ఐఏఎస్‌ అధికారి బెయిల్‌ తిరస్కరణ | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ అధికారి బెయిల్‌ తిరస్కరణ

Published Sat, Mar 25 2017 4:27 AM

IAS officer Bail Rejection in Nampally court

యూసుఫ్‌గూడలో డ్రైవర్‌ హత్య కేసు

హైదరాబాద్‌: రాజధాని యూసుఫ్‌గూడ సాయికల్యాణ్‌ రెసిడెన్సీ టెర్రస్‌పై జరిగిన డ్రైవర్‌ బుక్య నాగరాజు హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి దారావత్‌ వెంకటేశ్వరరావు (55) బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. తనను ఓనర్‌లా చూడటం లేదని, మద్యం తాగిన మైకంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఈ నెల 17న డ్రైవర్‌ నాగరాజును వెంకటేశ్వరరావు తనయుడు, ఎల్‌ఎల్‌బీ విద్యార్థి సుక్రుత్‌ (19) హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా చేయడంతో పాటు, శవాన్ని తరలించేందుకు యత్నించిన వెంకటేశ్వరరావు తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారించిన కోర్టు... వెంకటేశ్వరరావు అభ్యర్థనను తిరస్కరించింది.

Advertisement
Advertisement