festival of art
-
బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది?
అమెరికాలోని నెవాడా స్టేట్‌లో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ సాంస్కృతిక సంబరాన్ని తిలకించేందుకు 70 వేల మంది హాజరయ్యారు. అయితే వారంతా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉత్సవం దక్షిణ నెవాడాలోని ఒక ఇసుక ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఉత్సవ సమయంలో ఇలాంటి విపరత్కర పరిస్థితులు ఏర్పడతాయని ఎవరూ ఊహించలేదు. రెండు మూడు రోజులుగా ఇక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఉత్సవం జరుగుతున్న ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. నడిచేందుకు కూడా వీలు లేనివిధంగా రోడ్లు తయారయ్యాయి. చివరికి టాయిలెట్లు కూడా ఉపయోగించలేని విధంగా మారిపోయాయి. ఈ ఫెస్టివల్‌కు ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, బిలియనీర్లు హాజరయ్యారు. ప్రకృతి వైపరీత్య వాతావరణం కారణంగా ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం. నిర్వాహకులు ఇప్పటికే ఉత్సవాన్ని నిలిపివేశారు. అలాగే ఇక్కడికి కొత్తగా వాహనాల రాకను నియంత్రించారు. కాగా 2018లోనూ ఈ ఉత్సవంలో ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఆ తరువాత రెండేళ్లపాటు కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను నిర్వహించలేదు. ప్రస్తుతం ఉత్సవం జరుగుతున్న ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. అమెరికా ల్యాండ్ మేనేజిమెంట్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అత్యధికంగా బురద పేరుకుపోయిన కారణంగా వాహనాలు రాకపోకలకు సురక్షితం కాదు. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయనే సూచనలు ఉన్నందున ఇక్కడ ఉన్నవారంతా ఆహారాన్ని, తాగునీటిని జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. Looks like God is not down with all the hedonism at Burning Man...#WeWantAnswers #BurningMan #BurningMan2023 #Satanic #SatanicAgenda pic.twitter.com/0knj4thwMW — Isaac’s Army (@ReturnOfKappy) September 4, 2023 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు సంబంధించిన సమాచారం తమకు అందిందని, వైట్‌హౌస్ అధికారులు అప్రమత్తమై, సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు తుపాను కారణంగా ఫెస్టివల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెవాడాలోని బ్లాక్ రాక్ సిటీలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా బర్నింగ్ మ్యాన్ పండుగ 1990లలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇక్కడికి 80 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 1993 సంవత్సరంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య 1000కి పైగా పెరిగింది.ఈ సంఖ్య ప్రస్తుతం 70 వేలకు చేరుకుంది. అమెరికాలో అత్యధిక సెలవులు వచ్చే రోజుల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్కు దూరంగా ఉంటూ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినవారు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తారు. అలాగే వారు రూపొందించిన వస్తువులను వారే తగులబెడతారు. తద్వారా వ్యక్తిలోని అహం అంతమవుతుందని నమ్ముతారు. అందుకే ఈ ఉత్సవానికి బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అనే పేరు వచ్చింది. ఇది కూడా చదవండి: బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? Burning Man is a mess. Upward of 60,000 people are literally stuck in mud and have been ordered to stay put. Food and water running low. pic.twitter.com/HKRZSwkTCY — Citizen Free Press (@CitizenFreePres) September 2, 2023 -
'ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్'.. ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం!
ఇంగ్లండ్‌లో ఏటా ఆగస్టు నెలలో జరిగే ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం. రకరకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతో ఏకంగా పాతికరోజుల పాటు జరిగే సుదీర్ఘ సంబరం కూడా. ప్రస్తుతం ఆగస్టు 5 నుంచి 29 వరకు ఈ సంబరాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఇదివరకు ఎడిన్‌బరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగేది. దీనిని 1947 నుంచి ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్‌గా మార్చారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, జాతులకు చెందినవారు ఈ సంబరాల్లో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనల వంటివి జరుగుతాయి. వీటితో పాటే వీధుల్లోనూ రకరకాల ప్రదర్శనలు, విచిత్రవేషధారణలు, విన్యాసాలు, సాము గరిడీలు చేస్తూ వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. వేదికలపై 3,548 ప్రదర్శనలతో పాటు, ఆరుబయట వీధుల్లో దాదాపు 55 వేలకు పైగా ప్రదర్శనలు ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సంబరాల్లో హాస్య ప్రదర్శనలకే అగ్రతాంబూలం. హాస్య ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన వారికి ఏటా ‘ఎడిన్‌బరో కామెడీ అవార్డ్స్’తో సత్కరిస్తారు. ‘కరోనా’ కారణంగా 2020లో ఈ సంబరాలను నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 6–30 తేదీల్లో నిర్వహించినా, ‘కరోనా’ తీవ్రత కారణంగా 673 ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. ‘కరోనా’ భయం చాలావరకు కనుమరుగవడంతో ఈసారి పూర్తిస్థాయిలో సంబరాలు జరుగుతుండటంతో జనాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. విచిత్రవేషధారులతో, సర్కస్ విన్యాసాల ప్రదర్శనలతో ఎడిన్‌బరో వీథులన్నీ కళకళలాడుతున్నాయి. చదవండి: ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా? -
ఇటువంటి ఫోటోలు మీరు ఎప్పుడు అయినా చూసారా
-
రవీంద్రభారతిలో ‘ట్రైబల్ ఆర్ట్ ఫెస్టివల్’
-
భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది
చార్మినార్/చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యా ప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తు లు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు. అలాగే, అక్కన్నమాదన్న ఆలయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయంతోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. గౌలిపురా నల్లపోచమ్మ దేవాలయం, మేకలబండ నల్లపోచమ్మ ఆల యం, కోట్ల అలిజా కోట మైసమ్మ, కసరట్టా మహంకాళి ఆలయాలు కిటకిటలాడాయి. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగా యి. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించా రు. లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. అహ్మద్‌నగర్ పోచమ్మబస్తీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో వైఎస్సార్ సీపీ నేతలు గట్టు రాంచందర్‌రావు, విజయారెడ్డి, పార్టీ నగర స్టీరింగ్ కమిటీ సభ్యులు జూడి విల్సన్, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జానపద కార్యక్రమాలను వారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రముఖల రాక.. బోనాల వేడుకలకు ప్రముఖులు తరలివచ్చారు. అన్ని ప్ర దాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శా ఖ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించా రు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రు లు జానారెడ్డి, దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, గీతారెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, రేణుకా చౌదరి, మధుయాష్కి, రాపోలు ఆనంద్‌భాస్కర్, వీహెచ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మాజీ మంత్రి బం డారు దత్తాత్రేయ, నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, విమలక్క తది తరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాఫిక్ ఆంక్షలు.. ఓవైపు బోనాల ఉత్సవాలు, మరోవైపు పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు, రాత్రి ముస్లిం సోదరులు షబ్-ఏ-ఖదర్ జాగరణ ఉండడంతో అప్రమత్తమయ్యారు. శాలిబండ నుంచి నయాపూల్ వరకు రంజాన్ మార్కెట్ల ను అనుమతించరు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు రంగం బోనాల జాతరలో విశిష్ట స్థానం ఉన్న రంగం సోమవారం జరగనుంది. లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయంలో సుశీలమ్మ అనే వివాహిత భవిష్యవాణిని వినిపిస్తారు.