మందగించిన మిర్చి కొనుగోళ్లు... | Sakshi
Sakshi News home page

మందగించిన మిర్చి కొనుగోళ్లు...

Published Sat, May 6 2017 3:43 AM

Sluggish Mirchi Purchases

ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లకు సగానికిపైగా తగ్గిన రైతులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మందగించాయి. ఖమ్మం, వరంగల్‌ వ్యవసాయ మార్కెట్లకు తరలివచ్చే మిర్చి సాధారణ రోజుల కంటే సగానికి తగ్గినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5వేలకు కొనుగోలు చేస్తా మని ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేలు చేయా లని లేఖ రాయడం తెలిసిందే. దీంతో కేంద్రం ధర పెంచుతుందన్న ఆశతోనే రైతులు తమ మిర్చిని మార్కెట్‌కు తీసుకురావడంలేదని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు విశ్లేషి స్తున్నాయి.

అంతేగాకుండా ఆయా జిల్లాల యంత్రాంగం కూడా మిర్చి అధికంగా మార్కెట్లకు రాకుండా కొంతమే రకు నియంత్రించింది. సాధారణంగా ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 80వేల నుంచి లక్ష బస్తాల వరకు మిర్చి వచ్చేది. శుక్రవారం 40వేల బస్తాలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. వరంగల్‌ మార్కెట్‌కు 70 వేల బస్తాలొచ్చే లోడు... 22 వేల బస్తాలకు పడిపోయిం దన్నారు. దీంతో ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కాస్తంత ధర పెరిగింది.

Advertisement
Advertisement