సాయినాథ్ మృతిపై దర్యాప్తు చేపట్టాలి | Sakshi
Sakshi News home page

సాయినాథ్ మృతిపై దర్యాప్తు చేపట్టాలి

Published Thu, Sep 3 2015 4:14 AM

సాయినాథ్ మృతిపై దర్యాప్తు చేపట్టాలి - Sakshi

ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
కళాశాల యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం
 
 మేడ్చల్ రూరల్ : సీఎంఆర్ కళాశాల విద్యార్థి సాయినాథ్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఏబీవీబీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కండ్లకోయచౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి కళాశాల యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. కళాశాల వద్దకు చేరుకోవడానికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించగా పోలీసులు కండ్లకోయచౌరస్తా వద్ద అడ్డుకోగా 44వ జాతీయ రహదారి పక్కన ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సికింద్రాబాద్ జోన్ ఇన్‌చార్జి మహేష్, మేడ్చల్ భాగ్ కన్వీనర్ అర్జున్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం కొనసాగుతోందని ఆరోపించారు.

దీనిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సాయినాథ్ ప్రాణం పో యిందన్నారు. ఈ కేసులో నిందితులను గుర్తిం చి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరినా ససేమిరా అన్నా రు. అనంతరం వారిని అరె స్టు చేసి శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రామకృష్ణ, దిలీప్, రాకేష్, శివ, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement