ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్‌ను చేస్తా | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్‌ను చేస్తా

Published Wed, May 6 2015 2:13 AM

ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్‌ను చేస్తా - Sakshi

బీడీ కార్మికురాలి కుమార్తె సుష్మకు కేసీఆర్ హామీ

హైదరాబాద్: మెదక్ జిల్లా వడియారం గ్రామానికి చెందిన బీడీ కార్మికురాలు శోభ కుమార్తె సుష్మను ప్రభుత్వ ఖర్చుతో చదివించి డాక్టర్‌ను చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సుష్మ ఇంటర్ పరీక్షల్లో 991 మార్కులు సాధించింది. ఆమె తండ్రి సిద్ధరాములు స్థానికంగా ఓ  ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థి అయిన సుష్మ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి మంగళవారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.

ఈ సందర్భంగా సుష్మను అభినందించిన సీఎం.. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నావని ప్రశ్నించగా.. ఆమె డాక్టర్ కావాలని ఉందని తెలిపింది. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్.. సుష్మ మెడిసిన్ చదవడానికయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. నిరుపేదల ఇళ్లలో కూడా చదువుల తల్లులు పుడతారనడానికి సుష్మ నిదర్శనమని, వారిని ప్రోత్సహించాలని అన్నారు.
 
 

Advertisement
Advertisement