Chaitanya Krishna
-
హెబ్బా పటేల్ తాజా చిత్రం.. మంగ్లీ సాంగ్ వచ్చేసింది!
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ధూం ధాం'. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్
-
హీరోగా ఫస్ట్ మూవీ డిజాస్టర్.. కానీ ఇప్పుడు మరో సినిమా!
నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. కానీ అందులో క్లిక్ అయి, పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ తెచ్చుకున్నది అంటే జూ.ఎన్టీఆర్ ఒక్కడే. కానీ గతేడాది ఈ కుటుంబం నుంచి చైతన్య కృష్ణ అనే మరో హీరో లాంచ్ అయ్యాడు. 'బ్రీత్' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఇతడు మరో మూవీకి కమిట్ అయ్యాడు. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) ఎన్టీఆర్ కొడుకుల్లో జయకృష్ణ ఒకరు. ఈయన కొడుకే చైతన్య కృష్ణ. గతంలో జగపతిబాబు హీరోగా వచ్చిన 'ధమ్' మూవీలో పెద్దగా గుర్తింపు లేని ఓ పాత్ర చేశారు. ఒకే ఒక్క సినిమాతో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. కానీ చాన్నాళ్ల తర్వాత 'బ్రీత్' మూవీ చేశాడు. తండ్రి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో కొడుకు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. గతేడాది థియేటర్లలోనే ఏ మాత్రం కలెక్షన్స్ తెచ్చుకోని 'బ్రీత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ క్రమంలోనో ట్రోలర్స్ రెడీ అవుతుండగా.. ఇప్పుడు ఈ హీరో మరో కొత్త మూవీ చేయబోతున్నాడనే వార్త ట్రోలర్స్‌కి స్టఫ్ ఇస్తోంది. జీకే చౌదరి అనే కో-డైరెక్టర్.. చైతన్యకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు ఫేస్బుక్లో ఓ ఫొటో చేశారు. అయితే అన్నీ తెలిసి కూడా మరో సినిమా అంటే 'సాహసమనే చెప్పాలి' అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) -
మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. అంతే వచ్చు!
ఇప్పుడంతా రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. పెద్ద సినిమాలు ఏవీ లేనప్పుడు హీరోల పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. అలా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సమరసింహారెడ్డి మార్చి 2న రీరిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌కు నటుడు నందమూరి చైతన్య కృష్ణ హాజరయ్యాడు. ఈ సినిమాను 14 సార్లు చూశానన్న ఆయన చిత్రంలోని ఓ డైలాగ్ చెప్పే క్రమంలో తడబడ్డాడు. డైలాగ్ సగమే వచ్చు 'మీ ఊరికొచ్చా.. మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. తర్వాతేంటి?' అని నసుగుతూ పక్కనున్నవాళ్లను అడిగాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఫక్కుమని నవ్వారు. అక్కడే ఉన్న యాంకర్ మేనరిజం చూపిస్తూ ఈ డైలాగ్ చెప్పమని అడిగింది. దీంతో అతడు తొడ కొడుతూ.. 'ఒరేయ్ వీరరాఘవ రెడ్డి.. మీ ఊరికొచ్చా.. మీ ఇంటికొచ్చా.. మీ నట్టింటికొచ్చా.. నీ మూతి మీద మొలిసింది మీసమైతే..' అని అక్కడితో ఆపేశాడు. తనకు ఇంతవరకే వచ్చని ముగించేశాడు. అన్నిసార్లు చూశానన్నావ్.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నిసార్లు సినిమా చూశానన్నావ్.. ఒక్క డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నావేంటి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమా చేశాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీని బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. #samarasimhareddyrerelease #nandamuribalakrishna #Balakrishna #chaitanyakrishna pic.twitter.com/6p5D54LYxM — Movies4er (@movies4er) February 26, 2024 చదవండి: ఛాన్స్ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ.. -
మళ్లీ కలసి పనిచేస్తాం
‘‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ‘బ్రీత్’. వంశీకృష్ణగారు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు.. భవిష్యత్‌లో మేము మళ్లీ కలసి పనిచేస్తాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా జంటగా నటించిన చిత్రం ‘బ్రీత్’. బసవతారకరామ క్రియేషన్స్ పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ–‘‘బ్రీత్’ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని అద్భుతమైన కథని రెడీ చేశాను. ‘బ్రీత్’ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ వేడుకలో వైదిక సెంజలియా, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యో నారాయణో హరి..
