గోవా ప్రయాణం ఇక కాస్ట్లీనే! | Sakshi
Sakshi News home page

గోవా ప్రయాణం ఇక కాస్ట్లీనే!

Published Sat, Feb 25 2017 11:43 AM

గోవా ప్రయాణం ఇక కాస్ట్లీనే! - Sakshi

న్యూఢిల్లీ : గోవా ప్రయాణం ఇక మరింత కాస్ట్లీగా మారబోతుంది. గోవా నుంచి గాని, గోవాకు కానీ ప్రయణించాలనుకునే వారికి గాని ఏప్రిల్ నెల నుంచి ఓ ఆరు నెలల పాటు విమాన టిక్కెట్ల ఖర్చు మోతమోగనుంది. దాబోలిమ్ ఎయిర్ పోర్టు నుంచి విమాన రాకపోకలను ఇండియన్ నేవి తగ్గించింది. కార్యచరణ కారణాలతో 12.30 నుంచి 15.30 మద్యలో ప్రయాణించే విమానాలను తగ్గిస్తున్నట్టు ఇండియన్ నేవి ప్రకటించింది. గంటకు 15 విమానాలు నడిచే ఈ సమయంలో ఇకనుంచి గంటకు 5 విమనాలు మాత్రమే నడువనున్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి చెప్పారు. 
 
దీంతో విమానాలు తగ్గి, ప్రయాణికుల ట్రాఫిక్ పెరిగి, ఛార్జీలు మోత మోగనుందని తెలుస్తోంది. నేవి నిర్వహించే ట్రైనింగ్ సెషన్తో ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని గంటలకు నాలుగు గంటలు మూత వేస్తున్నారు. ఇలా మూత వేయడం, విమానాలు తగ్గించడం ప్రయాణికుల వృద్ధిపై కూడా ప్రభావం చూపనుందని ట్రావెల్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్లంటున్నారు. విమాన టిక్కెట్ల రేట్లు పెరగడం ట్రావెల్, టూరిజం సెక్టార్కు గండికొట్టనుందని చెబుతున్నారు. . 

Advertisement
Advertisement