-
ఆయన ఓ లెజెండ్!
హాస్య నటుడు వడివేలును లెజెండ్‌గా నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆయన నటించకుంటే కత్తిసండై చిత్రం ఉండేది కాదని కూడా అన్నారు. విశాల్ నటిస్తున్న తాజా చిత్రం కత్తిసండై. ఆయనకు జంటగా తమన్నా నటించిన ఈ చిత్రంలో చాలా విరామం తరువాత నటుడు వడివేలు హస్యపాత్రలో నటించారు. మరో హాస్య నటుడు సూరి, జగపతిబాబు, అరుణ్ ఆరోరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మియించిన ఎస్.నందగోపాల్ తన మెడ్రాస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. హిఫ్ హాఫ్ తమిళా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు, ప్రచార చిత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. వడివేలు మాట్లాడుతూ తనని అందరూ చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటిస్తున్నారని అంటున్నారని, నిజం చెప్పాలంటే తనకు గ్యాప్ లేదు, తనకెవరూ ఆఫ్ పెట్టలేరని, తానేప్పూడూ టాపేనని అన్నారు. మంచి కథల కోసమే ఎదురు చూశానని, అలాంటి సమయంలో దర్శకుడు సురాజ్ చెప్పిన కత్తిసండై చిత్ర కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించానని తెలిపారు. తేని నడిగర్సంఘాన్ని మళ్లీ తీసుకొచ్చి దాన్ని వృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న విశాల్ ఈ చిత్రం మరో విజయాన్ని అందిస్తుందని అన్నారు. తరువాత చిత్ర కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ దర్శకుడు సురాజ్ తనకు కథ చెప్పగానే ఇందులో నటించడానికి నటుడు వడివేలు కాల్షీట్స్ తీసుకోండని చెప్పానన్నారు. కథ వినగానే ఇందులో ఆయన నటిస్తే బాగుంటుందని అనిపించిందన్నారు. వడివేలు ఈ చిత్రంలో నటించడం సంతోషం అన్నారు. తమ కాంబినేషన్లో ఇది మూడో విజయం అవుతుందని అన్నారు. నిజం చెప్పాలంటే వడివేలు నటించకుంటే కత్లిసండై చిత్రం ఉండేది కాదనీ, అలాంటి లెజెండ్‌తో మళ్లీ కలిసి నటించడం సంతోషంగా ఉందని విశాల్ పేర్కొన్నారు.కత్తిసండై వినోదభరిత అంశాలతో కూడిన పూర్తి కమర్శియల్ ఎంటర్టెరుునర్ కథా చిత్రం అని దర్శకుడు సురాజ్ తెలిపారు. -
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా
కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ యమా స్పీడు మీద ఉన్నాడు. నడిగర్ సంఘం కార్యకలాపాల్లో భాగం పంచుకుంటునే వరుసగా సినిమాలను కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కత్తిసండై సినిమాలో నటిస్తున్న విశాల్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను మొదలుపెడుతున్నాడు. విశాల్ హీరోగాతెరకెక్కుతున్న కత్తి సండై దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాళన్ అనే సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాలో విశాల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ దర్శకుడు, నటుడు భాగ్యరాజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 23న ప్రారంభమవుతున్న ఈ సినిమాను విశాల్ తన సొంతం నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నాడు. -
అయితే నాకేంటి?
అవకాశవాదం అన్నది అన్నిచోట్లా ఉన్నా చిత్ర పరిశ్రమలోనే ఇంకొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఏరు దాటేవరకూ మల్లన్న, దాటిన తరువాత బోడిమల్లన్న అన్న సామెతను నిజం చే సేలా కొందరి ప్రవర్తన ఉంటుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నటి నయనతార తాను ఒప్పుకున్న పాత్రలో నటించడం వరకే తన డ్యూటీ అన్నంతగా ప్రవ ర్తిస్తారు. చిత్రాలకు సంబంధించిన ఎలాంటి ప్రచారానికి రానని నిక్కచ్చిగా చెప్పేస్తారు. ఏం అంటే అది నా పాలసీ అనే సమాధానం ఆమె నుంచి వస్తుంది. నయనతార బాణీనే మిల్కీబ్యూటీ తమన్నా పాటిస్తున్నారనిపిస్తోంది. అయితే కాస్త భిన్నంగా..చిత్ర ప్రచారానికి రానని నయనతార చెబితే, తమన్నా మాత్రం నాకేంటి అంటున్నారట. బాహుబలి చిత్రం తరువాత అవకాశాలు బాగా పెరగడంతో ఈ అన్నీ పెంచేస్తున్నారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం తమన్నా విశాల్‌కు జంటగా కత్తిసండై చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మద్రాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ ఇప్పుడు విక్రమ్‌ప్రభు, షామిలి జంటగా వీరశివాజీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా మరో పక్క విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా కత్తిసండై చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వడివేలు, సూరి తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విశాల్, తమన్నా కలిసి నటిస్తున్న తొలి చిత్రం కాబట్టి దర్శక నిర్మాతలు నటి తమన్నాను చిత్ర ప్రచారానికి బాగా వాడుకోవాలని భావిస్తున్నారు. కాగా ఈ నెల 29న విశాల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమన్నాను ఆహ్వానించగా తాను ప్రచార కార్యక్రమాలలో పాల్గొననని ఖరాఖండీగా చెప్పారట. ఇదే విధంగా తను నటించిన ధర్మదురై చిత్ర సక్సెస్ మీట్‌కు పిలవగా వస్తే నాకేంటి? అన్న ధోరణిలో మాట్లాడినట్లు, అధనంగా పారితోషికం ఇస్తేనే వస్తానని అన్నారట. దీంతో ఆ చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్ కార్యక్రమాన్నే విరమించుకోవలసి వచ్చిందని తెలిసింది. అందుకే తమన్నా మీకిది తగునా అంటున్నాయి చిత్ర వర్గాలు. -
కామెడీ చిత్రంగా కత్తిసండై
నటుడు విశాల్ అదరగొట్టే యాక్షన్, వడివేలు కడుపుబ్బ నవ్వించే కామెడీతో కత్తిసండై అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం మరుదు చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి కత్తిసండై అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఇందులో హాస్య పాత్రలో నటుడు వడివేల్ నటించనున్నారు. ఈయన హీరోగా అవతారమెత్తిన తరువాత మళ్లీ హాస్యపాత్రలో నటించనున్న చిత్రం ఇదే అవుతుంది. ఇంతకు ముందు కామెడీ పాత్రలో నటించాల్సిందిగా చాలా మంది దర్శక నిర్మాతలు అడిగినా నటించని వడివేలు ఈ కత్తిసండై చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపడం ఆశ్చర్యమే. అయితే ఇంతకు ముందు విశాల్, వడివేలు కలసి తిమురు చిత్రంలో నటించారు. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకి కలసి నటించనున్నారు. ఇక ఈ చిత్రానికి సురాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తలైనగరం, మరుదమలై చిత్రాల్లో వడివేలు నటించారు. ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియోజూలియెట్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఎస్.నందగోపాల్ ప్రస్తుతం విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి విశాల్, విడివేలు కాంబినేషన్లో కత్తిసండై చిత్రాన్ని భారీ విలువలతో నిర్మించనున్నారు. ఇందులో నటించే హీరోయిన్ ఎంపిక జరుగుతోందంటున్న చిత్ర యూనిట్ ఈ నెలాఖరున కత్తిసండై చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇది సూపర్ యాక్షన్, కామెడీతో కూడిన పక్తు కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement