కాపు విద్యార్థుల జాబ్ మేళా గందరగోళం.. | Sakshi
Sakshi News home page

కాపు విద్యార్థుల జాబ్ మేళా గందరగోళం..

Published Fri, Oct 21 2016 4:55 PM

(ఫైల్) ఫోటో - Sakshi

► మొహం చాటేసిన ప్రముఖ కంపెనీలు
► ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.6 వేలు జీతం ప్రతిపాదన
► కాపు కార్పొరేషన్ చైర్మన్ నిలదీత
► ఆందోళనకు దిగిన విద్యార్థులు
► పోలీసుల అదుపులో విద్యార్థులు...విడుదల
 
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాపు విద్యార్థుల జాబ్ మేళా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో చివరి రోజు ఉద్రిక్త నెలకొంది. 

ముందుగా ప్రకటించిన ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాకు రాలేదంటూ విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు జాబ్ మేళా నిర్వహించిన కంపెనీలు ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.6 వేలు జీతంగా ప్రతిపాదించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయను విద్యార్థులు నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కొద్ది సేపటి తర్వాత విద్యార్థులను పోలీసులు వదిలేశారు. (చదవండి : కాపు జాబ్‌మేళా ప్రారంభం )

ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలు పడి జాబ్ మేళాకు వస్తే ప్రభుత్వం తమను మోసం చేసిందని విద్యార్థులు ధ్వజమెత్తారు. కాపు జాబ్‌మేళాను మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. చివరికి ఈ జాబ్ మేళా అభాసుపాలుకావడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.
 

Advertisement
Advertisement