అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేయొద్దు! | Sakshi
Sakshi News home page

అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేయొద్దు!

Published Tue, Sep 23 2014 2:17 PM

అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేయొద్దు! - Sakshi

ఫేస్బుక్ లో అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేస్తున్నారా. అయితే ఈ అలవాటు మానుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సలహాయిస్తున్నారు. సామాజిక సంబంధాల వెబ్సైట్లలో ఎక్కువగా సెల్ఫీలు పోస్ట్ చేసే వారికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు దూరమవుతారని పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మనుషుల మధ్య బంధాలను 'సోషల్ సెల్ఫీలు' దెబ్బ తీస్తాయని పరిశోధనలో రుజువైందని అంటున్నారు. సెల్ఫీలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడాన్ని సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇష్టపడరని బర్మింగ్హామ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు డేవిడ్ హాగ్టన్ తెలిపారు. సెల్ఫీలను ఒకొకరు ఒక్కొక్క కోణంలో చూసి కామెంట్ చేస్తారని దీంతో అభిప్రాయబేధాలు తలెత్తే అవకాశముందని వివరించారు. ఫేస్బుక్లో సెల్ఫీలు పోస్ట్ చేసే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement