liquor party
-
రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై పోలీసుల దాడి
శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో నిర్వహించిన పార్టీ పై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. అను మతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించారని, డ్యూ టీ ఫ్రీ విదేశీ మద్యం వినియోగించారని గుర్తించా రు. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు కొకైన్ వినియో గించి ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు రాజ్ పాకాల, మద్దూరి విజయ్‌పై మోకిలాా పోలీసులు, రాజ్ పాకాలపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోకిలా ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. ‘‘రాజ్ పా కాల నానక్‌రామ్‌గూడలో ఈటీజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అందులో సీఈఓగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్ వాసి మద్దూరి విజయ్‌కు ఫ్యూజన్ యాక్స్ పేరుతో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. రాజ్ పాకాల హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న షీర్మాథే ప్రాపర్టీస్‌లో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించారు. అందులో తరచుగా వీకెండ్ పార్టీలు ఇస్తూ.. స్నేహితులు, తమ సంస్థల్లోని ఉద్యోగులతో కలిసి పేకాట ఆడుతున్నారు. ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్న విజయ్ను శనివారం రాత్రి తన ఇంట్లో నిర్వహిస్తున్న దీపావళి పార్టీకి రావాలంటూ రాజ్ పాకాల ఆహ్వానించారు. ఈ పార్టీలో వీరిద్దరితో సహా 38 మంది పాల్గొన్నారు.’’ అని పోలీసులు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి.. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీపై మోకిలా పోలీసులకు శనివారం రాత్రి సమాచారం అందింది. ఠాణాలోని జనరల్ డైరీలో ఎంట్రీ నమోదు చేసిన అధికారులు.. నార్సింగి ఏసీపీ నుంచి సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. ఆపై ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్), ఎక్సైజ్ పోలీసులతో కలసి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాజ్ పాకాల ఇంటిపై దాడి చేశారు. ఎలాంటి ఈవెంట్ పరి్మషన్ లేకుండా పార్టీలో స్థానిక లిక్కర్‌ను, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యాన్ని వినియోగిస్తున్నట్టు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన పురుషులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్టు తేలింది.మహిళా పోలీసుల సాయంతో ఆ ఇంట్లో ఉన్న మహిళలకు డ్రగ్స్ పరీక్షలు చేయడానికి పోలీసులు ప్రయతి్నంచగా.. వారి నుంచి విముఖత ఎదురైంది. ఇక ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు విదేశీ మద్యం, పేకాటకు సంబంధించిన వస్తువులు, పేక ముక్కలను స్వా«దీనం చేసుకున్నారు. 16 మంది మహిళలు సహా 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.’’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పేకాట నిర్వహణ, ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంపై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి, అందులో రాజ్ పాకాల, విజయ్‌లను నిందితులుగా చేర్చారు. ఇక అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల, ఆయన సోదరుడి నివాసాల్లో సోదాలుగచ్చిబౌలి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జన్వాడలోని రాజ్ పాకాల ఇంట్లో పారీ్టపై శనివారం రాత్రి దాడి చేసిన పోలీసులు.. ఆదివారం రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, తమ సిబ్బందితో, భారీ పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శైలేంద్ర నివాసంలో సోదాలు చేశారు. షో కేస్లు తాళాలు వేసి ఉండటం, తాళంచెవులు లేకపోవడంతో వాటిని పగలగొట్టి తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి రాజ్ పాకాల విల్లాలో సోదాలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి రాజ్ పాకాల బంధువులకు మరో విల్లాలో తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల నిరసన సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఒరియన్ విల్లాస్ వద్దకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకునేందుకు ప్రయతి్నంచారు. ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటే ఇళ్లలో సోదాలు చేయడం ఏమిటని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న రాయదుర్గం పోలీ సులు కల్పించుకుని సోదాలకు సహకరించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్‌కుమార్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మన్నె క్రిశాంక్, జయసింహ తదితరులను అదుపులోకి తీసుకుని, పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్ నివాసం వద్ద హడావుడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లోనూ సోదాలు జరపబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆదివారం.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారి ని కేటీఆర్ ఇంట్లోకి అనుమతించలేదు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముమ్మరంగా దర్యాప్తు.. రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన మద్దూరి విజయ్ను విచారిస్తున్నారు. ఆ డ్రగ్‌ను తనకు రాజ్ పాకాల ఇచ్చారని విజయ్ చెప్పారని.. ఈ క్రమంలో రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచి్చంది? ఎవరు విక్రయించారు? ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. విజయ్ను పార్టీ జరిగిన ప్రాంతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజ్ పాకాలను ఆదివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్.. మధ్యాహ్నం 2 గంటలకు మోకిలాా పోలీస్‌స్టేషన్‌కు విచారణ కోసం రావాలని ఆదేశించారు. కానీ రాజ్ పాకాల ఈ విచారణలకు హాజరుకాలేదు. ఆయన మొబైల్ స్విచాఫ్ వస్తోందని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
హన్మకొండ: ప్రసూతి ఆస్పత్రి మహిళా సిబ్బంది నిర్వాకం వైరల్
సాక్షి, హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందు పార్టీతో హల్ చల్ చేశారు వాళ్లు. ఏకంగా స్టాఫ్ రూమ్‌లో బీర్లు తాగుతూ చిలిపి చేష్టల విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. వైరల్ వీడియో ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్ మరొక జీఎన్ఎం కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్లు వెకిలి చేష్టలకు పాల్పడుతుండగా.. ఎవరో వీడియో తీశారో. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. విచారణకు ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది మందు పార్టీతో ఇలా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్ గా మార్చిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో మందు పార్టీపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి. ‘వారం రోజుల క్రితం జరిగిన ఘటన తమ దృష్టికి రాగానే పిలిచి మందలించాను. స్టాప్ రూమ్ లో అలా చేయడం తప్పేనని సారీ చెప్పారంటున్న సూపరింటెండెంట్. మొదటి తప్పుగా భావించి మందలించి వదిలేశాము.ఇంకోసారి ఇలా జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాను. బర్త్‌డే పార్టీ సందర్భంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నామని వివరణ ఇచ్చారు’ అని తెలిపారు సూపరింటెండెంట్. -
మునుగోడు ఓటర్లకు పెద్ద ఎత్తున దావత్ లు
-
హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..? వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. (చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?) -
రామంతపూర్‌లో రెచ్చిపోయిన మందు బాబులు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మందుబాబులు రెచ్చిపోయారు. కర్ఫ్యూ అంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా మెయిర్ రోడ్డుపై మందు పార్టీ చేసుకున్నారు. రామంతపూర్‌లోని టీవీ స్టూడియో ప్రధాన ద్వారం ముందు, పోలీస్ చెక్‌పోస్ట్‌కు కూత వేటు దూరంలో మందు బాబులు దర్జాగా పార్టీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెయిన్ రోడ్డుపై కొందరు మందు పార్టీ చేసుకునేది పోలీసులు గమనించినా ప్రేక్షకపాత్రే వహించారని, సంఘటనా స్థలానికి మీడియా చేరుకోగానే అప్రమత్తమైన పోలీసులు వారిపై పిటీ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని స్థానికలు విమర్శిస్తున్నారు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. -
కర్ఫ్యూ టైం: మెయిన్ రోడ్డుపై మందు పార్టీ
-
గాంధీ ఆస్పత్రిలో మందు పార్టీ జరగలేదు
గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో మందు పార్టీ జరగలేదని, కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ గుండెపోటుతోనే మృతి చెందాడని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజా రావు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలి పారు. గాంధీ ఆస్పత్రి సెల్లార్లో కొంత మంది కాంట్రాక్టు సిబ్బంది ఈ నెల 16న రాత్రి మందు పార్టీ చేసుకుని ఇంటికి వెళ్లారని, వారిలో శ్రీనివాస్ అనే కాంట్రాక్టు ఉద్యోగి ఇంటికి వెళ్లిన తర్వాత వేకువజామున మృతి చెందాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలి సిందే. దీంతో ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఐదుగురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఆర్ఎంఓ–1 జయకృష్ణ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్ధో పెడిక్, ఆప్తమాలజీ హెచ్ఓడీలు సుబోధ్ కుమార్, సత్యనారాయణ, రవిశేఖర్, ఫల్మ నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ నరేంద్ర కుమార్‌లు ఉన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సోమవారం ఆస్పత్రి ప్రాంగణంలోని సెమినార్ హాలులో ఘటన జరిగిన రోజు రాత్రి విధులు నిర్వహించిన పలువురు కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో మందు పార్టీ జరగ లేదని ఆస్పత్రి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసిందని ఆస్పత్రి సూపరింటెం డెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు. -
‘గాంధీ’లో మందు పార్టీ
