మార్చిలోగా న్యూ–సదరన్‌ గ్రిడ్ల అనుసంధానం | Sakshi
Sakshi News home page

మార్చిలోగా న్యూ–సదరన్‌ గ్రిడ్ల అనుసంధానం

Published Wed, Jan 11 2017 3:14 AM

మార్చిలోగా న్యూ–సదరన్‌ గ్రిడ్ల అనుసంధానం - Sakshi

వార్దా–డిచ్‌పల్లి లైన్లు పూర్తయితే రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌  విద్యుత్‌
పవర్‌ గ్రిడ్‌ అధికారుల భేటీలో కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: న్యూ గ్రిడ్‌(నార్త్, ఈస్ట్, వెస్ట్‌ గ్రిడ్‌) నుంచి దక్షిణాది(సదరన్) రాష్ట్రాల కు విద్యుత్‌ ఇచ్చి పుచ్చుకోవడానికి అనువైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్  ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. న్యూ గ్రిడ్‌ నుంచి సదరన్  గ్రిడ్‌కు లైన్ల నిర్మాణం పూర్తయితే దేశ వ్యాప్తంగా విద్యుదుత్పత్తి, డిమాండ్‌ల మధ్య సమన్వయం సాధించవచ్చన్నారు. పీజీసీ ఐఎల్‌ చైర్మన్  ఐఎస్‌ ఘా, సదరన్ జియన్  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శేఖర్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకోవడానికి అవసరమైన వార్దా (మహారాష్ట్ర)– డిచ్‌పల్లి లైను నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరారు.

ఈ ఏడాది మార్చి నాటికి ఈ లైన్  నిర్మాణం పూర్తి చేస్తామని పీజీసీఐఎల్‌ అధికారులు తెలిపారు. 4,500 మెగావాట్ల సామర్థ్యం గల 765 కేవీ డబుల్‌ సర్క్యూట్‌ లైను నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకోవచ్చని సీఎం కోరారు. ఈ రెండు లైన్ల నిర్మాణంతో న్యూ గ్రిడ్‌–సదరన్ గ్రిడ్‌ మధ్య విద్యుత్‌ పరస్పర సరఫరాకు మార్గం ఏర్పడు తుందన్నారు. అప్పుడు దేశమంతా ఒక ప్రాంతంతో మరో ప్రాంతం అనుసంధానమై ఉంటుందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ట్రాన్స్ కోమిషన్  ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి పీజీసీఐఎల్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై పీజీసీఐఎల్‌తో చర్చలు జరపాలని విద్యుత్‌ శాఖను కేసీఆర్‌ ఆదేశిం చారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్‌ అధికారులు ఎస్‌. నర్సింగ్‌ రావు, శాంత కుమారి, రామకృష్ణరావు, స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement