రాత్రికి రాత్రే యూపీ సీఎం మరో కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే యూపీ సీఎం మరో కీలక నిర్ణయం

Published Thu, Apr 27 2017 9:08 AM

రాత్రికి రాత్రే  యూపీ సీఎం మరో కీలక నిర్ణయం

పట్నా: ఉత్తరప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. తాజాగా యోగి  భారీగా  ఐపీఎస్‌ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.  41 జిల్లాల పోలీసు బాస్‌లను, ఇతర ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగులను చేపట్టారు.  ఈ కీలక ఆదేశాలను   బుధవారం అర్థరాత్రి   జారీ చేశారు.

సుమారు 50మందికిపైగా అధికారులకు స్థాన భ్రంశం కల్పించారు.  ఇందులో భాగంగా  వివిధ జిల్లాల పోలీస్‌ బాస్‌లను   బదిలీ చేయడం ద్వారా  పెద్ద  సంస్కరణకు శ్రీకారం చుట్టింది.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల తరువాత ఇదే అతిపెద్ద  పోలీస్‌ సంస్కరణగా  నిలిచింది.

ముఖ్యంగా  మెయిన్పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్‌పీలను బదిలీ  చేసింది.  మెయిన్‌ పురి జిల్లాకు  కొత్త పోలీస్‌ చీఫ్‌గా ఎస్‌ రాజేష్ నియమితుడయ్యారు. 

అలాగే బీజేపీ ఎమ్మెల్సీ నేతృత్వంలోని ఊరేగింపు నిషేధించి ఇటీవల వార్లల్లో నిలిచిన  షహరన్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ లవ్‌కుమార్‌ను నోయిడాకు ట్రాన్సఫర్‌ చేయగా, రాయబరేలికి గౌరవ్‌ సింగ్‌, లక్నోకు దీపక్‌కుమార్‌, ఆగ్రాకు దినేష్‌​ చంద్ర దుబే పోలీస్‌ ఛీప్‌గా  వ్యవహరించనున్నారు. మునుపటి సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్‌ లలో ఎక్కువమందిని   రీ షఫిల్‌ చేయడ విశేషం.

Advertisement
Advertisement