-
మానవ్‌జిత్ విఫలం
గ్రనాడా (స్పెయిన్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గుతాడని ఆశించిన భారత అగ్రశ్రేణి ట్రాప్ షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ కీలకదశలో తడబడ్డాడు. క్వాలిఫయింగ్ తొలి నాలుగు రౌండ్లలో 25కు 25 పాయింట్లు స్కోరు చేసి 100 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ చివరిదైన ఐదో రౌండ్లో రెండుసార్లు గురితప్పాడు. 25 పాయింట్లకు 23 సాధించాడు. ఓవరాల్‌గా 123 పాయింట్లతో మరో ఆరుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. మరో నలుగురు 124 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. దాంతో ఫైనల్లో మిగిలిన రెండు స్థానాల కోసం ఆరుగురి మధ్య ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ విఫలమయ్యాడు. తుదకు పదో స్థానంలో నిలిచాడు. టాప్-6లో ఉన్నవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అనీసా సయ్యద్ 14వ, రాహీ సర్నోబాత్ 21వ, పుష్పాంజలి రాణా 53వ స్థానాల్లో నిలిచారు. -
ఈ ఏడాది ఎంతో కీలకం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా సిద్ధమయ్యేందుకు తనకు ఈ ఏడాది ఎంతో కీలకం కానుందని భారత షూటర్ మానవ్జిత్సింగ్ సంధూ అన్నాడు. ఇటీవల ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన మైకేల్ డైమండ్‌ను ఓడించి స్వర్ణం సాధించిన మానవ్‌జిత్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో విజయం తాను సరైన మార్గంలోనే పయనిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపాడు. ‘నా శిక్షణ, టెక్నిక్ సరైన విధంగానే ఉన్నాయని తాజా విజయం చాటుతోంది. మున్ముందు కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరముంద’ని మానవ్‌జిత్ అన్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement