'కేసీఆర్ కు సాయుధ పోరాటంపై అవగాహన లేదు' | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ కు సాయుధ పోరాటంపై అవగాహన లేదు'

Published Sun, Jul 5 2015 6:14 PM

CPM leader shankar criticises kcr on occasion of komaraiah death anniversary

గోల్కొండ: రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సాయుధ పోరాటంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆయన నిజాం పాలనను పొగుడుతున్నారని సీపీఎం నాయకుడు బి.శంకర్ అన్నారు. నిజాం నవాబు దుర్మార్గాలను, ఖాశీం రజ్వీ కర్కశత్వాన్ని ఎదిరించి పోరాడిన తెలంగాణ వీరపుత్రుడు దొడ్డి కొమురయ్య అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం గుడిమల్కాపూర్ బోజగుట్ట వివేకానందనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 69వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు.

అనంతరం శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య వీరోచితంగా పోరాడారని అన్నారు. ఆయన స్ఫూర్తితో నాడు ఎందరో యువకులు నిజాంకు ఎదురొడ్డి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. కాగా నేడు ఆ నాటి రాక్షస పాలన చేసిన పాలకులను నేడు కేసీఆర్ పొగడడం సమంజసం కాదన్నారు. దొడ్డి కొమురయ్యతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరుల చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement