-
సాహోకు బై బై
రెండేళ్ల ‘సాహో’ ప్రయాణం పూర్తి కావస్తోంది. ఒక్కొక్కరుగా టీమ్‌కు బై బై చెబుతున్నారు. తాజాగా ‘సాహో’ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ తన వంతు షూటింగ్ పూర్తి చేశారు. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. 300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీశర్మ, లాల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘సాహో’ టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోందని టీమ్ పేర్కొంది. ‘సాహో’ టీమ్‌కు నీల్ నితిన్ ముఖేష్ వీడ్కోలు పలుకుతూ– ‘‘రెండేళ్లయింది ఈ అద్భుతమైన ప్రయాణం మొదలై. ఈ టీమ్‌తో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలను సంగీత దర్శకుడు జిబ్రాన్ తీసుకుంటున్నారని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: మది. -
పకడో పకడో
విలన్స్‌ను పట్టుకోవడానికి చేజింగ్‌కి రెడీ అవుతున్నారు ప్రభాస్. మరి ఈ చేజింగ్‌కి కారణం తెలియాలంటే ‘సాహో’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ చేజింగ్ సన్నివేశం కోసం రొమేనియా వెళ్లానున్నారట చిత్రబృందం. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్‌లపై ఈ చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. సుమారు వారానికిపైగా ఈ షెడ్యూల్ ఉంటుందని టాక్. ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘సాహో’ సినిమా అప్డేట్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టర్‌తో పాటు, చిత్రం మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తారని వినికిడి. -
ఎంత కష్టం వచ్చిందో
ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్ చేయాలి. దానికోసం రెండు భాషల్లో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కోసం రెండు సినిమాల కష్టం పడాల్సిందే అంటున్నారు శ్రద్ధా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సాహో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. పెద్ద సెట్స్, లొకేషన్స్ చేంజ్‌లు ఉన్నాయి. అలాగే ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం కావడంతో ప్రతీ సీన్ రెండు సార్లు యాక్ట్ చేయాలి. ఒకసారి తెలుగులో యాక్ట్ చేస్తాం. అది బాగా వస్తే మళ్లీ అదే సీన్‌ని హిందీలో చేయాలి. అలా కాకపోతే మరోలా. ఈ సినిమా కోసం నా లైన్స్ నేనే గుర్తు పెట్టుకుంటున్నా. కొత్త భాషలో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. చాలా టైమ్ కూడా పడుతుంది. పేరుకి ఒక్క సినిమా అయినా కష్టం రెండు సినిమాలది. అయినా ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవెలిన్ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
ఫ్యాషన్ గాళ్!
సౌత్, నార్త్ అన్న తేడాలు లేకుండా ఎక్కడ మంచి పాత్రలు ఉంటే అక్కడ వాలిపోతున్నారు హీరోయిన్ అదా శర్మ. తాజాగా ఆమె బాలీవుడ్లో ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఫ్యాషన్ గాళ్‌గా కనిపించనున్నారు అదా శర్మ. ఇందుకోసం ఆమె అప్పుడే లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్‌పై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ‘‘చిన్నతనం నుంచే ఫ్యాషన్ సినిమాలు చూసే అలవాటు ఉంది. సో ఈ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుందనుకుంటున్నాను. అలాగే నా పాత్రకు ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉంది’’ అని చెప్పుకొచ్చారు అదా. ఇప్పటి వరకు హీరోయిన్ గురించే చెప్పాం. ఇప్పుడు హీరో విషయానికి వస్తే... బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో హీరోగా నటించనున్నారు. ఇంకో విశేషం ఏంటంటే... నీల్ నితిన్ బ్రదర్ నామాన్ నితిన్ ముఖేష్ ఈ సినిమాతో బాలీవుడ్లో దర్శకునిగా పరిచయం కానున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. అంటే తమ్ముడు డైరెక్షన్లో అన్నయ్య హీరో అన్నమాట. తెలుగులో ప్రభాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
గాయం.. ఓ జ్ఞాపకం
దెబ్బలు తగిలితే ఎవరైనా బాధపడతారు. కానీ ఇక్కడున్న ఫొటో చూశారుగా. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, నీల్ నితిన్ ముఖేష్ ఎలా నవ్వుతున్నారో. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ ముగ్గురూ సినిమాలో భాగంగా ఓ యాక్షన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన తర్వాత ఇలా నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చారు. ఉత్తుత్తి గాయాలే అయినప్పటికీ యాక్షన్ సీన్ అంటే కష్టమే కదా... అందుకే ఇలా రిలాక్స్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో నవీన్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. ‘‘ఇప్పుడే ఫైట్ కంప్లీట్ చేశాం. నా షూటింగ్ పూర్తయింది. నేను తెలుగులో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్రబృందం సహకారం మరచిపోలేనిది’’ అని పేర్కొన్నారు నీల్. అంటే ఈ సినిమా గాయాలు ఆయనకు ఓ మధుర జ్ఞాపకం అన్నమాట.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement