'హిందూ, ముస్లింలకు గొడవపెట్టే ప్రభుత్వం వద్దు' | Sakshi
Sakshi News home page

'హిందూ, ముస్లింలకు గొడవపెట్టే ప్రభుత్వం వద్దు'

Published Mon, Apr 21 2014 2:14 PM

'హిందూ, ముస్లింలకు గొడవపెట్టే ప్రభుత్వం వద్దు' - Sakshi

రామనాథపురం: బీజేపీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. హిందూ ముస్తీంలకు గొడవపెట్టే ప్రభుత్వం వద్దని రాహుల్ పిలుపునిచ్చారు.  పేద ప్రజలకు ఉపయోగపడే సెక్యులర్ ప్రభుత్వం కావాలని రాహుల్ సూచించారు. తమిళనాడులోని రామనాధపురంలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం ఢిల్లీలో గద్దెనెక్కాలి అని రాహుల్ పిలుపునిచ్చారు. 
 
రానున్న లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీపడకూడదని రాహుల్ అన్నారు. యూపీఏతో డీఎంకే తెగతెంపులు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ తమిళనాడులో ఒంటరిపోరు కొనసాగిస్తోంది. తాము అధికారంలోకి వస్తామని.. తమిళుల సమస్యలు పరిష్కరిస్తామని రాహుల్ తెలిపారు. 
 

Advertisement
Advertisement