చైతన్యకృష్ణ హీరో పరిచయమవుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతం అందించారు. -
పాయల్ రాజ్‌పుత్ 'మంగళవారం' నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్
‘అమ్మా డంగురు డంగురు డంగురుమా... అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా... హారతందుకో... మమ్ము ఆదుకో..’ అంటూ మొదలవు తుంది ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియో. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ చిత్రంలోనిదీ పాట. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ భూపతి నిర్మాణ భాగస్వామిగా, స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా వీఎం మహాలింగం పాడారు. ‘‘కొన్నేళ్లపాటు జాతరలలో ఈ పాట వినిపిస్తుంది’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఓ కీలక సందర్భంలో ఈ పాట వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
ఎమోషనల్ బ్రీత్
దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ పెద్ద కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బ్రీత్’. వైదిక హీరోయిన్గా నటించారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో చైతన్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రానికి వంశీకృష్ణ లాంటి దర్శకులతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నాకు ఆయన బ్రీత్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే థ్రిల్లర్ ఫిల్మ్ ‘బ్రీత్’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాం. ‘బ్రీత్’ ఓ ఎమోషనల్ థ్రిల్లర్’’ అన్నారు జయకృష్ణ. -
నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. బ్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నాడు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను కళ్యాణ్‌రామ్ రిలీజ్ చేశాడు. బ్రీత్: అంతిమ పోరాటం అని టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్లో చైతన్య వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడి ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. బసవతారకం క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Here's a glimpse from the Launch of #BreatheFirstLookLaunch by @NANDAMURIKALYAN ❤️🔥#BREATHE 🎬🌟ing #NandamuriChaitanyaKrishna Directed by @VKrishnaakellaMore Updates Loading Soon 💥 #NandamuriJayaKrishna @BTRcreations pic.twitter.com/WWo2BGktRg— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023 Here's the First Look & Title of @BTRCreations Prod No.1 💥Presenting You all #NandamuriChaitanyaKrishna in a Breathtaking Avatar from #BREATHE ❤️🔥A film by @VKrishnaakella#BreatheFirstLook Launched by @NANDAMURIKALYAN 😍More Details Soon! pic.twitter.com/Yy9cUyOGRd— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023 -
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. పోస్టర్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాన్నునారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు హీరోలుగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం కానున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా డెబ్యూ ఇస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Production No.1 from @BTRCreations 💥 Brace Yourselves for the Title Launch on March 5th 🤩 🌟ing #NandamuriChaitanyaKrishna 🤩 A film by @VKrishnaakella 🎬 𝙀𝙫𝙚𝙧𝙮 𝙨𝙞𝙣𝙣𝙚𝙧 𝙣𝙚𝙚𝙙𝙨 𝙩𝙧𝙚𝙖𝙩𝙢𝙚𝙣𝙩 pic.twitter.com/1IvnIv8Djk — Basavatarakarama Creations (@BTRcreations) March 3, 2023 -
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
స్వర్గీయ మహానటుడు నందమూరి తారక రామారావు వారసులు చాలా మంది టాలీవుడ్లో రాణిస్తున్నారు. తాజాగా మరో వారసుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. శనివారం బసవతారకరామ బ్యానర్, తొలి చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘మా అమ్మ, నాన్నగార్ల పేర్లు కలిసొచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్‌కు పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. నాన్నగారికి ఎంతో ఇష్టమైన చైతన్య ఈ బ్యానర్లోని సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీ. అన్నయ్య జయకృష్ణ, దర్శకుడు వంశీకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్‌్టతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు జయకృష్ణ. ‘‘మా నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్’ను బాబాయ్ బాలకృష్ణగారు లాంచ్ చేసి, ఆశీస్సులు అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు చైతన్య కృష్ణ. రెండు షేడ్స్ కల్యాణ్‌రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ శతజయంతి(మే 28) సందర్భంగా ‘బింబిసార’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడిగా, మోడ్రన్ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
'అనగనగా ఓ అతిథి' సినిమా రివ్యూ
చిత్రం: ‘అనగనగా ఓ అతిథి’ తారాగణం: పాయల్, చైతన్యకృష్ణ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: ఆహా. దురాశ దుఃఖానికి హేతువు! ఈ పెద్దబాలశిక్ష సూక్తికి వెండితెర రూపం ‘అనగనగా ఓ అతిథి’. అయితే చిన్న పాయింట్ చుట్టూ కథను అటూ ఇటూ తిప్పి, గంటాముప్పావు చిత్రం తీశారు. కథేమిటంటే..: బీద రైతు కుటుంబం అన్నపూర్ణ, సుబ్బయ్యలది (వీణా సుందర్, ఆనంద్ చక్రపాణి). ఈడొచ్చినా... వయసు, మనసు తొందరపెట్టే కోరికలేవీ తీరక వేగిపోతున్న పెళ్ళీడు కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). జంగమ దేవర భిక్షాటనకు వచ్చి, వాళ్ళింటికి మహాలక్ష్మి వస్తుందని జోస్యం చెబుతాడు. అనుకోకుండా పెట్టె నిండా నగలు, డబ్బుతో ఓ దేశసంచారి శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) ఆ ఇంటికి అతిథిగా వస్తాడు. ఆ రాత్రికి అక్కడే ఉంటానంటాడు. మనుషుల్లో ఉండే కామం, దురాశ, కోరిక, పైశాచికత్వం అనుకోకుండా ఆ రాత్రి మేల్కొంటాయి. అప్పుడు జరిగిన రకరకాల సంఘటనలే మిగతా కథ. ఎలా చేశారంటే..: ఈ సినిమాకు ప్రధాన బలం కీలక పాత్రధారిణి పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్.ఎక్స్ 100’ లాంటి చిత్రాల్లో బొద్దుగా, పూర్తి గ్లామర్‌గా కనిపించిన పాయల్ ఈసారి నాజూకు దేహంతో, డీ గ్లామరైజ్డ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రత్యక్షమయ్యారు. కానీ, తన హావభావాలతో, అభినయించే కళ్ళతో కథలోని తన పాత్ర ప్రవర్తనకు తగ్గట్టు ఎన్నో భావాలు పలికించారు. తల్లి పాత్రలో కన్నడ నటి వీణా సుందర్ జీవించారు (తెలుగుకు తొలి పరిచయం. కన్నడ మాతృకలోనూ ఆమె ఇదే పాత్ర చేశారు). పత్తి ఏకుతున్నప్పుడూ, సారాయి దుకాణంలో షాకింగ్ తెలిసినప్పుడూ తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణిని మర్చిపోయి, ఆ పాత్రనే చూస్తాం. ఎలా తీశారంటే..: చిన్న బడ్జెట్ చిత్రాలను వరుసగా ఓ.టి.టిలో వదులుతున్న వేదిక ‘ఆహా’. ట్రెండ్ లౌడ్ సంస్థతో కలసి, ఈ ‘అనగనగా ఓ అతిథి’ని నిర్మించింది. కన్నడంలో సక్సెసై, అక్కడి కర్ణాటక సర్కారు నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి (వీణా సుందర్) అవార్డులు అందుకున్న ‘ఆ కరాళ రాత్రి’ (2018) చిత్రానికి ఇది రీమేక్. ఓ ప్రసిద్ధ పాశ్చాత్య రచన ఆధారంగా వచ్చిన కన్నడ నాటకం ఆ కన్నడ చిత్రానికి ఆధారం. కన్నడంలో డైరెక్ట్ చేసిన తెలుగు – తమిళుడు దయాళ్ పద్మనాభన్ ఇప్పుడీ రీమేక్‌తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాలుగే పాత్రల చుట్టూ, ఒకే ఇంట్లో తిరిగేలా ఓ పూర్తి నిడివి సినిమా తీయడం కొంత సాహసమే. కథలో ఊహించని ట్విస్టు పెట్టడమూ బాగుంది. కానీ, కన్నడంలో 18 చిత్రాల అనుభవంతో 17 డేస్‌లోనే, రూ. 2.30 కోట్ల తక్కువ బడ్జెట్లో సినిమా తీసిన దర్శకుడు ఈ కథను నడిపించడంలో ఇబ్బంది పడ్డాడు. సినిమాలోని పాత్రల ప్రవర్తన కొన్నిసార్లు లాజిక్కు అందదు. ముఖ్యంగా, ఓ కీలక నిర్ణయం సమయంలో ప్రధాన పాత్రలు తీసుకొనే నిర్ణయానికి హేతువు కనిపించదు. పోస్టర్లలో ఫోటోలకూ, కథకూ సంబంధం లేకపోవడమూ కన్ఫ్యూజింగ్ పబ్లిసిటీ ట్యాక్టిక్స్. అలాంటి తప్పులనూ, కన్నడ ఛాయలనూ, తగ్గిన వేగాన్నీ పట్టించుకోకపోతే, టికెట్ కొనకుండా ఇంట్లోనే చూస్తున్నాం గనక ఈ మాత్రం చాలు లెమ్మని సరిపెట్టుకుంటాం. కొసమెరుపు: సినిమా చూస్తున్నా... సీరియల్ ఫీలింగ్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ పాత్రధారుల నటన, రీరికార్డింగ్ చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు సీరియల్లా సాగే కథనం ఆర్టిఫిషియల్ డైలాగ్స్ లాజిక్కు అందని పాత్రల ప్రవర్తన – రెంటాల జయదేవ -
అనగనగా ఓ అతిథిలో ‘పాయల్’
‘ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్, డిస్కోరాజా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ కీలక పాత్రల్లో నటించారు. దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ నిర్మించిన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో ఈ నెల 20న విడుదల కానుంది. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అనుకోని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఓ ఇంటికి వచ్చిన అతిథి కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే కథాంశంతో దయాల్ అత్యంత ఉత్కంఠ కలిగేలా తెరకెక్కించాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: రాకేష్ బి, సంగీతం: ఆరోల్ కోరెల్లి. -
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు. మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
ఇంటర్నెట్ నేపథ్యంలో....
‘‘దర్శకునిగా కొనసాగుతూ, నిర్మాతగా కొన్ని సినిమాలు తీయాలనుకుని చాలా కథలు విన్నాను. నా దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసే ముంజునాథ్ చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకుంది. అలా తన దర్శకత్వంలో ఈ సినిమా చేశాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. చైతన్యకృష్ణ, అడివి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, నిఖితా నారాయణ్, జాస్మిన్, స్వాతి దీక్షిత్ ముఖ్య తారలుగా పి.బి. మంజునాథ్ దర్శకత్వంలో ఎమ్.వి.కె.రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత జరుగుతుందో, చెడూ అంతే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. కథ నచ్చి ఈ సినిమాలో భాగస్వామిగా చేరానని రాజ్ కందుకూరి చెప్పారు. ఇందులో తమవి చాలా మంచి పాత్రలని చెతన్యకృష్ణ, అడివి శేష్, కమల్ కామరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధీర్ వర్మ, కల్యాణ్ తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
చందమామ కథలు మూవీ స్టిల్స్
-
చందమామ కథలు మూవీ ప్రెస్ మీట్
-
‘చందమామ కథలు’ స్టిల్స్
-
జీవిత పాఠాలు...
‘‘అనుభవాన్ని మించిన గురువు మనిషికి వేరే ఉండరు. జీవనక్రమంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలు వారికి పాఠాలు. ఆ పాఠాల పర్యవసానమే మా చందమామ కథలు’’ అన్నారు మంచు లక్ష్మి. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మంచు లక్ష్మి, చైతన్యకృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, కిశోర్ ప్రధాన పాత్రధారులుగా... చాణక్య బూనేటి నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ కథలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఏం తీయాలనుకున్నానో... అది క్లారిటీతో తీశాను. ఈ నెల ద్వితీయార్ధంలో లోగోను ఆవిష్కరించి, జనవరిలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్లో షూటింగ్‌ని పూర్తిచేయగలిగామని నిర్మాత సంతృిప్తి వ్యక్తం చేశారు. ఇంకా నరేష్, కృష్ణుడు, అభిజిత్, నాగశౌర్య కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల.