మాట మంచిదైతే.. కొలువు సొంతమే | Sakshi
Sakshi News home page

మాట మంచిదైతే.. కొలువు సొంతమే

Published Thu, Jul 24 2014 2:49 AM

మాట మంచిదైతే.. కొలువు సొంతమే

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత నేటి యువతకు చాలా అవసరం. ఎందుకంటే టెలిఫోన్ ఇంటర్వ్యూల్లో తెలిసీతెలియక నోరుజారి, అవకాశా లను చేజార్చుకుంటున్నారు మన విద్యార్థులు. ఎక్కడైనా మర్యా దపూర్వక మైన మాటతీరుకే మన్నన దక్కుతుంది. హలో.. హాయ్.. ఏరా మామ... ఇలాంటి పిలుపులకు అలవాటైన కుర్రకా రు ఇవే మాటలను ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ ఉపయోగిస్తు న్నారు. కంపెనీలు నిర్వహించే టెలిఫోన్ ఇంటర్వ్యూల్లో క్యాజువల్‌గా మాట్లాడుతున్నారు. ఫలితంగా చేతిదాకా వచ్చిన కొలువును నోటి మాటతో దూరం చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు లేకపోవడం వల్లే విద్యార్థులు కోరుకున్న కొలువులను దక్కించుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.  
 
 ‘ఇంజనీరింగ్, ఎంబీఏలో అగ్రశ్రేణి ప్రతిభ చూపిన ఓ విద్యార్థి టెలిఫోన్ ఇంటర్వ్యూలో చిన్నపాటి తప్పిదం చేయడం వల్ల పెద్ద కంపెనీ అతడిని రిజెక్ట్ చేసింది’ అని ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో వెనుకబడి ఉండడం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్.ఎన్.హసన్. దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతో ‘ఇంగ్లిష్ క్లబ్’ను ఏర్పాటు చేసి భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని వివరించారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో చదివినవారు సైతం ఉద్యోగావకాశాలు దూరం చేసుకుంటున్నారంటే ప్రధాన కారణం.. వారి మాటతీరేనని అంటున్నారు ట్రిపుల్ ఐటీ ప్లేస్‌మెంట్ హెడ్ దేవీప్రసాద్. ఇటీవలి కాలంలో బహుళజాతి సంస్థలు నాన్ టెక్నికల్ ఉద్యోగుల తొలిదశ ఎంపిక ప్రక్రియలో భాగంగా టెలిఫోన్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల బాడీలాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా కేవలం మాటతీరును బట్టి వారి నైజాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. మెయిల్ ద్వారా తమకు చేరిన అభ్యర్థుల రెజ్యుమెలోని సమాచారం ఆధారంగా టెలిఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇవి సాధారణంగా రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి ఆటోమేటెడ్, మరొకటి నాన్-ఆటోమేటెడ్. ఆటోమేటెడ్‌లో ముందే రికార్డు చేసిన ప్రశ్నల శ్రేణికి వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్-ఆటోమేటెడ్‌లో కంపెనీ ప్రతినిధి ఫోన్‌లో స్వయంగా అభ్యర్థితో మాట్లాడుతారు. ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేస్తారనే విషయాన్ని కూడా ముందుగానే అభ్యర్థికి తెలియజేస్తారు. దీన్నిబట్టి అభ్యర్థి సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
 
ఇలా సరిదిద్దుకుందాం!

►సంస్థ నుంచి ఫోన్‌కాల్ రాగానే మర్యాదపూర్వకమైన పలకరింపుతో పరిచయం చేసుకోవాలి.
►సదరు సంస్థ గురించి ముందుగానే సమాచారం సేకరించి పెట్టుకోవాలి.
►   దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కనీస అవగాహన ఉండాలి.
► ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి.
►  తాను చేయబోయే ఉద్యోగం పట్ల తనకున్న ఆసక్తిని తప్పనిసరిగా వ్యక్తీకరించాలి.
►వ్యక్తిగత సమాచారం, సాధించిన విజయాలు.. ముఖ్యంగా రెజ్యుమెలో పేర్కొన్న అంశాలను ఇంటర్వ్యూల్లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కచ్చితంగా గుర్తుంచు కోవాలి. అడిగిన వెంటనే వాటి గురించి చెప్పేలా సంసిద్ధంగా ఉండాలి. రెజ్యుమెను పక్కనే ఉంచుకోవాలి.
►  రిక్రూటర్ చెప్పే విషయాలను రాసుకొనేందుకు ఒక నోట్ పుస్తకం, పెన్నును దగ్గర పెట్టుకోవాలి.
► ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో విరామం ఉండదు. దాహం తీర్చుకునేం దుకు కూడా అవకాశం ఉండకపోవ చ్చు. కాబట్టి ఇంటర్వ్యూ కాల్ రావడానికంటే ముందే నీరు తాగి సిద్ధంగా ఉండాలి.
► ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలగ కుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లో ఉంటే స్టీరియోను, టీవీని ఆఫ్ చేయాలి.
►   మాట్లాడేందుకు వీల్లేని పరిస్థితిలో ఫోన్‌కాల్ వస్తే.. కారణాన్ని సున్నితంగా వివరించాలి. మీరు ఏ సమయానికి అందుబాటులో ఉంటారో తెలియజేయాలి.
►  వీలైతే మీరే తిరిగి ఫోన్ చేసేందుకు సంస్థ ప్రతినిధులకు అనుకూలమైన సమయాన్ని కోరాలి.
► ఫోన్‌లో మాట్లాడేందుకు ఎలాంటి అవాంతరాలు లేని, మంచి వాతావరణం ఉండే  ప్రాంతాన్ని ఎంచుకోవాలి.
►మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. శరీరం కూడా రిలాక్స్‌డ్‌గా ఉండాలి.
► గొంతులోంచి మాట స్వేచ్ఛగా రావాలి. ఇందుకోసం కొంత ప్రాక్టీస్ చేయడం మంచిది.
►ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు తెలుసు కాబట్టి.. వాటికి సరైన సమాధానాలు ఇచ్చేందుకు ఇంట్లో అద్దం ముం దు సాధన చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
►ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం అభ్యర్థులకు ఉండాలి. ఇంటర్వ్యూలో ఇది చాలా ముఖ్యం. రిక్రూటర్ అడిగే ప్రశ్నను పూర్తిగా విని, అర్థం చేసుకోవాలి.
►రిక్రూటర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే సమాధానం ఇవ్వాలి.
►అభ్యర్థి వేగంగా మాట్లాడితే రిక్రూటర్‌కు అర్థం కాకపోవొచ్చు. నిదానంగా, స్పష్టంగా మాట్లాడాలి. గొంతులోంచి వచ్చే మాట వేగాన్ని బట్టి అభ్యర్థి మానసిక పరిస్థితిని రిక్రూటర్లు సులభంగా అంచనా వేస్తున్నారు. సంభాషణలో ప్రొఫెషనల్ లాంగ్వేజ్‌ను మాత్రమే ఉపయోగించాలి.
►మాట్లాడేటప్పుడు ఎక్కువ సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిరునవ్వు చిందించాలి. అభ్యర్థి ఎలాంటి ఆందోళన చెందకుండా రిలాక్స్‌డ్‌గా ఉన్నాడన్న విషయం రిక్రూటర్‌కు తెలిసేలా మాటతీరు ఉండేలా జాగ్రత్తపడాలి.  
► ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకోగానే సాధారణ సంభాషణ ప్రారంభించడం.
► హ..హలో..ఏంటి చెప్పు.. వంటి మాటలతో డోంట్‌కేర్ అన్నట్లుగా ఉండే మాటతీరు
► మాట్లాడే భాష సక్రమంగా లేకపోవడం
► ఫోన్‌కాల్ చేసిన వ్యక్తి హోదా, వివరాలను అడగకపోవడం
► సంభాషించేటప్పుడు నీరసంగా, ఆసక్తి లేనట్లుగా సమాధానం ఇవ్వడం.
► భాషలో లోపాలు, యాస దొర్లడం.
 
స్వచ్ఛమైన భాష అవసరం
 
టెలిఫోన్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే.. భాషపై మంచి పట్టు అవసరం. వ్యావహారిక భాషను ఉపయోగించడం మంచిదే కానీ.. అటువైపు నుంచి కాల్ చేసిన కంపెనీ మల్టీ నేషనల్ కంపెనీ అయితే మాటతీరు, పదాల కూర్పు దానికి తగినట్లుగా ఉండాలి. సాధారణంగా మనం డెరైక్టర్, ఫైనాన్స్ అంటూ ఆంగ్ల పదాలను ఉచ్ఛరిస్తాం. అదే ఇంగ్లిషులో డిరెక్టర్, ఫినాన్స్ అంటూ పలుకుతారు. భాష విషయంలో గ్రామర్ ఎంత ముఖ్యమో యాక్సెంట్‌కు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పదాలను పలకడంలో చోటుచేసుకునే చిన్నచిన్న తప్పిదాలను కూడా కంపెనీలు తీవ్రంగా పరిగణిస్తాయి. తమ ఉద్యోగులు క్లయింట్లతో ఎలాంటి తప్పులు లేకుండా స్వచ్ఛమైన భాష మాట్లాడాలని కంపెనీలు ఆశిస్తాయి. అందుకే ఈ అంశాన్ని ఇంటర్వ్యూల్లో కచ్చితంగా పరీక్షిస్తాయి. చాలామంది సంభాషణ ప్రారంభంలో ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకూ కొనసాగించరు. అభ్యర్థులు ఆసక్తితో, ఉత్సాహంగా మాట్లాడితే ఇంటర్వ్యూలో విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ముగింపు సమయంలోనూ.. మీతో మాట్లాడటం తనకు దక్కిన అవకాశమంటూ కంపెనీ ప్రతినిధులకు వివరించాలి. విలువైన సమయాన్ని వెచ్చించినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ ముగించాలి.

 

Advertisement
Advertisement