నల్గొండ జిల్లాలో టీడీపీకి షాక్ .... | Sakshi
Sakshi News home page

నల్గొండ జిల్లాలో టీడీపీకి షాక్ ....

Published Wed, Sep 3 2014 9:30 AM

నల్గొండ జిల్లాలో టీడీపీకి షాక్ .... - Sakshi

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. కారు ఎక్కేందుకు తెలుగు తమ్ముళ్లు క్యూ కడుతున్నారు.  ఆపార్టీ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది.  ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి భారీగా టీఆర్ఎస్కు వలసలు జరగగా....తాజాగా నల్గొండ జిల్లాలోనూ ఆపార్టీకి షాక్ తగిలింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈనెల 5వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

దాంతో అందివచ్చిన అవకాశాన్ని గులాబీ నేతలు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నికలు అయ్యేంత వరకూ సంస్థాగతంగా బలహీనంగా వున్న టీఆర్ఎస్, తెలంగాణ సెంటిమెంట్తో గట్టెక్కింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నాయక్తవం వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది. సొంత కేడర్ వున్న నేతలను గుర్తించి గాలం వేస్తోంది. ప్రధానంగా టీడీపీ నాయకులు, శ్రేణులపై దృష్టి పెట్టింది.

కోదాడ నియోజకవర్గం నుంచి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత వేనేపల్లి చందర్ రావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరు కారు ఎక్కనున్నారు. దీంతో కోదాడపై ఎన్నాళ్లగానో పట్టువున్న టీడీపీకి ఇక గడ్డు పరిస్థితి ఎదురు కానుంది.  ఇప్పటికే జిల్లాలో టీడీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. మొత్తంగా జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వం పక్కా వ్యూహంతో టీడీపీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది.

Advertisement
Advertisement