-
Isro: భారత్ స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన
చండీగఢ్: భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్ స్టేషన్ ప్రాథమిక వెర్షన్ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘భారత్ స్పేస్ స్టేషన్‌కు సంబంధించి వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తాం. స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్‌ను 2028లో కక్ష్యలోకి పంపి 2035కల్లా దానికి పూర్తిస్థాయి రూపు తీసుకువస్తాం. స్పేస్ స్టేషన్ క్రూ కమాండ్ మాడ్యూల్, నివాస మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్ అనే విభాగాలు కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్టేషన్ 25 టన్నుల బరువు ఉంటుంది. అవసరమైతే తర్వాత దీనిని విస్తరిస్తాం. స్పేస్ స్టేషన్ ద్వారా మైక్రో గ్రావిటీ పరిశోధనలు చేస్తాం’ అని సోమనాథ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు నింగిలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) మాత్రమే ఉంది. దీనిని అమెరికా, కెనడా, జపాన్, యూరప్ సంయుక్తంగా నిర్మించాయి. 1984నుంచి 1993 మధ్య ఐఎస్ఎస్ను డిజైన్ చేశారు. ఇదీచదవండి.. అయోధ్య వాతావరణం.. ఐఎండీ ప్రత్యేక వెబ్‌పేజీ -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
భారీ కాంట్రాక్ట్, ఎలాన్ మస్క్‌కు జాక్ పాట్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ జాక్ పాట్ కొట్టారు. నాసా నుంచి 1.4 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. ఈ కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా మస్క్ ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఆస్ట్రోనాట్స్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) కు పంపించనున్నారు. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆస్ట్రోనాట్స్‌ను తరలించేందుకు మస్క్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది. తొలిసారి 2014 లో నాసా మస్క్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఆ ఒప్పందాన్ని తాజాగా సవరించింది. తాజాగా సవరించిన ఒప్పందంలో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, ఫాల్కన్ 9 రాకెట్లు కార్గోను, నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని నాసా తెలిపింది. -
సొంతంగా స్పేస్ స్టేషన్‌ని నిర్మించనున్న రష్యా...యూఎస్‌తో మరో ఆరేళ్లు...
వాషింగ్టన్: రష్యా అంతరిక్ష కేంద్రం చీఫ్ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. 2024 నాటికల్లా రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇరు దేశాల మాజీ ప్రచ్ఛన యుద్ధ వ్యతిరేకులు రెండు వారాల కిందటే క్రూ ఎక్స్ఛేంజ్ ఒప్పందంపై సంతకాలు చేసిన తరుణంలో ఆయన ఈ అనుహ్య ప్రకటన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో యూఎస్ వ్యోమోగాములు, రష్యన్ వ్యోమోగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విమానాలు పంచుకునేలా వీలు కల్పించే ఒప్పందం. అదీగాక నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ రష్యా ఐఎస్ఎస్ భాగస్వామ్యాన్ని 2030 వరకు పొడిగించేలా నాసా, రోస్కోస్మోస్ చర్చలు జరుపుతున్నాయని అన్నారు. పైగా ఈ చర్చలు సఫలం అయ్యేవరకు కూడా రష్యా కొనసాగేలా నాసా ప్రణాళికను అమెరికా శ్వేతసౌధం అమోదించిందని చెప్పారు. అంతేకాదు రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తమ సొంత అంతరిక్ష ఔట్‌పోస్ట్‌ను నిర్మించి, పనిచేసేంత వరకు తమతో కలిసి పనిచేయాలని నాసా అధికారులు కోరినట్లు తెలిపారు. పైగా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది కూడా. దీంతో అమెరికాతో రష్యా తన భాగస్వామ్యాన్ని మరో ఆరేళ్లు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 1998లో ప్రారంభించబడిన ఐఎస్ఎస్ యూఎస్-రష్యన్ నేతృత్వంలోని భాగస్వామ్యం నవంబర్ 2020 నుంచి నిరంతరంగా కొనసాగింది. దీనిలో కెనడా, జపాన్‌తో సహా సుమారు 11 యూరోపియన్ దేశాల భాగస్వామ్యాం కూడా ఉంది. ఐతే రష్యా తమ భాగస్వామ్యంలో భాద్యతలన్నింటిని నెరవేర్చి 2024 తర్వాత నుంచి వైదోగాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. కానీ ఐఎస్ఎస్ డైరెక్టర్ రాబిన్ గాటెన్స్ ఈ విషయం గురించి రష్యన్ సహచరులు తనకు తెలియజేయలేదని ఆమె అన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పీటర్స్ కూడా మాస్కో ఐఎస్ఎస్ నుంచి వైదొలగాలనే ఉద్దేశాన్ని అమెరికాకు అధికారికంగా తెలియజేయలేదని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతోనే యూఎస్, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధాన్ని విరమించుకోమని యూఎస్ పదేపదే హెచ్చరించడమే కాకండా ఆంక్షలు విధించేందుకు కూడా యత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాస్త విభేదాలు తలెత్తాయి. ఐతే అమెరికాలోని నాసా అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య అంతరిక్ష కేంద్రంలో ద్వైపాక్షిక సహకారం అలాగే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా విశ్యవిద్యాలయం ప్రస్తుత వ్యోమోగామీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారెట్ రీస్మాన్, రిటైర్డ్ వ్యోమగామీ తాము కలిసే ఉన్నామని, తమ భాగస్వామ్య సహకారం అలాగే కొనసాగుతుందని చెప్పడం విశేషం. (చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా... యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్) -
చెప్పినట్లే చేసింది, ప్రపంచ దేశాలకు రష్యా భారీ షాక్!
ప్రపంచ దేశాలకు రష్యా భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తమ సహకారాన్ని 2024 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంపై ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్ఎస్ను నివాసయోగ్యంగా మార్చే పవర్ సిస్టమ్స్‌ను యూఎస్ నిర్వహిస్తుంది. ఐఎస్ఎస్ నిర్ధేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్‌ను సిస్టంను రష్యా అందిస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా తప్పుబట్టడాన్ని రోగోజిన్ మండిపడ్డారు. ఐఎస్ఎస్ నుంచి తమ సేవల్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో రష్యా స్పేస్ చీఫ్‌గా నియమితులైన యూరి బోరిసోవ్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం యూరి బోరిసోవ్ మాట్లాడుతూ.. 2024లో ఐఎస్ఎస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించే ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఇతర భాగస్వాములకు రష్యా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement