విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం

Published Sat, Dec 20 2014 4:28 AM

విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం - Sakshi

వినాయక్‌నగర్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భిక్షాటన చేసి, నిరసన వ్యక్తం చేశారు.  శుక్రవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌చౌరస్తా వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా  ఏబీవీపీ బాగ్ కన్వీనర్ రాకేశ్ మాట్లాడుతూ  పెండింగ్‌లో ఉన్న  రూ. 750 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడతల వారీగా విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా విడతల వారీగానే వేతనాలు పంపిణీ చేస్తారా అని ప్రశ్నించారు.  

ప్రభుత్వం విద్యార్థులను విస్మరించడం దారుణమన్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను సకాలంలో చెల్లించని ప్రభుత్వం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ఎలా  అందిస్తారని అన్నారు.  ఫాస్ట్ పథకం విధివిధానలను  ఇప్పటి వరకు ప్రకటించకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని లేకపోతే హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  ప్రశాంత్, ప్రేమ్, చంద్రకిరణ్,  మాని ష్, నితిష్, అకిల్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement