-
సిండ్రిల్లాకు ఓకే!
తమిళ సినిమా: కోలీవుడ్, టాలీవుడ్ దాటి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంచలన నటి రాయ్‌లక్ష్మి. బాలీవుడ్ చిత్రం జూలీ–2 ఆశించిన విజయం సాధించకపోయినా, అక్కడ తనదైన ముద్ర వేసుకున్న రాయ్‌లక్ష్మి.. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతున్నారు. బాలీవుడ్లో యార్, నీయా 2 చిత్రాలతో పాటు మలయాళంలో నాలుగు, కన్నడంలో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించే చాన్స్‌ను కొట్టేసింది. సిండ్రిల్లా అనే ఫాంటసీ, హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. చిన్నారుల కలల ప్రపంచంలో కనిపించే దేవకన్య లాంటి పాత్ర సిండ్రిల్లా. ఈ పేరుతో ఒక చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు ఎస్జే.సూర్య శిష్యుడు వినో వెంకటేశ్ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పడుతున్నారు. ఎస్ఎస్ఐ. ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు 100 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న తొలి చిత్రం సిండ్రిల్లా. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు హర్రర్ ఇతివృత్తంగా పలు చిత్రాలు వచ్చినా, వాటికి పూర్తి భిన్నంగా సిండ్రిల్లా చిత్రం ఉంటుందని అన్నారు. చిత్ర టైటిల్ వినగానే నిర్మాత చిత్రం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను నటి లక్ష్మీరాయ్‌కు పంపామని, ఆ తరువాత ఒక షూటింగ్లో ఉన్న ఆమెను లంచ్ బ్రేక్‌లో కలిసి కథను వినిపించామని చెప్పారు. అంతకు ముందే పంపిన సింగిల్‌లైన్ కథను చదివిన రాయ్‌లక్ష్మి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని, చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు వినో వెంకటేశ్ తెలిపారు. -
అమ్మమ్మ అయిన యంగ్ హీరోయిన్
‘జూలి 2’తో బాలీవుడ్లో సెటిల్ అవుదామనుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బాలీవుడ్ ఈ భామను పట్టించుకోక పోయినా దక్షిణాది పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను ఆదరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక మలయాళ చిత్రం ‘ఓరు కుట్టనందన్ బ్లాగ్’, తమిళ చిత్రం ‘నీయ 2’ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న లక్ష్మీరాయ్ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. 33 ఏళ్ల ఈ హీరోయిన్ అమ్మమ్మ అయ్యిందంట. లక్ష్మీరాయ్‌కి ఇంకా వివాహమే కాలేదు. మరి అలాంటిది అమ్మమ్మ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే ఈ ‘కాంచన’ భామ రెండు కుక్కలను పెంచుకుంటుంది. వాటినే తన సొంత పిల్లల్లా భావిస్తోంది. ఈ మధ్యే ఆ రెండు కుక్కలు మరో రెండు కుక్క పిల్లలకు జన్మనిచ్చాయి. ఇదే విషయాన్ని లక్ష్మీరాయ్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చాలామంది నా ఈడు అమ్మాయిలు ఇపాటికే అమ్మలయ్యారు. కానీ నేను మాత్రం ఏకంగా అమ్మమ్మనే అయ్యాను. నా బిడ్డలు ‘మియు’, ‘లియు’.. ‘టిఫాని’, ‘పకో’ అనే మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు నా ప్రపంచం మరింత పెద్దదయ్యింది’ అనే సందేశాన్ని ట్విటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం లక్ష్మీరాయ్ తన పిల్లల(కుక్కపిల్లల) కోసం క్లౌడ్‌నైన్ ఆస్పత్రిలో ఉన్నారు. తెలుగులో ‘ఖైది నం 150’ సినిమాలో ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రత్యేక గీతంలో మెరిసిన సంగతి తెలిసిందే. -
రత్తాలుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఖైదీ
-
రత్తాలుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఖైదీ
టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేసి లక్ష్మీ రాయ్ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. తరువాత స్పెషల్ సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నా.. హీరోయిన్ గా సక్సెస్ సాధించాలన్న కల మాత్రం అలాగే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ ల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పేరును కూడా రాయ్ లక్ష్మీగా మార్చుకొని బాలీవుడ్ కు పరిచయం అవుతోంది. 2004లో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన జూలీ సినిమా సీక్వల్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. తొలి భాగంలో నేహాదూపియా చేసిన తరహ పాత్రలోనే సీక్వల్ లో రాయ్ లక్ష్మీ నటిస్తోంది. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద రాయ్ లక్ష్మీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ సాధించాలని భావిస్తున్న ఈ బ్యూటీ హాట్ హాట్ సన్నివేశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ముఖ్యంగా దక్షిణాదిలో కూడా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం టాప్ స్టార్ల సాయం తీసుకుంటున్నారు. రాయ్ లక్ష్మీ కెరీర్ లో ఇది 50వ సినిమా కావటంతో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ప్రత్యేక వీడియో మేసేజ్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'జూలీ 2 నీ కెరీర్ లో 50వ సినిమా కావటంతో ఇది నీకు చాలా ప్రత్యేకమైనది. నువ్వు బహుభాషా చిత్రం చేయటం ఆనందంగా ఉంది. నువ్వు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ టు జూలీ 2' అంటూ రత్తాలు కోసం వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియో మెసేజ్ పై స్పందించిన రాయ్ లక్ష్మీ, మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలపటంతో పాటు అభిమానులతో తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. -
జూలీ..లీలీ! జూలీ..లీలీ!!
అదీ సినిమా పాట. జూలీ సినిమాలో ఆ అందగత్తెను చూస్తూ అలాగే మొత్తుకుంటాడు హీరో. హెడ్ లైన్లో మేము రెండు సార్లు అన్నామంటే.. ఇప్పుడు మీరు చదువుతున్న వార్త జూలీ 2 గురించి. హిందీలో సూపర్‌స్టార్ ఖాన్‌తో తన మొదటి సినిమా చేసిన హీరోయిన్, పెళ్లయిన తమిళ్ సూపర్‌స్టార్‌తో అఫైర్ నడిపిన అమ్మాయి అని ఖ్యాతి చెందిన ఫిమేల్ స్టార్ జీవిత కథనమే జూలీ 2 అని ఆ సినిమా చేస్తున్నవాళ్లు చెప్పకపోయినా, ఇండస్ట్రీ అంతా జూలీ అయి కూస్తోంది. జూలీ 2 కథ మరి ఎవరిదనుకున్నారు? ఎస్. అవర్ నగ్మా మేడమ్! వెంటనే ఎవరో పోయి నగ్మాను కదిలించారట.. ‘ఈజ్ దిస్ ట్రూ?’ అని. ఇంగ్లిషులో అడిగినప్పుడు ఇంగ్లీషులోనే సమాధానం చెప్పుతుంది కదా. ‘ఓ ఈజిట్?’ దిస్ ఈజ్ న్యూస్ టు మి టూ. నిజమా. నేనూ ఫస్ట్ టైమ్ వింటున్నాను అని నగ్మా అన్నారట. ‘పద్మావతి’ సినిమానే పబ్లిసిటీ అంతా దండుకుంటోందని జూలీ 2 కి ఈ కొత్త యాంగిల్‌ని దండగా వేశారని అనుకుంటున్నారు. ఏమంటారు మేడమ్.. ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అని ఇంకోసారి అడిగితే.. సినిమా రిలీజ్ కాకుండా ఇలాంటి విషయాల మీద కామెంట్ చేయడం కరెక్టు కాదు అని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
Advertisement