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌తో పోరాడుతుంటే, కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. ఆస్పత్రి సెల్లార్‌లోని ఓ గదిలో అర్ధరాత్రి వరకు పూటుగా తాగి తందనాలాడారు. వేకువజామున ఇంటికి వెళ్లిన వీరిలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందడం కలకలం రేపింది. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోదరులైన శ్రీనివాస్, నరేష్, నగేష్ కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్‌లోని సీఎస్డీ విభాగానికి చెందిన గదిలో వీరు ముగ్గురితో పాటు మరో ఇద్దరు కలిసి మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు. అనంతరం అవుట్సోర్సింగ్ ఉద్యోగితో మరో ఫుల్‌బాటిల్ తెప్పించుకుని అర్ధరాత్రి వరకు తాగి, వేకువజామున ఇళ్లకు వెళ్లారు. ఇంటికి వెళ్లాక ముగ్గురు సోదరుల్లో ఒకడైన శ్రీనివాస్ (38) హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు భావించారు. మృతుడు శ్రీనివాస్ ఆస్పత్రి స్టెరిలైజేషన్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ మృతితోపాటు ఆస్పత్రి ప్రాంగణంలో మందు పార్టీ చేసుకున్నట్టు ఆస్పత్రి అధికారులకు తెలిసింది. దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, శ్రీనివాస్ మృతిపై ఫిర్యాదు అందలేదని ఆస్పత్రి అధికారులు చెప్పారు. మూడంచెల భద్రత ఏమైంది? గాంధీ ఆస్పత్రిలో 300 మంది పోలీసులతో మూడంచెల భద్రత వ్యవస్థ ఉంది. వీరుకాక, మరో వంద మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరి కళ్లుగప్పి ఆస్పత్రి ప్రాంగణంలోకి మద్యం బ్యాటిళ్లు రావడం గమనార్హం. ఆస్పత్రి సెల్లార్లో మద్యం విందు జరిగినట్టు దృష్టికి వచ్చిందని డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావునేత, ఆర్ఎంఓ జయకృష్ణ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. విచారణ జరుపుతాం ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్లో కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం విందు చేసుకున్న విషయమై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి విచారణ చేపడతాం. వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌తో పోరాడుతుంటే కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది ఇలాంటి పనులతో చెడ్డపేరు తెస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సెల్లార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాం. సెల్లార్లో ఉన్న తుక్కును తరలించి, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్ది, అక్కడ కొన్ని వైద్య విభాగాలను ఏర్పాటు చేసే యోచన ఉంది. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నగరిలో టీడీపీ నేత నిర్వాకం బట్టబయలు
సాక్షి, చిత్తూరు : నగరిలో ఓ టీడీపీ నేత నిర్వాకం బట్టబయలైంది. టీడీపీ నేత పురుషోత్తం నాయుడు లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచాడు. నగరి సమీపంలోని ఎస్వీపురంలో గత మూడు రోజులుగా భౌతికదూరం పాటించకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. పురుషోత్తం నాయుడుతో పాటు పదుల సంఖ్యలో జనాలు గుమిగూడి విందు భోజనాలతో జల్సాలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రెడ్ జోన్లో నగరి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా భౌతిక దూరం పాటించకుండా విందు భోజనాలు చేయడం గమనార్హం. (కరోనా: సింగరేణి రూ. 40 కోట్ల భారీ విరాళం ) పురుషోత్తం నాయుడు తాను బిర్యానీ తింటూ ఇతరులకు పెడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా టీడీపీ తరపున ఎంపీటీసీగా పురుషోత్తం నాయుడు నామినేషన్ దాఖలు చేశాడు. (ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?) -
పోలీసుల మందుపార్టీ, వీడియో లీక్
నల్గొండ : ఓ వైపు విమర్శలు వస్తున్నా...మరోవైపు పోలీసులు మాత్రం తమ తీరు మార్చుకోవటం లేదు. విధుల్లో ఉన్నామనే విషయాన్ని మర్చిపోతూ ప్రవర్తించటం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు మందు పార్టీ చేసుకున్నారు. తప్పతాగి రెస్ట్‌రూంలో చిందేశారు. గుడుంబా తయారీకి వత్తాసు పలికిన పోలీసులు నల్లబెల్లం వ్యాపారితో కలిసి స్టేషన్ ఆవరణలోనే జల్సా చేశారు. డాన్సులతో ఇరగదీశారు. కాగా సీనియర్ల తీరును నిరసిస్తూ జూనియర్ సిబ్బంది...ఆ జల్సా పార్టీ వీడియోను లీక్ చేశారు. మరోవైపు ఆలేరు పోలీసుల జల్సాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
పోలీసుల భయంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
పోలీసులు వస్తున్నారన్న భయం.. ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది. నర్సీపట్నంలోని నేలబావిలో పడిపోయి చంద్రశేఖర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. అయితే అతడి మృతికి మద్యం పార్టీయే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం రాత్రి ఊరి చివర పొలాల్లో కొంతమంది యువకులు మందుపార్టీ చేసుకున్నారు. అయితే అక్కడకు పోలీసులు వస్తున్నట్లు సమాచారం అందడంతో వారు అరెస్టు చేస్తారన్న భయంతో యువకులంతా పరుగులు తీశారు. వారిలో చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. అలా పరుగు తీసేటప్పుడు చంద్రశేఖర్ చూసుకోకుండా నేలబావిలో పడిపోయి మరణించాడు.