Aa Okkati Adakku Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని చూస్తుంటాం. అయితే ఈ వారం థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయువేగం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం మరి అంత కాకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు అయితే వచ్చేశాయి. వీటిలో కొన్ని ముందే ప్రకటించారు. ఓ తెలుగు మూవీ మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు.(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ)అల్లరి నరేశ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ గత కొన్నేళ్ల నుంచి సీరియస్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన బలమైన కామెడీ కథతో తీసిన మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కానీ కుర్రాడిగా అల్లరి నరేశ్ నటించాడు. మే 3న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మరీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ ఓ మాదిరి వసూళ్లు సాధించింది.ఇప్పుడు నెల కూడా తిరక్కుండానే ఎలాండి హడావుడి లేకుండా 'ఆ ఒక్కటి అడక్కు' స్ట్రీమింగ్ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉంది. వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు. టైమ్ చూసుకుని 'ఆ ఒక్కటి అడక్కు' చూసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!) -
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
అల్లరి నరేశ్ చాలారోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన మూవీ టైటిల్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రెండు రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చెప్పాలంటే తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువగానే వసూళ్లు రావడం విశేషం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కాని అబ్బాయిల్ని.. మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో కామెడీ కంటే సీరియస్‌నెస్ ఎక్కువైంది. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా సరే తొలిరోజు రూ.1.62 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఇక రెండో రోజు శనివారం.. వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం కాబట్టి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికి వసూళ్లు పరంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)Silencing the hot summer with a COOL TREAT ❤️🔥#AaOkkatiAdakku collects 3.34CR Worldwide Gross in 2 days 🤘🏻And it’s DAY 2 >>> Day 1 of Laughter madness ❤️🔥https://t.co/zbg0yxIPZx#SummerFunBlockbusterAOA@allarinaresh @fariaabdullah2 #VennelaKishore @harshachemudu… pic.twitter.com/0wx0dSmR1C— Ramesh Bala (@rameshlaus) May 5, 2024 -
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ
టైటిల్: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్ గణేష్(అల్లరి నరేశ్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకఓ యాక్షన్ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్ హీరో రేంజ్లో బిల్డప్ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేశ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అల్లరి నరేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మళ్లీ కామెడీ వైపు మళ్లడంపై ఆయన స్పందించారు. నరేశ్ మాట్లాడుతూ..'అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే ఉన్నా. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించా. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ ఉంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి ఇలాంటి కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు. పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా ఉంటుంది' అన్నారు. చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడంపై మాట్లాడుతూ..' కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. మళ్లీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. కామెడీకి ఆదరణ ఇంకా పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుడిగాడు- 2 కోసం అడుగుతున్నారు. మనం అన్ని రకాల సినిమాలు చేయాలి. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే 'పుష్పక విమానం' లాంటి సినిమా చేయాలని ఉంది. వెంకటేశ్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేమిద్దరం కామెడీ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది' అని తెలిపారు. కాగా.. ఆ ఒక్కటీ అడక్కు మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
కొంటె నవ్వుతో చంపేస్తున్న చిట్టి- కొత్త ఫోటోలు చూశారా?
-
'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏ క్వశ్చన్ మిమల్ని అడిగితే మీకు చీరెత్తుకొస్తుంది
-
ఈ అమ్మాయి నా మీద వేసిన జోక్ అర్థం అవ్వటానికి మూడు రోజులు పట్టింది
-
ఈ అమ్మాయి మిమిక్రితో సుమతోనే కేరింతలు కొట్టించింది
-
నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం మరి ఆయనతో పెళ్ళంటే..!
-
మేలో ఆ ఒక్కటీ అడక్కు
మండే వేసవిలో థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేందుకు ‘అల్లరి’ నరేశ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ పొందింది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చాలా కాలంగా నన్ను పూర్తిగా ఫన్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. -
మళ్లీ కామెడీ వైపు అల్లరి నరేష్ చూపు.. ఆ ఒక్కటి అడక్కు
-
మరింత నవ్వించాలనే ఈ సినిమా చేశాను
‘‘నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకి, మా ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునే హీరో కథ నాన్నగారి సినిమాలో ఉంటుంది. మా మూవీలో జీవితంలో స్థిరపడినా పెళ్లి కాని హీరో కథ. నా బలం వినోదం. ఈసారి మరింత నవ్వించాలని ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. మల్లి అంకం దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఆరోగ్యకరమైన కామెడీ ఉన్న ఎంటర్టైనర్ ఇది. మల్లిగారు క్లియర్ విజన్‌తో ఈ సినిమా తీశారు. రాజీవ్‌గారు ΄్యాషన్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘నిర్మాత కావాలన్న నా ఇరవై ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు రాజీవ్ చిలక. ‘‘ఫ్యామిలీతో కలసి ఆనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఒక కిక్ వచ్చింది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. -
Aa Okkati Adakku Teaser Launch Event: 'ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
ఆ సినిమాతో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రానికి సంబంధం లేదు: అల్లరి నరేశ్
హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. టైటిల్ గ్లింప్స్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్ ఓ మేడమ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఈరోజు మేకర్స్ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో అతను, ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతని కంపెనీని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్ గా చెప్పేస్తుంది. ప్లాట్‌లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది, పాన్ ఇండియా లాంటి సమస్య పెళ్లిని ఎంచుకున్న మల్లి అంకం దీనిని వినోదాత్మకంగా రూపొందించాడు. అల్లరి నరేష్ తన అల్లరితో మళ్ళీ అలరించారు. తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేష్ గర్ల్ ఫ్రెండ్ గా ఫరియా అబ్దుల్లా కూల్ గా కనిపించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు. సూర్య క్యాప్చర్ చేసిన విజువల్స్ బ్రైట్, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదాన్ని పెంచింది. చిలక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ డిజైన్ జానర్‌కి సరిగ్గా సరిపోతుంది. నవ్వించే ఈ టీజర్ నిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ముందుగా 'ఆ ఒక్కటీ అడక్కు' గురించి ఓ వివరణ ఇవ్వాలి. నాన్నగారి 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలాంటి సీక్వెల్ కాదు. నాన్నగారి సినిమాలో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథ. ఇందులో సెటిల్ అయినా పెళ్లి కాని వాడి కథ. చాలా హిలేరియస్ గా సినిమాని చేశాం. వింటేజ్ నరేష్ రావాలని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు చేయాలని కోరారు. చాలా ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనే ఉద్దేశంతో కథపై చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేశాం. నా బలం కామెడీ. ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం. మంచి కంటెంట్ ఉన్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది’ అన్నారు.