బాగున్నారా? మీ సమస్యలేంటి? | Sakshi
Sakshi News home page

బాగున్నారా? మీ సమస్యలేంటి?

Published Tue, May 23 2017 2:22 AM

నల్లగొండ జిల్లా తేరేడ్‌పల్లిలో చేనేత కార్మికుడు ధనుంజయ ఇంట్లో  మగ్గం నేస్తున్న అమిత్‌ షా - Sakshi

- తేరేట్‌పల్లిలో 5 కుటుంబాలతో మాట్లాడిన అమిత్‌ షా
- కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆరా
- తమకేమీ తెలియదని చెప్పడంతో కరపత్రాల అందజేత
- చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం నేత


సాక్షి, నల్లగొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సోమవారం తేరేట్‌పల్లి గ్రామంలోని ఐదు కుటుంబాలతో ముఖాముఖి మాట్లా డారు. వారి ఇళ్లలోకి వెళ్లి అందరినీ పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తొలుత గ్రామ శివారులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిం చిన తర్వాత ఆయన నేరుగా గ్రామంలోని గొరిగె సత్తయ్య ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్తూనే వారిని చిరునవ్వుతో పలకరిస్తూ అభి వాదం చేశారు. బాగున్నారా అని పలకరించి మీకున్న ఇబ్బందులేంటో చెప్పండని అడిగారు. వారు గ్రామ సమస్యలను అమిత్‌ షాకు విన్న వించుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి అడగ్గా.. తమకేమీ తెలియదని వారు బదులివ్వడంతో వారి చేతిలో కరపత్రం పెట్టి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందులో ఉందని, చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. తర్వాత గొరిగె యాదయ్య, పెద్ద భిక్షమయ్య, సత్తయ్య, వర్కాల ధనుంజయ ఇళ్లకు కూడా వెళ్లారు. వారి బాగోగులు, స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన.. అందరితో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీశారు. వారంతా తమకేమీ తెలియదని బదులివ్వడంతో అందరికీ కరపత్రాలు ఇచ్చి చదివి తెలుసుకోవాలని సూచించారు. మొత్తం 15 కుటుంబాలను కలిసేందుకు ఏర్పాట్లు చేసినా ఐదు కుటుంబాలతోనే అమిత్‌ షా ముఖాముఖి పరిమితమైంది. ఒక్కో కుటుంబం వద్ద 5–6 నిమిషాలున్నారు.

నేనూ నేస్తా: చేనేత కార్మికుడు వర్కాల ధనుంజయ ఇంటికి వెళ్లిన అమిత్‌ షా అక్కడ మగ్గం నేశారు. మగ్గం వద్దకు వెళ్లి దాని గురిం చి అడిగి తెలుసుకున్న ఆయన.. ధనుంజయ ను మగ్గం నేయాలని కోరారు. అందుకు ఆయన తన భార్య ధనమ్మతో కలసి మగ్గం నేసి చూపించారు. ఆ తర్వాత ‘నేను నేస్తా.. ఇటు రండి..’ అంటూ మగ్గంపై కూర్చుని నేశారు. షా వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, నాయకులు మురళీధర్‌రావు, మనోహర్‌రెడ్డి ఉన్నారు.

తొలిరోజు పర్యటన ప్రశాంతం
మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లో అమిత్‌ షా టూర్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తొలిరోజు నల్లగొండ జిల్లా పర్య టన ప్రశాంతంగా ముగిసింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం మీదు గా చండూరు మండలం తేరేట్‌పల్లి చేరుకున్న ఆయన అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్క రించి, తర్వాత 5 కుటుంబాలతో ముఖా ముఖి మాట్లాడారు. తర్వాత పార్టీ దివంగత నేత గుండగోని మైసయ్య గౌడ్‌ విగ్రహాన్ని ఆవి ష్కరించి, పోలింగ్‌ బూత్‌ కమిటీ సమా వేశంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో దళిత వాడకు వెళ్లి అక్కడ సహపంక్తి భోజనం చేశారు. మునుగోడు మీదుగా నల్లగొండ చేరుకుని మేధావులతో భేటీ అయ్యారు. తర్వాత పార్టీ రాష్ట్ర పదాధికారులు, అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. షా రాక సంద ర్భంగా చౌటుప్పల్‌లో ఆప్‌ కార్యకర్తలు నిరస న తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ ఎమ్మార్పీ ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేయబోగా పోలీసులు వారిని నిర్బంధించారు.

Advertisement
Advertisement