-
చదువు, క్రీడల్లోనూ టాప్.. ఒకానొక సమయంలో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం!
ఓపక్క హీరోయిన్గా చేస్తూ మరోపక్క ఐటం సాంగ్స్ చేస్తుండటం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అనుకుంటున్నారు. కానీ, ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలుపెట్టింది గెహానా వశిష్ట్. ఫిల్మీ దునియా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లో మెరిసింది. అలా అని కేవలం ఐటం సాంగ్స్‌కే పరిమితం కాలేదు. ఒకటి హీరోయిన్గా చేస్తూ మరొకదాంట్లో ఐటం సాంగ్‌లో నటిస్తూ తన కెరీర్‌ను వెరైటీగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు దాదాపు 80కి పైగా యాడ్స్‌లో నటించింది. తన సినీ జర్నీ ఎలా మొదలైందో ఈ కథనంలో చదివేద్దాం.. చదువు, క్రీడల్లోనూ ముందంజ గెహానా స్వస్థలం ఛత్తీస్‌ఘడ్. ఆమె అసలు పేరు వందన తివారి. ఆమె తండ్రి బొగ్గు గనిలో పనిచేసే అధికారి. తల్లి ఎంబీబీఎస్ డాక్టర్. తాతయ్య(అమ్మ వాళ్ల తండ్రి) రాణి దుర్గావతి యూనివర్సిటీ ప్రిన్సిపాల్. నానమ్మ ఓ కాన్వెంట్ స్కూల్లో ప్రిన్సిపాల్.. ఇలా ఇంట్లో అందరూ విద్యాధికులే! తనను కూడా కంప్యూటర్ సైన్స్‌లో పట్టా అందుకునేవరకు చదివించారు. అయితే గెహానా చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేది. వాలీబాల్‌లో ఆమె జాతీయస్థాయిలో సత్తా చాటింది. రోబోటిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలో ఆలిండియా లెవల్లో 163వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఇదే కాకుండా ఎన్సీసీ, స్కౌట్స్లోనూ చురుకుగా పాల్గొనేది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం అయితే తన విద్యాభ్యాసం అంత ఈజీగా సాగలేదు. చాలామంది కుటుంబాల్లాగే గెహానా ఇంట్లో కూడా అబ్బాయిలకే పెద్ద పీట వేసేవారట. తనకు చదువుకోవాలని ఉన్నప్పటికీ అమ్మాయికి చదువెందుకని తాతయ్య ఒప్పుకోలేదట. ఐఐటీ కౌన్సెలింగ్‌కు కూడా పంపించలేదట! దీంతో మనస్తాపం చెందిన గెహానా ఓ తాడు తీసుకుని ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన ఆమె తల్లి వెంటనే అందరినీ పిలవడంతో గది తలుపులు బద్ధలు కొట్టి ఆమెను రక్షించారు. తనకు చదువుకోవాలని ఉందని కన్నీళ్లు పెట్టడంతో ఆమె కుటుంబం తనను ఐఐటీ చేసేందుకు అనుమతించింది. అలా భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని గెహానా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్గా అయితే చదువుకునే సమయంలో ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది గెహానా. అలా మోడలింగ్ మొదలుపెట్టింది. వరుసగా యాడ్స్ చేస్తున్న సమయంలో వెండితెర రారమ్మని పిలిచింది. దీంతో తెలుగులో అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, నమస్తే, ఐదు 5, బీటెక్ లవ్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కొన్ని చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. అయినా తను కోరుకున్నంత గుర్తింపు అయితే లభించలేదు. గంధీ బాత్ సిరీస్‌లో బోల్డ్‌గా ఓటీటీలు నెమ్మదిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సమయంలో గెహానా బోల్డ్ సిరీస్‌లో నటించింది. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సిరీస్ చేయాలని గెహానా కూడా అనుకోలేదు. అయితే ఈ సిరీస్‌ను తిరస్కరిస్తే ఇక ముందు ఆల్ట్ బాలాజీ వాళ్లు చేసే ఏ షో, సిరీస్‌లో కూడా ఛాన్స్ దక్కదు అని వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేం లేక అంగీకరించింది. ఆ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో తనకు తర్వాత కూడా బోల్డ్ పాత్రలే రాసాగాయి. View this post on Instagram A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth) చదవండి: 87 ఏళ్ల వయసులో లిప్ లాక్.. రొమాన్స్‌కు వయసుతో పనేంటన్న నటుడు -
షెర్లిన్ వల్లే రాజ్‌కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు
నీలి చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో సంబంధాలు కలిగి ఉన్నారని నటి గెహనా వశిష్ట్ అరెస్టు అయ్యింది. 133 రోజులు కస్డడీలో ఉన్న అనంతరం ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శిల్పా దంపతులకు సపోర్టు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది గెహనా. మీడియా దృష్టిని ఆకర్షించి, నిత్యం వార్తల్లో నిలిచేందుకే షెర్లిన్ చోప్రా, శిల్పా శెట్టి దంపతుల పరువు భంగం కలిగేలా మాట్లాడుతుందని ఓ ఇంటర్వ్యూలో గెహనా విమర్శించింది. అసలు బిజినెస్మెన్ రాజ్‌కుంద్రాను నీలి చిత్రాల తీసేలా పురికొల్పింది షెర్లినే అని నటి ఆరోపించింది. కుంద్రా జైలు నుంచి వచ్చాక ఆమెను అందరూ మర్చిపోయారని గుర్తించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడింది. గెహనా ఇంకా మాట్లాడుతూ.. ‘ షెర్లిన్ చోప్రా కోట్లాది రూపాయలు ఆర్జించేందుకు రాజ్ కుంద్రా ఎంతో సాయపడ్డాడు. ఆయన క్రియేట్ చేసిన ఆర్మ్స్ప్రైమ్ యాప్ ద్వారా ఈ స్థాయికి వచ్చిన ఆమె కుంద్రాకి రుణపడి ఉండాలి. ఆమె వల్లే ఆయన ఈ ఊబిలో ఇరుక్కుపోయారు. నిజానికి 2012 నుంచే షెర్లిన్ బోల్డ్ కంటెంట్ చిత్రాలు చేస్తోంది. వారిద్దరూ పరిచయమై కేవలం రెండున్నరేళ్లు మాత్రమే’ అని చెప్పింది. కాగా ఈ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకి ఇటీవలే ముంబై కోర్టు బెయిలు మంజూరు చేసింది. చదవండి: పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన -
పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన
Gehana Vasisth Cries: పోర్నోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్‌కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్ ఫైనాన్షియర్ రాజ్‌కుంద్రాతో సత్సంబంధాలు కలిగి ఉండడం, అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలున్న గెహానా.. గతంలో అరెస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె 133 రోజులుగా కస్టడీలో ఉండగా.. ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరు కావాలనే షరతు విధిస్తూ.. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం బుధవారం వెల్లడించింది. చదవండి: Shilpa Shetty: నేను షూటింగ్స్‌తో బిజీ..ఆ యాప్స్ గురించి నాకు తెలియదు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్‌పై నటి గెహనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: శృంగారానికి, అశ్లీలానికి తేడా తెలుసా?: నటి గతంలో ఆమె బాంబే హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని, అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కు మొన్న సోమవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. -
పోర్నోగ్రఫీ కేసు: నటి గెహానా వశిష్ట్‌కు హైకోర్టులో చుక్కెదురు
ముంబై: పోర్న్ కేసుకు సంబంధించి నటి గెహానా వశిష్ట్‌కు బాంబే హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. భయపెట్టి, డబ్బు ఎర చూపించి అశ్లీల చిత్రాలలో నటించేలా చేశారని గెహానాపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ జారీ చేయాలని ఆమె గత నెలలో కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ పిటిషన్ విచారణకు రాగా, జస్టిస్ ఎస్కే షిండే ఆమెకు బెయిల్ నిరాకరించారు. కొందరు యువతులను బలవంతంగా అశ్లీల చిత్రాల్లో నటింపజేసి ఆ వీడియోలను రాజ్ కుంద్రాకు చెందిన హాట్‌షాట్ యాప్‌లో గెహానా ఉంచారని అభియోగాలు ఉన్నాయి. (చదవండి: షాకింగ్.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు!) -
రాజ్ కుంద్రా కేసు: అభిమానులకు షాకిచ్చిన బాలీవుడ్ నటి
Gehana Vasisth Shocking Video: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా లైవ్‌లోకి వచ్చి అభిమానులకు షాకిచ్చింది. అయితే దీని వెనకాల ఓ కారణముందట! కేవలం బట్టలు లేకుండా ఉండటం వల్ల అందంగా లేదా అసభ్యంగా ఉందో తెలుసుకోవాలనుకుందట! ఇక లైవ్‌లో గెహనా మాట్లాడుతూ.. 'బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి?, అందంగా ఉన్నానా? అసభ్యంగా అనిపిస్తోందా? అశ్లీలంగా ఉందా?' అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'బట్టలు లేకుండా లైవ్‌లోకి వచ్చాను, కానీ ఏ ఒక్కరూ ఇది పోర్న్ అని చెప్పడం లేదు. పైగా నేను బట్టలు వేసుకున్న సందర్భాల్లోనే కొందరు దాన్ని అశ్లీలం అంటున్నారు. మరీ ఇంత కపటధారుల్లాగా ప్రవర్తించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన గెహనా తాను నార్మల్ ఎరోటికా వీడియోలు మాత్రమే చేశానని, పోర్న్ చిత్రాల్లో నటించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాక శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ గతంలో ఒక వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ఆమె మొదటి నుంచీ మద్దతిస్తోంది. View this post on Instagram A post shared by Gehana Vasisth (@gehana_vasisth)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement