ఆరు రోజుల్లో రూ. 8 కోట్ల వసూళ్లు | Sakshi
Sakshi News home page

ఆరు రోజుల్లో రూ. 8 కోట్ల వసూళ్లు

Published Fri, May 22 2015 3:10 PM

ఆరు రోజుల్లో రూ. 8 కోట్ల వసూళ్లు

చెన్నై:  నటి జ్యోతిక ఎనిమిదేళ్లు విరామం తర్వాత నటించిన '36 వయదినిలే'  తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఆరు రోజుల్లో తమిళనాడులో రూ. 8  కోట్లుపైగా వసూలు చేసింది. మౌత్ పబ్లిసిటీతో సినిమాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. సినిమా బాగుందని టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ధియేటర్లకు వస్తున్నారు. మరో వారంలో ఈ సినిమా కలెక్షన్ రూ.20 కోట్లు దాటే అవకాశముందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ అంచనా వేశారు.

'36 వయదినిలే' సినిమాను మొదట మల్టిప్లెక్స్ ధియేటర్లలో మాత్రమే విడుదల చేశారు. హిట్ టాక్ రావడంతో మామూలు ధియేటర్లలోనూ ప్రదర్శిస్తున్నారు. తన సినిమాకు మంచి స్పందన రావడం పట్ల జ్యోతిక సంతోషం వ్యక్తం చేసింది. తనపై ప్రేమతో, గౌరవంతో '36 వయదినిలే' సినిమాను విజయవంతం చేశారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement