-
తండ్రి అపరకర్మలు నిర్వర్తించిన దేవిశ్రీప్రసాద్
కోటిలింగాలరేవులో పిండప్రదానం గోదావరిలో అస్థికల నిమజ్జనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన తండ్రి, ప్రసిద్ధ రచరుుత సత్యమూర్తికి రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన పిండప్రదానం చేశారు. దేవిశ్రీ తమ్ముడు సాగర్‌తో కలిసి బుధవారం కోటిలింగాలరేవులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నదిలో నీరు తక్కువగా ఉండడంతో రెండు పడవల సాయంతో నది లోపలికి అస్థికలను నిమజ్జనం చేశారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ తన తండ్రికి రాజమండ్రి అంటే చాలా ఇష్టమైన ప్రదేశమని, అందుకే ఆయన అస్థికల్ని మొదట ఇక్కడ నిమజ్జనం చేసి, తర్వాత కాశి, ఇతర పుణ్యక్షేత్రాల్లో నిమజ్జనం చేయనున్నామన్నారు. జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాకలో తన తండ్రి ఆయన తల్లిదండ్రులకు ‘సూర్యోదయం’ పేరుతో ఇంటిని నిర్మించారని చెప్పారు. ఆయనకు ఎంతో ఇష్టమైన సొంత గ్రామంలోనే ఆయన విగ్రహాన్ని నెలకొల్పే యోచన ఉందన్నారు. ఆయన పుట్టిన రోజైన మే 24న వెదురుపాకలో జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఆయన పేరుపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నిమజ్జనం అనంతరం దేవిశ్రీ అక్కడి శివాలయంలో పూజలు నిర్వహించారు. కాగా దేవిశ్రీప్రసాద్ రాక గురించి తెలిసి పలువురు అభిమానులు కోటిలింగాలరేవుకు వచ్చారు. -
కాపీ కొట్టమంటే సినిమానే వదులుకుంటా!
‘‘నాకు నచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన నిర్మాతగా చేసిన ‘కుమారి 21 ఎఫ్’ ఘనవిజయం సాధించాలని కోరుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చుతుందా అని టెన్షన్ ఉండేది. సుకుమార్ మాత్రం బలంగా నమ్మారు. రీ-రికార్డింగ్ కూడా పూర్తి చేశాక, ‘బ్లాక్ బస్టర్ ఖాయం’ అని సుకుమార్‌తో అన్నాను. మా నమ్మకం హిట్టయ్యింది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. రాజ్‌తరుణ్‌తో సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ‘కుమారి 21 ఎఫ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయానందంతో దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.. * నాకు చిన్నా, పెద్దా తేడా లేదు. ఏ సినిమా అయినా ఒకటే. మంచి పాటలివ్వడానికి సబ్జెక్ట్‌లో స్కోప్ ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘అభి’ వంటి చిత్రాలు చేశాను. ఆ సినిమాలో ‘వంగ తోట మలుపు కాడ...’ పాట నాకు బాగా నచ్చుతుందని ఇప్పటికీ అల్లు అరవింద్‌గారు అంటుంటారు. పాటల కంపోజింగ్‌కి నేను విదేశాలకు వెళ్లను. నా రికార్డింగ్ స్టూడియోలోనే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, దర్శక-నిర్మాతల ఇష్టం మేరకు ‘అత్తారింటికి దారేది’కి బార్సిలోనా వెళ్లాను. మూడు రోజుల్లో మూడు పాటలు పూర్తి చేశాను. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ కోసం విదేశాలకు వెళ్లాను. నాలుగు రోజుల్లో మూడు పాటలు చేసేశాను. * ఏ ట్యూన్ చేసినా అది స్వయంగా నేనే చేయాలనుకుంటాను. కాపీ ట్యూన్స్ జోలికి వెళ్లను. నా కెరీర్ కొత్తలో ఓ దర్శకుడు ఓ హాలీవుడ్ సాంగ్ చూపించి, అలా చేయమన్నాడు. అప్పుడు నేను ‘సారీ సార్.. మనం భవిష్యత్తులో కలిసి పని చేద్దాం. ఇప్పుడు నా వల్ల కాదు’ అన్నాను. ‘మరీ ఇంత యాటిట్యూడా? పైకి రావు’ అన్నారు. నవ్వుకున్నాను. మొన్నా మధ్య ఫలానా సంగీతదర్శకుడు చేసిన పాట ఫలానా పాటకు కాపీ అంటూ ఎవరో సర్వే నిర్వహించారు. అందులో నా పేరు లేదు. ‘నవ్వు దొరకవా?’ అన్నారు. ఎవరైనా దర్శకులు నా దగ్గర మరో ట్యూన్‌ని కాపీ కొట్టమంటే, సినిమానే వదులుకుంటాను తప్ప ఎప్పటికీ కాపీ చేయను. మనకున్నవి ఏడే స్వరాలు. ఆ స్వరాల చుట్టూ పాట తిరిగే క్రమంలో ఏదో చిన్న సౌండ్ మరేదో పాటలో విన్నట్లు అనిపించవచ్చు. దాన్నేం చేయలేం. * పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కోసం ఓ సాంగ్ చేశాను. ఒక మంచి మాస్ బీట్ విని, ‘నీ ట్యూన్‌తో నాకు చాలా కిక్ ఇచ్చావ్. నువ్వు చేసినదానికన్నా డబుల్ డ్యాన్స్ చేస్తాను’ అని పవన్ కల్యాణ్ ఫోన్ చేసి, అన్నారు. * అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటివాళ్లు నన్ను హీరోగా పెట్టి, సినిమాలు చేస్తామంటున్నారు. తమిళం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ‘100% లవ్’ చిత్రంలో నన్ను హీరోగా నటించమని అడిగారు. అప్పుడు చెయ్యలేదు. సంగీతదర్శకుణ్ణి కాబట్టి, మ్యూజిక్ బేస్డ్ సినిమా చేశామా? అన్నట్లు కాకుండా కథాబలం ఉన్న చిత్రాలైతే చేస్తా. ఇప్పుడు మనకు చాలామంది హీరోలున్నారు. అందుకని అత్యవసరంగా నేను హీరోగా రంగంలోకి దిగాల్సిన పని లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
400 ఓ జోకు.. 200 సీట్లే కష్టం: బీజేపీపై ఎంపీ శశిథరూర్ సెటైర్లు
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
Advertisement