క్యాలెండర్లపై గాంధీ ఫొటో పెట్టాలి : ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

క్యాలెండర్లపై గాంధీ ఫొటో పెట్టాలి : ఉత్తమ్‌

Published Mon, Jan 30 2017 11:52 AM

క్యాలెండర్లపై గాంధీ ఫొటో పెట్టాలి : ఉత్తమ్‌ - Sakshi

సూర్యాపేట : ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్‌(కేవీఐసీ)-2017 క్యాలెండర్లపై బాపు బొమ్మను తొలగించి మోదీ బొమ్మను పెట్టడం అధికార అహాంకార ధోరణికి నిదర్శనమని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు నివాళులు అర్పించిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేవీఐసీ క్యాలెండర్లపై వెంటనే మోదీ బొమ్మను తొలగించి గాంధీజి బొమ్మ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

మోదీ మెప్పు పొందడం కోసం సీఎం కేసీఆర్‌ నోట్ల రద్దుకు మద్దతు పలుకుతున్నారని.. దీని వెనుక ఆయన స్వలాభం కనపడుతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. నోట్ల రద్దు వల్ల గ్రామాలలో రైతులకు అప్పు పుట్టడం లేదని.. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రజాధనాన్ని విలాసవంతమైన భవనాలు, కార్లు, విదేశీ పర్యటనలకు, దేవుళ్ల మొక్కులకు దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తమ్‌ దుయ్యబట్టారు.

Advertisement
Advertisement