‘అమ్మో’ ఆస్తుల చిట్టా | Sakshi
Sakshi News home page

‘అమ్మో’ ఆస్తుల చిట్టా

Published Sun, Sep 28 2014 12:49 AM

‘అమ్మో’ ఆస్తుల చిట్టా - Sakshi

 సాక్షి, చెన్నై : అవినీతి కేసులో దోషిగా ముద్ర పడ్డ తమిళనాడు పురట్చి తలైవీ, అందరి నోట అమ్మగా పిలిపించుకునే అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఆస్తుల చిట్టా వెలుగులోకి వచ్చింది. జయ అండ్ కో.. అవినీతి సొమ్ముతో అప్పట్లో  చిన్న చిన్న పొదుపు పథకాలు అన్నట్టుగా ఆస్తుల్ని కొనుగోలు చేసి...వాటిని ఇప్పుడు పెద్ద మొత్తాల్లో తమ ఖాతాలో వేసుకుని ఉండటం బయట పడింది. పురట్చి తలైవి జయలలిత అవినీతి కేసులో దోషి అంటూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ముద్ర వేసిందో లేదో, తమిళనాట విధ్వంస కాండ ఆరంభమైంది. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహంతో ఊగిపోతోంటే, జయలలిత అండ్ కో గడించినట్టుగా పేర్కొంటున్న ఆస్తుల చిట్టాను డీఎంకే అనుబంధ  మీడియా, కొన్ని వెబ్ మీడియాలు వెలుగులోకి తెచ్చాయి.
 
 ఈ చిట్టాను చూసిన వాళ్లంతా...వామ్మో ...అమ్మరూ.మ్మో అంటూ ముక్కు మీద వేలేసుకోక తప్పడం లేదు. కోర్టులో సీబీఐ  సమర్పించిన ఆధారాల మేరకు ఆ చిట్టాను బయట పెట్టారా? అన్నది ప్రశ్నార్థకమే. ఆ వివరాల మేరకు సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధవులు సుధాకరన్, ఇళవరసి బృందం చిన్న చిన్న ఆస్తుల్నే లక్ష్యంగా చేసుకుని చాకచక్యంగా కొనుగోలు చేయటం వెలుగు చూసింది. అత్యధికంగా స్థలాల మీద, భవనాల మీదే అవినీతి సొమ్మును పెట్టుబడిగా పెట్టినట్టు కనిపిస్తోంది. చిన్న చిన్న పొదుపు పథకాలే, భవిష్యత్తులో పెద్ద మొత్తాలు అన్నట్టుగా, అప్పట్లో చిన్న చిన్న స్థలాలు, భవనాల మీద తమ పెట్టుబడిని పెట్టి ఉండటం గమనార్హం. 

ఆ చిట్టా మేరకు వివరాలు.
  చెన్నై పోయేస్ గార్డెన్‌లో పది గ్రౌండ్ల స్థలం, ఇళ్లు
 హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 651.18 చ.మీటర్ల భవనం ఉంది. హైదరాబాద్ సమీపంలోని జీడిమిట్ల, బషీరాబాద్ గ్రామాల్లో రెండు ఫామ్ హౌస్‌లు, కార్మికుల కోసం ఇళ్లు, బషీరాబాద్‌లో 11.35 ఎకరాల్లో ద్రాక్ష తోట ఉంది. అలాగే, మేడ్చల్ సమీపంలోని 3.15 ఎకరాల స్థలం ఉంది.

 తమిళనాడులో చెయ్యార్ గ్రామం 5.6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

 చెన్నై పట్టాల్ మ్మాల్ వీధిలో ఓ నివాస భవనం. శాంతోమ్‌లో ఆర్‌ఆర్ బహుళ అంతస్తుల భవనం. అన్నా సాలైలో ఓ షాపింగ్‌మాల్‌లో దుకాణం ఉంది.

 చెన్నై నుంగంబాక్కం ఖాదర్ నవాజ్ కాన్ రోడ్డులో 11 గ్రౌండ్ల స్థలంలో వాటా కలిగిఉన్నారు.

 చెన్నై సెయింట్ మేరీస్ రోడ్డులో 1,206 చ.అడుగుల భవనం, చెన్నై అన్నా సాలైలో 180 చదరపు అడుగుల దుకాణం, మైలాపూర్ 1,756 చదరపు అడుగుల స్థలం ఉంది.

 తంజావూరు మనంబూర్ చాడిలో 2400చ.అ., ఆరో వార్డులో 51వేల చ.అ. ఖాళీ స్థలం.

 మనంబూర్‌లో చావడి బ్లాక్ రోడ్డులో 8970 చ.అ. ఖాళీ స్థలం ఉంది.

 తిరుచ్చి పెన్నగరం, అభిషేక పురం గ్రామంలో 3,525 చ.అ స్థలం, గృహాలు, తోటలు ఉన్నాయి.

 తంజావూరు జిల్లా సుందర కోట గ్రామంలో 3.23 ఎకరాల స్థలం ఉంది. మన్నార్ కుడిలో 25,035. చ.అడుగుల్లో భవనం.

 చెనై గిండి తిరువికా ఎస్టేట్‌లో 5,658 చ.అడుగుల  భవనం, మైలాపూర్‌లో ఒక గ్రౌండ్ స్థలం, చెన్నై పరింగి మలైలో 4804.60 చ.అడుగల్లో భవనం, తిరువికా ఎస్టేట్‌లో ఏడు ఎకరాల స్థలం ఉంది.

 చెన్నై కాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులో 1756. చ.అడుగుల్లో భవనం, నుంగంబాక్కం 532 చ.అ. మరో భవనం ఉన్నాయి.

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆంజనేయ తోట్టంలో 222.92 చ. మీ స్థలంలో భవనం ఉంది.

 గిండి తిరువికా ఎస్టేట్‌లో 12,462,172 చ.అ. స్థలం, భవనం ఉన్నాయి.

 చెన్నై అన్నానగర్‌లో ఇలవరసి పేరిట ఉన్న భవనం విలువ అప్పట్లో రెండు లక్షల 35 వేలు.

 తిరువికా ఎస్టేట్‌లో 63 ఎకరాలు, 495 చ.అడుగుల్లో పెంట్ హౌస్, అలాగే, 1155 చ.అడుగుల్లో మరో పెంట్ హౌస్ తరహా ప్లాట్ ఉన్నాయి.
 చెన్నై అభిరామ పురంలో 1405 చ.అ. భవనం ఉంది.

 వేలగాపురం, చెయ్యూర్ గ్రామంలో అక్కడక్కడ ఒక్కో సర్వే నెంబర్‌లో 3 నుంచి 4 ఎకరాల మేరకు వ్యవసాయ స్థలాలు కొనుగోలు చేశారు.

 చెన్నై ఈక్కాట్టు తాంగల్ రింగ్ రోడ్డులో ఆంజేయ ప్రింటర్స్ నెలకొల్పారు.

 చెన్నై నీలాంకరైలో 4802 చ.అ.స్థలంలో భవనం నిర్మించారు.

 టీ నగర్ పద్మనాభ వీధిలో ఒక గ్రౌండ్ స్థలంలో 1086 చ.అ. భవనం, అదే వీధిలో వేర్వేరు సర్వే నెంబర్లలో చిన్న చిన్న భవనాల్ని కొనుగోలు చేశారు.

 సిరుదావూర్ గ్రామంలో ఓ చోట 11 ఎకరాల 83 సెంట్లు, మరో చోట 11 ఎకరాల 22 సెంట్లు, ఇంకో చోట పది ఎకరాల 86 సెంట్లు స్థలాలు చొప్పున మొత్తంగా 75 ఎకరాలు ఉన్నాయి.

 కరింగి పల్లం గ్రామంలో 48.2 ఎకరాల స్థలం ఉంది.

 చెన్నై టీటీకే రోడ్డులో ఒక భవనం, శ్రీరాం నగర్‌లో 3,705 చదరపు అడుగుల స్థలం ఉంది.

 ఈజంబాక్కంలో 1.29 ఎకరాలు, షోలింగనల్లూరులో 16.75 సెంట్లు, చెన్నై అడయార్‌లో 6.75 సెంట్ల స్థలం, మరో సర్వే నెంబర్‌లో 16.50 సెంట్ల స్థలం ఉంది.

 శ్రీమతి గాయత్రి చంద్రన్ పేరిట 3.35 లక్షలు విలువగల స్థల కొనుగోలుకు డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు.

 షోలింగ నల్లూరు ఆర్‌ఎస్‌వోలో 16.75 సెంట్ల స్థలం ఉంది. అలాగే, ఇక్కడ రూ.2,35,200 విలువతో టికే చంద్ర వదనం పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు.

 నుంగబాక్కం వాల్టాస్ తోట్టంలో విభజించాల్సిన 1087 చ.అ. ఖాళీ స్థలం, ఓ బంగ్లా ఉంది.

 వెట్వాంగనిలో 34 సెంట్ల స్థలం, మైలాపుర్ లజ్ రోడ్డులో బంగ్లా, టీ నగర్‌లో 4800 చ. భవనం ఉన్నాయి.

 సేరకులం 53 ఎకరాలు ,, కరుంగులి గ్రామంలో పలు చోట్ల స్థలాలు కొనుగోలు చేసి ఉన్నారు.

 తిరువెంగడం కాలనీలో 4,350 చ. అడుగుల్లో స్థలం, ఇళ్లు, ఈజంబాక్కంలో 37 సెంట్లు, టీటీకే రోడ్డులో 733 చ.అ.ప్లాట్ ఉన్నాయి.

 పయనూర్ గ్రామంలో 5.87 ఎకారల స్థలం, అరుంబాక్కంలో 3,197 చ.అ.స్థలం, ఊరుర్ గ్రామంలో పరమేశ్వర నగర్‌లో స్థలాలు ఉన్నాయి. సేరావూర్ గ్రామంలో పలు చోట్ల చిన్న చిన్న స్థలాలుగా 73 ఎకరాలను కొనుగోలు చేశారు.

 కాంచీపురం జిల్లా ఊత్తుకాడులో 12.70 ఎకరాల స్థలం, మరో చోట 14.42 ఎకరాల స్థలం, చెయ్యారు కలవైలో 6.98 ఎకరాల స్థలం, వల్లకులం 55 ఎకరాలు, అదే గ్రామంలో మరో చోట 57 ఎకరాలు ఉంది.

 టీ నగర్  హబీబుల్లా రోడ్డులో 4.293 చ.అ.,  3472 చ.అ. భవనాలు ఉన్నాయి.

 సేర కులంలో 48 ఎకరాలు, వల్లకులం 54.98 ఎకరాలు, మీర్ కులం 54.98 ఎకరాలు, సేర కులంలో మరో చోట 130 ఎకరాలు,  
 వందపాళయం 62.63 ఎకరాలు, అదే చోట రామరాజ్ ఆగ్రో మిల్‌కు చెందిన ఆరు లక్షల వాటాలు, కీల్ వత్తలకులడిలో 1.31 ఎకరాలు, వంద పాళయంలో మరో చోట 5.19 ఎకరాలు, కీల్‌వాత్తుకుడిలో మరో చోట 1.91 ఎకరాలు చొప్పున స్థలాల మీద పెట్టుబడుల్ని పెట్టి ఉండటం గమనార్హం.
 
 

Advertisement
Advertisement