'ఓయూ భూములపై కేసీఆర్ కు హక్కులేదు' | Sakshi
Sakshi News home page

'ఓయూ భూములపై కేసీఆర్ కు హక్కులేదు'

Published Sat, May 23 2015 8:33 PM

'ఓయూ భూములపై కేసీఆర్ కు హక్కులేదు' - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకోసం ఉద్యమం చేసినందుకే ఉస్మానియా యూనివర్సిటీ భూములను తీసుకుని, ఉన్నత విద్యను పేదలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష సందర్భంగా నిమ్స్‌లో ఉంటే, ఓయూ విద్యార్థులే ఉద్యమానికి ప్రాణవాయువుగా పనిచేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా కేజీ టు పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్యపై ప్రణాళికను రూపొందించలేదన్నారు. కేజీ టు పీజీ దాకా ఉచితవిద్యను అమలుచేసేదాకా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఉన్నత విద్యామండలిలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కనీసం యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. పేదలకు ఇళ్లు నిర్మించాలనే చిత్తశుద్ధి, సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. యూనివర్సిటీల భూములపై కేసీఆర్‌కు ఎలాంటి హక్కులేదన్నారు.

Advertisement
Advertisement