అథ్లెటిక్స్‌లో ఇస్సాక్‌కు బంగారు పతకం | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో ఇస్సాక్‌కు బంగారు పతకం

Published Tue, Sep 20 2016 11:20 AM

athletic player essak gold medal in state level competition

సింగరాయకొండ : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సింగరాయకొండ ఏఆర్‌సీ అండ్‌ జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజి సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థి వల్లభుని ఇస్సాక్‌ జూనియర్‌ షాట్‌పుట్‌  విభాగంలో బంగారు పతకం సాధించినట్లు కాలేజి ప్రిన్సిపాల్‌ ఏ కోటేశ్వరరావు తెలిపారు.

విజయవాడలో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ఈ ఘనత సాధించారన్నారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు కరీంనగర్‌లో జరిగే సౌత్‌జోన్‌ పోటీల్లో ఇస్సాక్‌ పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కాలేజీలో ఇస్సాక్‌ కు జరిగిన అభినందన సభలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ శంకరరావు, అధ్యాపకులు టి. చక్రపాణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement