Indian National Lokdal party
-
నఫె సింగ్ హత్య కేసు: వెలుగులోకి కీలక విషయాలు
చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హర్యానా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఢిల్లీకి సమీపంలోని బహదూర్గఢ్ వద్ద ఆదివారం ఆయన హత్యకు గురయ్యారు. అయితే నఫె సింగ్ హత్యపై ఆయన కుటుంబ సభ్యలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నఫె సింగ్ రాథీ హత్యకు ఓ బీజేపీ నేతకు చెందిన కుటుంట సభ్యులే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే గతేడాది ఓ బీజేబీ నేత కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి నఫె సింగ్ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నఫె సింగ్‌ను సదరు బీజేపీ నేత కుటుంబ సభ్యులే అంతమొందించి ఉంటారని ఆరోపిస్తున్నారు. గతేడాది జనవరిలో బహదూర్‌గఢ్‌కు చెందిన మాజీ మంత్రి మాంగే రామ్ నంబార్దార్ కుమారుడు జగదీష్ రాథీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఓ ఆడియోక్లిప్‌ను విడుదల చేశాడు. ‘నఫె సింగ్ రాథీతో పాటు మరికొంత మంది 2019లో నా షాప్, పూర్వికుల నుంచి వచ్చిన కొంత భూమిని నా దగ్గర నుంచి అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. దాని కోసం నన్ను బెదిస్తున్నారు. నఫె సింగ్ రాథీ, ఇతరులపై కేసు కూడా నమోదు చేశాను. అయితే కోర్టులో వారికి ముందస్తు బెయిల్ లభించింది’ అని జగదీష్ రాథీ.. ఆడియోలో మాట్లాడారు. అప్పట్లో ఆ ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. నఫె సింగ్ హత్య కేసులో జగదీష్ రాథీ కుమారుడు గౌరవ్, సోదరుడు సతీష్ ఉన్నారు. నిందితుల్లో బీజేపీ నేత నరేంద్ర కౌశిక్, బహదూర్గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సరోజ్ రాఠీ, ఇంకా ముగ్గురు బంధువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘నేను ఎప్పటి నుంటో అనుమానస్పద కదలికలను గమనిస్తూ ఉన్నా. అందుకే మా నాన్న(నఫె సింగ్ రాథీ) జిమ్‌కు వెళ్లడాన్ని కూడా అడ్డుకున్న. ఎప్పుడూ నా సోదరులు నాన్నకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. చాలా సార్లు నాన్నను టార్గెట్ చేశారు. కానీ, భగవంతుడి దయతో ఆయన బయటపడ్డారు. కానీ, నిందితులు ఒకే అవకాశం కోసం ఎదురు చూశారు’ అని నఫె సింగ్ రాథీ కొడుకు జితేంద్రా మీడియాకు వెల్లడించారు. మరోవైపు.. నఫే సింగ్ రాథీ హత్యపై హర్యానా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. సీబీఐ విచారణతో సంతృప్తి చెందుతామని ఎమ్మెల్యేలంతా అనుకుంటే ఈ కేసును తప్పకుండా సీబీఐకే అప్పగిస్తామని ఆయన అసెంబ్లీలో హామీ ఇచ్చారు. -
ఐఎన్ఎల్డీ హరియాణా చీఫ్ కాల్చివేత
చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హరియాణా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఢిల్లీకి సమీపంలోని బహదూర్గఢ్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒక పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన ప్రైవేట్ గన్మెన్లు ముగ్గురు గాయాలపాలయ్యారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఎస్‌యూవీలో వెళ్తున్న రాథీని కారులో వెంబడించిన దుండుగులు ఆయనపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన దాడిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. -
థర్డ్ ఫ్రంట్ ప్రశ్నే లేదు
ఫతేబాద్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించడానికి కాంగ్రెస్ పార్టీతో కూడిన కొత్త కూటమి ఏర్పాటు కావాలని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఐక్య కూటమి బరిలోకి దిగాల్సిన అవసరముందన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌తో కూడిన కూటమితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దివంగత ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) ఆధ్వర్యంలో ఆదివారం హరియాణాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. నితీశ్‌తోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఐఎన్ఎల్డీ నేత ఓంప్రకాశ్ చౌతాలా, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్బీర్సింగ్ బాదల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన నాయకుడు అరవింద్ సావంత్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనలేదు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా దూరంగా ఉండడం గమనార్హం. కేంద్రంలో మార్పు జరిగితేనే.. రాజకీయ లబ్ధి కోసం హిందూ, ముస్లిం అంటూ ప్రజలను బీజేపీపై విభజిస్తోందని నేతలు నిప్పులు చెరిగారు. తప్పుడు హామీలిస్తూ మభ్యపెడుతోందని విమర్శించారు. జీవనోపాధి లేక రైతులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే పరిష్కార మార్గమన్నారు. కేంద్రంలో మార్పు జరిగితేనే రైతన్నలు, నిరుద్యోగ యువత జీవితాలు బాగుపడతాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మెయిన్ ఫ్రంట్ కావాలి దేశాన్ని సరైన దిశలో నడిపించలేకపోతున్న మేనేజర్(ప్రధానమంత్రి)ని మార్చేయాలని ఏచూరి అన్నారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు లేకుండా విపక్ష ఫ్రంట్ అసాధ్యమని నితీశ్ తేల్చిచెప్పారు. సమస్యలను వదిలి బీజేపీ ముస్లిం, పాకిస్తాన్, మందిర్, మసీద్ జపం చేస్తోందని తేజస్వీ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్డీయే ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. బహిరంగ సభ అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి పదవికి తాను పోటీ పడడం లేదని చెప్పారు. -
ఐఎన్ఎల్డీ ర్యాలీకి పవార్, నితీశ్, ఠాక్రే
న్యూఢిల్లీ: హరియాణాలోని ఫతేబాద్‌లో ఈ నెల 25వ తేదీన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) తలపెట్టిన ర్యాలీకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే నేత కళిమొళి ఈ సమావేశంలో పాల్గొంటారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. మాజీ ఉప ప్రధాని, ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని చేపట్టే ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా వస్తామని తెలిపారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా చారిత్రక ఘట్టం కానుందని పేర్కొన్నా రు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కూడా ఐఎన్ఎల్ డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానాలు పంపారన్నారు. -
కొత్త పార్టీల సత్తా ఎంత?
హరియాణాలో ఒకప్పుడు కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) మధ్య మాత్రమే ప్రత్యక్ష పోరు ఉండేది. జనాభాలో 29శాతం మంది ఉన్న జాట్లు ఎవరికి అండగా ఉంటే వారే ఎన్నికల్లో పై చేయి సాధించేవారు. 2014లో దేశవ్యాప్తంగా మోదీ హవా ఊపేయడంతో హరియాణాలో రాజ కీయం కాషాయం రంగు అద్దుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తొలిసారి అధికార పగ్గాల్ని అందుకుంది. ఈ సారి ఎన్నికలు పోటాపోటీ సమీకరణల మీదే నడుస్తున్నాయి. జాట్ ఓట్లన్నీ ఒక ఎత్తు అయితే∙వారికి వ్యతిరేకంగా దళితులు, వెనుకబడిన వర్గాలు చేతులు కలిపాయి. గత ఎన్నికల్లో బీజేపీ జాట్ వ్యతిరేక వర్గాలన్నింటినీ కూడగట్టి కొత్త సామాజిక సమీకరణలకు తెరతీసింది. కుల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రంలో పంజాబీ ఖత్రీ అయిన మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఒక సాహసం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాట్లు ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరు బాట పట్టారు. ఈ సందర్భంగా జాట్లు ఒకవైపు, సైనీలు, పంజాబీలు, యాద వులు మరోవైపు హోరాహోరీగా ఘర్షణలకు దిగడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించి ఆందోళనల్ని అణిచివేయడానికి ప్రయత్నించింది. చివరికి జాట్లకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లును కూడా తెచ్చింది. కానీ కోర్టు దానిని తిరస్కరించింది. ‘‘ఒకప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగంలో చూసినా జాట్లే కనిపించేవారు. బీజేపీ సర్కార్ అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తోంది‘‘అని గురుగావ్‌కి చెందిన ఓబీసీ యువకుడు ఒకరు వ్యాఖ్యానించారు. విపక్షాల్లో అనైక్యత హరియాణాలో జాట్ల మద్దతు భారీగా ఉన్న ఐఎన్ఎల్డీ పార్టీ కుటుంబంలో చీలికలు ఈ సారి రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో అన్న చర్చ సాగుతోంది. పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలాకు అజయ్. అభయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ జైల్లో ఉన్నారు. అజయ్ కుమారులు, దుష్యంత్, దిగ్విజయ్‌లు తమ చిన్నాన్న అభయ్ పార్టీని నాశనం చేశారని ఆరోపిస్తూ ఐఎన్ఎల్డీ గుడ్‌బై కొట్టేసి జన నాయక్ జనతా పార్టీ (జేపీపీ) పేరుతో పార్టీ పెట్టారు. ఇన్నాళ్లూ ఐఎన్ఎల్డీకి మద్దతుగా ఉన్న జాట్ ఓటు బ్యాంకు అంతా ఇప్పుడు జేపీపీ వైపు మళ్లి పోయింది. ఇటీవల జరిగిన జింద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేజేపీ రెండోస్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమత మవుతోంది. భూపీందర్ హూడా, పీసీసీ అధ్యక్షుడు అశోక్ తన్వార్, కుమారి సెల్జాల మధ్య వర్గ పోరు అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పొత్తులు ఎత్తులు జిత్తులు ఈ ఎన్నికల్లో జేపీపీ కీలకంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆఖరి నిమిషంలో జేపీపీతో చేతులు కలపడంతో బలమైన శక్తిగా మారింది. అంబాలా, సిర్సా, గుర్గావ్, ఫరీదాబాద్ స్థానాల్లో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. గత ఏడాది జాట్ ఆందోళనల సమయంలో కురుక్షేత్ర బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ పార్టీని వీడారు. జాట్యేతరులకు హక్కుల్ని రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ ఆయన లోక్తంత్ర సురక్షా పార్టీ (ఎల్ఎస్పీ) పేరుతో పార్టీ పెట్టారు. బీఎస్పీ, ఎల్ఎస్పీ ఈ ఎన్నికల్లో జత కట్టడంతో బీజేపీ ఓటు బ్యాంకుని ఎంతవరకు చీలుస్తారన్న చర్చ జరుగుతోంది. కురుక్షేత్ర, కర్నాల్, అంబాలాలో ఈ కూటమి ఇతర పార్టీల ఓటుబ్యాంకుని దెబ్బ తీసే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద బహుముఖ పోటీ నెలకొన్న ఏ పార్టీకి కలిసివస్తుందో వేచి చూడాల్సిందే. కొడుకులు, మనవలు, ముని మనవలు హరియాణా అంటేనే కొన్ని కుటుంబాల పాలనకు పెట్టింది పేరు. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు భజన్‌లాల్, చౌధరీ దేవిలాల్, ఓం ప్రకాశ్ చౌతాలా, బన్సీ లాల్ కుమారులు, మనవలు, మునిమనవలు చాలా మంది ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే చెట్టు పేరు చెపితే ఓట్లు రాలే పరిస్థితి లేదని గ్రహించుకున్న వారు నియోజకవర్గాల్లో తాము చేసిన అభివృద్ధిని చూసే ఓట్లు వేయమంటున్నారు. బన్సీలాల్ మనవరాలు శ్రుతి చౌధరిని కాంగ్రెస్ పార్టీ భివాని–మహేంద్రగఢ్ నుంచి బరిలో దింపితే, భజన్‌లాల్ మనవడు భవ్య భిష్ణోయి హిసార్ నుంచి బరిలో ఉన్నారు. చౌతాలా కుటుంబంలో చీలికల కారణంగా ఆయన మనవలు, ముని మనవలు ఎన్నికల బరిలోఉన్నప్పటికీ వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐఎన్ఎల్డీ నుంచి చీలిపోయి కొత్త పార్టీ పెట్టిన చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా హిసార్ నుంచి పోటీ పడుతూ ఉంటే, మరో మనవడు దిగ్విజయ్ చౌతాలా సోనిపత్ నుంచి పోటీ పడుతున్నారు. ఇక కురుక్షేత్ర నుంచి అభయ్ చౌతాలా కుమారుడు అర్జున్ చౌతాలా ఐఎన్ఎల్డీ తరఫున బరిలో ఉన్నారు. పోలింగ్ తేదీ 12 నియోజకవర్గాలు 10 -
హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!
చండీఘడ్: ర్యాప్ మ్యూజిక్ తో, ముఖ్యంగా 'లుంగీ డ్యాన్స్' పాటతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన రాప్ సింగర్ యో యో హానీసింగ్ మరో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హర్యానాలో జరుగనున్న ఎన్నికల ప్రచారంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మద్దతుగా యోయో హానీసింగ్ పాల్గొంటారని ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు కరణ్ చౌతాలా మీడియాకు వెల్లడించారు. అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్ బయటకు వచ్చారు. ఆయన కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చౌతాలా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005 తర్వాత అధికారాన్ని కోల్పోయిన చౌతాలా అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 15 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి.