-
టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. జూన్1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కళ్ళకు గంతలు కట్టేయగా, దానిపై అనుమమ ఏదో రాస్తున్నట్లు ఆసక్తికరంగా పోస్ట్‌ర్‌ను డిజైన్ చేశారు. ఇక అనుమమ సైతం పోస్టర్‌ను షేర్ చేస్తూ.. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. రొమాంటికి ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook pic.twitter.com/JE32WXbrdv — Anupama Parameswaran (@anupamahere) June 1, 2021 చదవండి : సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు! -
మనల్ని ఎవరూ కాపాడలేరు: నిఖిల్ ఎమోషనల్
కరోనా వల్ల పరిస్థితులు రోజురోజుకూ ఎంతలా దిగజారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది కనీసం ఆసుపత్రి బెడ్లు కూడా దొరక్క విలవిల్లాడిపోతున్నారు. ఈ విషమ పరిస్థితులను చూసి చలించిపోయిన యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. కోపం, ఫ్రస్టేషన్, నిరాశ, నిస్సహాయత వల్ల ఈ వీడియో చేస్తున్నాని పేర్కొన్నాడు. "కరోనా వల్ల షూటింగ్స్ రద్దయ్యాయి. ఆ వైరస్ నుంచి తప్పించుకునేందుకు నేను, నా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటున్నాం. సోషల్ మీడియా ద్వారా నా ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలామందికి ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు అందించడం, ఐసీయూ వార్డులో చేర్పించడం వంటి సలు సహాయక చర్యలు చేపట్టాం. కానీ మేం చేసే సాయం సరిపోవడం లేదు. బయట పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది." "కళ్ల ముందే జనాలు చనిపోతున్నారు. ఆక్సిజన్ బెడ్ కావాలని ఓ కోవిడ్ పేషెంట్ ఫోన్ చేశాడు. అరగంటలో దాన్ని సమకూర్చి ఫోన్ చేయగా, అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఇలాంటివి చూడటం చాలా బాధగా ఉంది. మనల్ని ఎవరో వచ్చి కాపాడతారనుకోవడం జరగని పని. నాయకులు ఒకర్ని ఒకరు బ్లేమ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్లు మనల్ని కాపాడలేరు. కాకపోతే మానవత్వం ఇంకా మిగిలే ఉంది. జనాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఈ విపత్కరం సమయంలో అదొక్కటే పాజిటివ్ అంశం. దయచేసి మాస్కులు వేసుకోండి, ఎవరినీ కలవకండి" అని చెప్తూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. చదవండి: మందుల్లేక సతమతమవుతున్న కరోనా రోగికి నిఖిల్ సాయం పెళ్లి వార్తలపై స్పందించిన చార్మి -
మందుల్లేక సతమతమవుతున్న కరోనా రోగికి నిఖిల్ సాయం
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను గడగడలాడిస్తోంది. చేయి చేయి కలిపినా, మాస్క్ లేకుండా కనిపించినా, పార్టీలంటూ, వినోదమంటూ పదే పదే బయట తిరిగినా మన ఒంట్లోకి ప్రవేశించేందుకు రెడీగా ఉందీ కరోనా. సవాలక్ష జాగ్రత్తలు తీసుకున్నవారు కూడా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటు చేసినా ఆ మాయదారి రోగం బారిన పడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ముప్పు తిప్పలు పెడుతుందీ కరోనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఉధృతి విపరీతంగా ఉంది. అదే సమయంలో కరోనా వైరస్‌ను నివారించే వ్యాక్సిన్స్‌ల కొరత కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతున్న తన తండ్రికి రెమిడిసివిర్ ఇప్పించాలంటూ హీరో నిఖిల్‌ను ట్విటర్లో సంప్రదించాడు. దయచేసి మాకు సాయం చేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. దీనిపై పెద్ద మనసుతో స్పందించిన హీరో.. 'సిరివూరి రాజేశ్ వర్మ మీకు అవసరమయ్యేన్ని రెమిడిసివిర్ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది' అని భరోసా కల్పించాడు. Will get it done... Sirivuri Rajesh Varma will contact you. With the Required doses of #Remdisivir . Wishing your father a Speedy recovery. https://t.co/khN8bjLEYz — Nikhil Siddhartha (@actor_Nikhil) April 20, 2021 చదవండి: 'కార్తికేయ 2' షూటింగ్‌కు సడన్ బ్రేక్! -
ఆగిపోయిన 'కార్తికేయ 2' షూటింగ్!
-
నిఖిల్ ‘పేజీలు’ ప్రారంభం
‘అర్జున్ సురవరం’ హిట్‌తో మంచి స్పీడు మీదున్న హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’. నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. అల్లు అరవింద్ çసమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సూర్యప్రతాప్ మాట్లాడుతూ– ‘‘నిఖిల్, అనుపమ మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: వసంత్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్‌తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు?
హైదరాబాద్‌పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement