అరుంధతి భట్టాచార్య, ఊర్జిత్ పటేల్ పక్కన పెట్టిన ప్రభుత్వం ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డోజౌన్స్ వైర్ అంచనాల ప్రకారం అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జులై 15వ తేదీకల్లా ఈ నియామకం పూర్తి కావచ్చని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గట్టి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ప్రధానంగా ముందు ఆరుగురుతోనూ, ఇద్దరి తొలగించి ఆ తరువాత నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఎంపిక చేసిన ప్రభుత్వం మరో ఇద్దరిని కూడా ఈ జాబితా నుంచి తొలగించింది. ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను పక్కన పెట్టడంతో.. మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ ఫైనల్ రేసులో మిగిలారు. మరి వీరిలో ఎవర్ని ఆ పదవి వరించనుది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?
న్యూఢిల్లీ : తదుపరి ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల జాబితాను కుదించడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా కొనసాగరని స్పష్టం కావడంతో రాజన్ వారసుడి ఎంపికపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు సీనియర్ అధికారి రాయిటర్స్ కి చెప్పారు. కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన జాబితాను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత ఉన్నతోద్యోగులు కాగా, మరొకరు స్టేట్ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య . ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు. ఒకవైపు ఎస్ బీఐ అధిపతి అరుంధతి భట్టాచార్య ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత, నైపుణ్యంలేవని వాదిస్తున్నారు. ఒకవేళ ఆర్ బీఐ అత్యున్నత పదివికి అరుంధతి భట్టాచార్య ఎంపిక అయితే ..అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్ దాస్లపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారు? ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి తెరపడాలంటే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.. కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ లో ముగియనుండటం,అటాగే బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లను బలమైన సంకేతాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అటు తను రెండవసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగనని రాజన్ స్పష్టం చేయడంతో కేంద్ర బ్యాంకు ఉన్నత పదవిని అధిరోహించే అభ్యర్థుల రేస్ మొదలైంది. వీరిలో బలంగా వినిపించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్లను తొలగించడం విశేషంగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement