-
షారుఖ్ పాట.. ఆపమన్న బేటా
కరోనా పోరాటంలో మేము సైతం అంటూ ఫేస్బుక్ వేదికగా "ఐ ఫర్ ఇండియా" వర్చువల్ కన్సర్ట్‌లో పాల్గొంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు జోయా అక్తర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే డబ్బును కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు గివ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ లిస్టులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే షారుఖ్ లైవ్ కన్సర్ట్‌లో పాల్గొంటున్న సమయంలో ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. షారుక్ పాట అందుకున్న కాసేపటికే కొడుకు అబ్రామ్ ఖాన్ చేరాడు. ఇంకేముందీ.. తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) ఈ పాట మొత్తం కూడా లాక్డౌన్లో ఏం జరుగుతుందో వివరిస్తూ సాగుతుంది. ఇక సాంగ్ పూర్తవగానే అబ్రామ్ను గట్టిగా హత్తుకుని లాలనగా ముద్దు పెట్టుకుంటాడు. అనంతరం మరో పాట పాడతానని రెడీ అవుతుండగా ఆ బుడ్డోడు వచ్చి పప్పా, ఇక చాలు ఆపుతావా.. అని చెప్పాడు. దీంతో ఎందుకొచ్చిన తంటాలే అని హీరో సైతం తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను షారుఖ్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హీరో "అంతా బాగవుతుంది.." అని చెప్పిన వ్యాఖ్యలు నిజమవుతాయంటూ ఆయన అభిమానులు ఆశాభావంతో కామెంట్లు చేస్తున్నారు. నిజానికైతే సైనీ రాజ్ రచించిన ఈ పాటను మనీ హేస్ట్ అద్భుతంగా ఆలపించాడు. దీనికి ర్యాపర్ బాద్షా సంగీతం రూపొందించాడు. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మూడున్నర కోట్లకు పైగా విరాళాలను సేకరించారు. (అడ్డు తప్పుకోండి: అబ్రామ్ అసహనం!) -
‘ఓటింగ్‌కి.. బోటింగ్‌కి తేడా తెలీడం కోసం తీసుకొచ్చా’
వాణిజ్య రాజధాని ముంబైతో సహా దేశవ్యాప్తంగా 71 నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో సినీ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో బాద్షా షారుక్ ఖాన్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చేటప్పుడు తమతో పాటు ఐదేళ్ల తన కుమారుడు అబ్రాంను కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు షారుక్. ఈ విషయంపై స్పందిస్తూ ‘మా చిన్నారికి ఓటింగ్‌కు.. బోటింగ్‌కు తేడా తెలీక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం గురించి తనకు పూర్తిగా అర్థం కావడం కోసమే ఇలా తీసుకొచ్చాం’ అంటూ ట్వీట్ చేశారు షారుక్. దాంతో పాటు భార్య, కొడుకు అబ్రాంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. షారుక్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. Little one was a bit confused between ‘Boating’ and Voting, so took him along to experience the difference. pic.twitter.com/8X6DsTP8bc — Shah Rukh Khan (@iamsrk) April 29, 2019 -
మగ బాస్
తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల జాబితాలో ఉండే ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఆఫీస్‌లో కొత్తమ్మాయి చేరింది. హారిక. అందరూ పరిచయం చేసుకున్నారు. అభిరామ్ రాగానే హారిక అతనితో మాట కలుపుతూ పరిచయం చేసుకోబోయింది. అభిరామ్ కోపంగా చూశాడు. తాను కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని అని చెప్పుకుంది. అభిరామ్ ఆ ఆఫీస్‌లో మేనేజర్. ఆ పదవి విషయం అలా ఉంచితే, నిజానికి అతనిదే ఆ సంస్థ. రావడమే ఆమెతో మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేని వాడిలా తన క్యాబిన్‌కు వెళ్లిపోయాడు. అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకమ్మాయి తన ఆఫీసులో పనిచేయడం అభికి ఇష్టం లేదు. ఈ విషయమ్మీద ఇంట్లో తన బాబాయ్‌తో గొడవ పడ్డాడు కూడా. ఆ పదవికి అనే కాదు, తన ఆఫీసులో ఏ పనీ అమ్మాయిలు చెయ్యడం అతనికి నచ్చదు. ఆఫీసు నుంచి బయటికెళ్లినా అమ్మాయిలను చూస్తే విసుక్కుంటాడు. వాళ్లతో మాట్లాడాలంటేనే చిరాకు. అదొక వింత జబ్బు అని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకుంటున్నా బాస్ అన్న కారణంతో సుబ్బారావు తన పెళ్లికి అభిని పిలవడానికి వచ్చాడు – ‘‘మీ ఆశీర్వాదం కావాలి సార్!’’ అన్నాడు. ‘‘పుట్టినరోజా?’’‘‘రేపు నా పెళ్లి సార్!’’‘‘పెళ్లా.. ఎందుకు?’’ అరిచినట్టు అడిగాడు అభి. ‘‘ఎవరైనా పెళ్లంటే ఎప్పుడు అని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకు అని అడుగుతున్నారు?’’ ‘‘అందుకే అడుగుతున్నాను. ఎందుకు?’’‘‘భోజనానికి కష్టమైపోతోంది సార్!’’‘‘కుక్‌ని పెట్టుకో..’’ ‘‘ఇల్లు చూస్కోవడానికి కూడా ఎవ్వరు లేరు సార్..’’‘‘కుక్కని పెంచుకో..’’‘‘ఇప్పటికిప్పుడు కట్నమిచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్?’’‘‘సెటైరా?’’‘‘మీతో సెటైరేస్తే రిటైరైపోతానని తెలుసు సార్’’ ‘‘ఎన్నైనా చెప్పు సుబ్బారావు.. నువ్వు పెళ్లి చేస్కోవడం నాకిష్టం లేదయ్యా!’’ అభి మాట్లాడుతూ పోతున్నాడు. అతనికి పెళ్లెందుకు ఇష్టం లేదంటే మళ్లీ కారణం ఒక్కటే, అమ్మాయిలంటే అతనికి కోపం. అతనికి ఆ కోపం రోజురోజుకీ ఎక్కువైపోతూనే ఉంది. హారిక అంటే ప్రత్యేకంగా కోపం లేకపోయినా ఆమెపై కూడా విసుక్కుంటున్నాడు, ఒక్కోరోజు ఒక్కో కారణంతో. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు హారిక తన పెళ్లి కుదిరిందంటూ ఆఫీస్‌లో అందరికీ స్వీట్లు పంచుతోంది. ‘‘బాస్‌కి ఈ విషయం చెప్పారా?’’ హారికను అడిగింది ఒక కలీగ్. ‘‘ఆయనకా? పెళ్లిళ్లు కుదరడం, ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవడం.. ఇలాంటి శుభవార్తలు అలాంటి వాళ్లకు చెప్పకూడదు..’’ ‘‘చెప్తే ఏడుస్తాడు.’’‘‘అహా! వాడు ఏడ్చే టైప్ కాదు.. ఏడిపించే టైపు..’’ హారిక గట్టిగా నవ్వుతూ ఈ మాటన్నప్పుడు అక్కడికి వచ్చాడు అభి. ‘‘నా గురించి అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావు?’’ హారిక మౌనంగా నిలబడింది. అభి మాట్లాడుతూ పోతున్నాడు – ‘‘ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్షాపా.. నీకు నెలకు ముప్ఫై వేలు జీతం. రోజుకి వెయ్యి రూపాయలు. ఇలా రోజూ గంటసేపు స్వీట్లు పంచిపెడుతూ, ఇంకో గంట దాని టేస్టుగురించి మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేస్తే.. నీ జీతం నీకు వచ్చేస్తుంది. కానీ మాకు బోలెడంత లాస్ వస్తుంది. ఆ లాస్‌తో పాటు మా మీద జోకులు, సెటైర్లు... అసలు నిన్ను కాదులే.. నీలాంటివాళ్లను వెతికి మరీ తీసుకొచ్చాడే, అందుకు మా బాబాయ్‌ని అనాలి. ఇన్నాళ్లూ నీకు పని రాదనుకున్నాను. కానీ ఇప్పుడర్థమైంది.. అసలు నువ్వు పనికిరావు’’.ఆఫీస్‌లో అందరిముందూ డస్ట్‌బిన్‌తో హారికను పోల్చాడు అభి. హారిక అక్కడే, ఆ అందరిముందే ఏడ్చేసింది. ఆ తర్వాత పదో నిమిషం.. ‘‘నా రిసిగ్నేషన్ లెటర్ సార్’’ అంటూ చైర్మన్ క్యాబిన్లో నిలబడింది. ‘‘ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లమ్?’’ ‘‘మీ అబ్బాయి సార్! మొదట్లో ఆయన నన్ను తిడుతుంటే నా పని నచ్చలేదేమో అనుకున్నా సార్. కానీ నేనే నచ్చలేదు. నెలకోసారి జీతమిస్తున్నారు కదాని, గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదు సార్..’’‘‘వాడి ప్రవర్తన నచ్చక రిజైన్ చేస్తున్నానని చెప్పావు. కానీ వాడెందుకలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పలేదు.’’ ‘‘నాకు తెలీదు సార్!’’ ‘‘నాకు తెలుసు. నీకు వాడు రెణ్నెల్ల నుంచి మాత్రమే తెలుసమ్మా! కానీ నాకు వాడు రెండేళ్ల వయసప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదమ్మా! వాడు వేరు. వాడి కోపం ప్రళయం. వాడి ప్రేమ సముద్రం. వాడి జాలి వర్షం..’’ అభిరామ్ గతాన్ని చెబుతూ వచ్చాడు బాబాయ్. అభిరామ్ గతాన్నంతా తెలుసుకున్నాక హారిక ఒక్క మాట మాట్లాడకుండా అభిరామ్ బాబాయ్‌నే చూస్తూ కూర్చుంది. ఆమె కళ్లలో నీళ్లు. ‘‘నేను నీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నువ్వు వాడ్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు. అసహ్యించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను.’’ చివరగా ఈ మాట చెప్పి ముగించాడు బాబాయ్. చైర్మన్ క్యాబిన్లోంచి హారిక బయటకు రావడం కోసం ఎదురుచూస్తున్నాడు అభి. కచ్చితంగా ఆమెను ఉద్యోగం నుంచి తప్పించి ఉంటారన్న నమ్మకంతో సుబ్బారావుతో కబుర్లు చెబుతూ ఎదురుచూస్తున్నాడు. హారిక వచ్చింది. ‘‘నాకు ప్రమోషన్ ఇచ్చారు’’ అంటూ అభి చేతిలో ఒక లెటర్ పెట్టింది. ‘‘ప్రమోషనా? బాబాయ్ నిన్ను సస్పెండ్ చెయ్యలేదా?’’ అమాయకంగా అడిగాడు అభి.‘‘మేనేజర్‌గా ప్రమోట్ చేశారు.’’‘‘మేనేజర్గానా? మరి నేను?’’‘‘మిమ్మల్ని సస్పెండ్ చేశారు.’’ ‘‘నన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?’’ ‘‘ఎక్కువ షాకవ్వద్దు. ఆ లెటర్ చదువుకోండి’’ అంది హారిక. తాను సస్పెండ్ అయినట్టు ఆ లెటర్ చదువుకొని ఎగిరిపడ్డాడు అభిరామ్. ఇంట్లో బాబాయ్‌తో గొడవపడితే హారిక వదిలేసిన అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒక్కటే మిగిలింది అతనికి. బాబాయ్‌తో హారిక ఏం మాట్లాడిందో తెలియని, హారికకు తన గతం తెలిసిందని తెలియని అభిరామ్, ఇప్పుడామె కింద పనిచెయ్యాలి. -
విమానంలో పిల్లోడి పుట్టిన రోజు
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్రామ్ మూడో పుట్టినరోజు వేడుకలను విమానంలో చేశాడు. తన పిల్లలు సుహానా, అబ్రాంలతో కలిసి విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు వాళ్లిద్దరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పిల్లలను 'మినియన్స్' అని సరదాగా పిలుచుకుంటాడు కింగ్ ఖాన్. ''నా ఇద్దరు మినియన్లతో కలిసి ఇండియాకు తిరిగొస్తూ విమానంలోనే బర్త్‌డే వేడుకలు చేసుకుంటున్నాం. మాకు ఎవరైనా కేక్ తెచ్చిస్తే బాగుండు.. లేకపోతే కిండర్ ఎగ్స్ చేయాల్సి ఉంటుంది'' అని ట్వీట్ చేశాడు. సరొగసీ పద్ధతి ద్వారా 2013 మే 27న అబ్రామ్ పుట్టిన సంగతి తెలిసిందే. షారుక్‌కు అంతకుముందే ఆర్యన్, సుహానా అనే ఇద్దరు పిల్లలున్నారు. Birthday celebrations on the plane to India with 2 of my Minions. Hope we get a cake…otherwise Kinder eggs will have to do. — Shah Rukh Khan (@iamsrk) 26 May 2016 -
గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు
ఆ కుర్రాడి వయసు రెండున్నరేళ్లు. కానీ అప్పుడే గోవా బీచ్‌లలో షికార్లు కొడుతున్నాడు. మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. అతడెవరో కాదు.. అబ్రామ్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చిన్న కొడుకు. నిన్న కాక మొన్న గుజరాత్లో కొడుకుతో సరదాగా కింద కూర్చుని సందడి చేసిన షారుక్.. ఇప్పుడు అతగాడిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ క్వాడ్ బైక్ ఎక్కించి తిప్పుతూ కావల్సినంత వినోదాన్ని అందించాడు. అబ్రాం కూడా ఆ రైడ్‌ను ఎంతో ఆస్వాదించాడు. చక్కగా నల్లటి టోపీ పెట్టుకుని ఆ బైక్ మీద కూర్చుని కనిపించాడు. పనిలో పనిగా మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా వాళ్లిద్దరినీ వెంటనే తమ కెమెరాలలో బంధించారు. కొంతమంది షారుక్ అభిమానులు ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఇంతకుముందు అబ్రాంతో ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య కలిసి నటిస్తే బాగుంటుందని కూడా కామెంట్లు వచ్చాయి. వాటికి ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఎంతగానో పొంగిపోయారు. భవిష్యత్తులో వాళ్లిద్దరూ కలిసి నటిస్తామంటే.. తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement