-
వణికిస్తున్న డయేరియా
అనంతగిరి : మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా, మలేరియాతో గిరిజనులు బాధపడుతున్నారు. భీమవరం, అనంతగిరి, లుంగపర్తి, పినకోట పీహెచ్‌సీల్లో రోజూ పదుల సంఖ్యలో గిరిజనులు జ్వరాలు, వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. శనివారం గుమ్మకోటకు చెందిన ఇద్దరు, టోకురు నుంచి ఒకరు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా 108 సిబ్బందికి ఇబ్బందిగా మారింది. దీంతో తొలుత టోకురు నుంచి బాధితుణ్ణి ఎస్.కోట.ఆస్పత్రికి చేర్చారు. తర్వాత అదే గ్రామం నుంచి మరో బాధితురాలు అస్వస్థతకు గురవ్వగా, 108 అందుబాటులో లేక, డోలీ మోతతో తరలించారు. అప్పటికి అంబులెన్స గుమ్మకోటకు చేరుకొని మరో ఇద్దరు డయేరియా బాధితులను ఎస్‌కోట ఆస్పత్రికి తీసుకెళ్లింది. గ్రామాల్లో వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండడంలేదని, ఇకనైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. -
మందులున్నాయి
కుక్కకాటు, పాముకాటుకు ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత లేదు అవగాహన లేక ప్రయివేటు వైద్యశాలకు బాధితుల పరుగులు చిత్తూరు(సిటీ): పాము, కుక్కకాటుకు ప్రభుత్వ, ఏరియా, కమ్యూనిటీ వైద్యశాలలు, ప్రాథమిక వైద్యశాలల్లో మందులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ వాటిపై బాధితులకు అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు విఫలమవుతున్నారు. దీంతో కుక్క, పాము కాటుకు గురైన వారు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి భారీగా నష్టపోతున్నారు. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో 300 పడకలున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు, 100 పడకలున్న ఆరు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. 30 పడకలున్న 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లును నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 94 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కుక్కకాటుకు విరుగుడు మందు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు 951, పాముకాటుకు గురైన వారికి వినియోగించే వ్యాక్సిన్లు 860 ఉన్నాయి. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కుక్కకాటు వ్యాక్సిన్లు 848, పాముకాటు వ్యాక్సిన్లు 260 ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (తంబళ్లపల్లె, కుప్పం మి నహా) కుక్కకాటు వ్యాక్సిన్లు 2075, పాముకాటు వ్యాక్సిన్లు 1400 ఉన్నాయి. పైవేటు’ వైపు పరుగులు ప్రభుత్వ వైద్యశాలల్లో కుక్క, పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నా తెలియని బాధితులు తమకు సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల వైపు పరుగులు తీస్తున్నారు. ఒక్కో వ్యా క్సిన్కు రూ. 800 నుంచి 1000 వరకు ఖర్చుచేస్తున్నారు. ఫుల్ కోర్సు రూపంలో మరికొన్ని రోజులు సూది మందులు వేసుకునేందుకు మరో రూ. 10 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. విషంలేని పాములు కరిచినా, తెలియక వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారు. ప్రధాన వైద్యశాలలు, ప్రా థమిక వైద్యశాలల్లో మాత్రం పాము, కుక్కకాటు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలను పోస్టర్ల ద్వారా ప్రచా రం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి తరహా ప్రచా రం లేకపోవడంతో విషం ఉన్న, లేని పాముకాటు గురించి తెలియని అభాగ్యులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. వైద్యాధికారులు స్పందించి పాము, కుక్కకాట్లపై అవగాహన, ప్రాథమిక చికిత్స, వైద్యం చేయించుకునే విధానంపై బాధితులకు తెలపాల్సిన అవసరం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement