స్పెషల్ సిస్టర్ అండ్ బ్రదర్ | Sakshi
Sakshi News home page

స్పెషల్ సిస్టర్ అండ్ బ్రదర్

Published Mon, Nov 24 2014 10:33 PM

స్పెషల్ సిస్టర్ అండ్ బ్రదర్

ఇంగ్లిష్ పదాలు మేధావులను సైతం తికమకపెడతాయి. ఆ పదాలను స్పెలింగ్‌తో సహా చెప్పమంటే.. పెద్దలు కూడా నీళ్లు నములుతారు. కానీ, సాక్షి ఇండియా నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీల్లో మాత్రం బుడతలు ఇంగ్లిష్‌తో చెడుగుడు ఆడుతున్నారు. ఎలాంటి కఠినమైన పదం స్పెలింగ్ అయినా తడుముకోకుండా చెప్పేస్తున్నారు. ఇదే కోవలో విద్యానగర్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎల్.హ్రిద్యా, ఎల్.రిషభ్ రెడ్డి ప్రతిభ కనబరచి సెమీఫైనల్ చేరుకున్నారు.

రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల రిషభ్ కేటగిరీ వన్‌లో, మూడో తరగతి చదువుతున్న హ్రిద్యారెడ్డి కేటగిరి టూలో మాస్టర్లు అడిగే పదాలకు చటుక్కున స్పెలింగ్స్ రాస్తూ ఔరా అనిపిస్తున్నారు. రోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, కథల పుస్తకాలు, డిక్షనరీ చదవడం వల్ల స్పెలింగ్స్‌పై పట్టు పెరిగిందంటారు ఈ చిన్నారులు. సాక్షి ఇండియా ఇచ్చిన స్పెల్ బీ పుస్తకం కూడా ఎంతో హెల్ప్ చేసిందని చెబుతున్నారు. ‘మా అమ్మానాన్నలు శిరీష, వెంకటరామిరెడ్డిల గెడైన్‌‌స ఎంతో ఉపయోగపడుతుంద’ని తెలిపారు.

Advertisement
Advertisement