రైతుల పరిహారానికి మనసు రాదా?: జీవన్‌ రెడ్డి | congress leader jeevan reddy slam telangana government | Sakshi
Sakshi News home page

రైతుల పరిహారానికి మనసు రాదా?: జీవన్‌ రెడ్డి

Aug 23 2017 3:37 PM | Updated on Oct 30 2018 7:50 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ.. అధికార పార్టీ బల సమీకరణ కార్యక్రమంలా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ.. అధికార పార్టీ బల సమీకరణ కార్యక్రమంలా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి అన్నారు. బాధితులతో బలవంతంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రభుత్వం నిర్వాసితుల నష్టపరిహారాన్ని తగ్గిస్తోంది. ఇది చాలా దారుణమని.. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలి. కాంట్రాక్టర్లకు అంచనాలు పెంచుతున్న సర్కార్‌కు రైతులకు డబ్బులివ్వడానికి మనసు రావడం లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement