మంజీరా నది జన్మస్థానం? | Sakshi
Sakshi News home page

మంజీరా నది జన్మస్థానం?

Published Mon, Oct 17 2016 11:12 PM

మంజీరా నది జన్మస్థానం? - Sakshi

1.     తెలంగాణ రాష్ర్ట వృక్షం ఏది?
     1) వేప చెట్టు    2) జమ్మి వృక్షం
     3) మామిడి చెట్టు    4) మర్రి వృక్షం
 2.     కిందివాటిని జతపరచండి.
     జాబితా-1
     i) మన రాష్ర్ట ఉత్తర సరిహద్దు
     ii) మన రాష్ర్ట ఈశాన్య సరిహద్దు
     iii) మన రాష్ర్ట తూర్పు సరిహద్దు
     iv) మన రాష్ర్ట పశ్చిమ సరిహద్దు
     జాబితా-2
     ్చ) కర్ణాటక
     ఛ) ఆంధ్రప్రదేశ్
     ఛి) మహారాష్ర్ట
     ఛీ) ఛత్తీస్‌గఢ్
     1) i-b, ii-d, iii-a, iv-c     
     2) i-d, ii-a, iii-b, iv-c     
     3) i-c, ii-d, iii-b, iv-a         
     4) i-a, ii-b, iii-c, iv-d     
 3.    కిందివాటిలో సరికానిది.
     1) సిర్నపల్లి పంక్తులు- నిజామాబాద్
     2) కందికల్ గుట్టలు- ఖమ్మం
     3) నిర్మల్ గుట్టలు - ఆదిలాబాద్
     4) రాఖీ గుట్టలు - కరీంనగర్
 4. తెలంగాణలో ఈశాన్య రుతుపవనాల వల్ల ఎంత శాతం వర్షపాతం కురుస్తుంది?
     1) 20%      2) 25%  
     3) 35%      4) 43%
 5.     రాష్ర్టంలో ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే జిల్లా?
     1) వరంగల్     2) నల్లగొండ     3) హైదరాబాద్     4) నిజామాబాద్
 6.     మన రాష్ర్ట విస్తీర్ణంలో నల్లరేగడి నేలలు ఎంతశాతం వరకు విస్తరించి ఉన్నాయి?
     1) 20%     2) 25%    
     3) 30%     4) 35%
 7.    మన రాష్ర్టంలో మెదక్‌లోని నారాయణ్‌ఖేడ్ - జహీరాబాద్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలు ఏవి?
     1) నల్లరేగడి నేలలు    2) ఒండ్రు నేలలు     3) ఎర్ర నేలలు    4) జేగురు నేలలు
 8.    కిందివాటిలో ఏది గోదావరి నది ఉప నది కాదు.
     1) శబరి    2) మంజీరా
     3) మున్నేరు    4) ఇంద్రావతి
 9.     మంజీరా నది జన్మస్థానం?
     1) బాలఘాట్ కొండలు
     2) ముల్తాయ్ కొండలు
     3) సింకారం కొండలు        4) రేవుల్ ఘాట్ కొండలు
 10.    తుంగభద్ర నది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది?
     1) హంసల దీవి    2) దివిసీమ
     3) సంగమేశ్వరం    4) కోనసీమ
 11.  ముచుకుంద అని ఏ నదికి పేరు?
     1) మున్నేరు     2) మూసీ
     3) శబరి     4) తుంగభద్ర
 12.    మూసీ నది ఉప నది అయిన ఈసా నదిపై నిర్మించిన రిజర్వాయర్?
     1) హుస్సేన్ సాగర్     2) నిజాం సాగర్
     3) ఉస్మాన్ సాగర్    4) హిమాయత్ సాగర్
 13.    కిందివాటిలో సరికానిది.
     1) ఉత్తర వ్యవసాయ వాతావరణ తెలంగాణ మండలం - జగిత్యాల
     2) మధ్య వ్యవసాయ వాతావరణ తెలంగాణ మండలం - వరంగల్
     3) దక్షిణ వ్యవసాయ వాతావరణ తెలంగాణ మండలం - పొలాస
     4) అధిక ఎత్తులో గల గిరిజన ప్రాంతాల మండలం - చింతపల్లి
 14. ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
     1) నిజామాబాద్     2) కరీంనగర్
     3) నల్లగొండ    4) మెదక్
 15.    కిందివాటిలో సరికానిది.
     1) కల్వకుర్తి ఎత్తిపోతల పథకం- కృష్ణానది    
     2) దేవాదుల ఎత్తిపోతల పథకం-గోదావరి నది
     3) నిజాం సాగర్ ప్రాజెక్టు- మంజీర    
     4) ఎల్లంపల్లి ప్రాజెక్టు- ప్రాణహిత
 16.    అసిఫ్ నహర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
     1) కృష్ణా నది    2) మూసీ నది
     3) ప్రాణహిత    4) మంజీరా
 17.    మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ దేనికి ప్రసిద్ధి?
     1) ఇత్తడి పరిశ్రమ    
     2) కొయ్య బొమ్మలు
     3) పట్టు పరిశ్రమ    
     4) డోక్రా కాస్టింగ్ పరిశ్రమ
 18.    ‘సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
     1) సిద్ధిపేట    2) సిరిసిల్ల
     3) మహదేవ్‌పూర్    4) పోచంపల్లి
 19.    కేశోరామ్ సిమెంట్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
     1) మంచిర్యాల    2) బసంత్ నగర్
     3) హుజూర్‌నగర్    4) వాడపల్లి
 20.    కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌కు నీటిని ఏ ప్రాజెక్టు నుంచి అందిస్తున్నారు?    
     1) వైరా ప్రాజెక్టు    
     2) కిన్నెరసాని ప్రాజెక్టు
     3) బయ్యారం చెరువు        
     4) ముక్కమామిడి ప్రాజెక్టు
 21.    మన రాష్ర్టంలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
     1) రంగారెడ్డి    2) నల్లగొండ
     3) కరీంనగర్    4) మహబూబ్‌నగర్
 22. పోచంపాడు జలవిద్యుత్ కేంద్రాన్ని ఏ ప్రాజెక్టుపై నిర్మించారు?    
     1) నాగార్జునసాగర్        
     2) సింగూర్ ప్రాజెక్టు
     3) శ్రీరాం సాగర్        
     4) నిజాం సాగర్
 23.    పిల్లలమర్రి జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది?
     1) నల్లగొండ    2) మహబూబ్‌నగర్
     3) నిజామాబాద్    4) మెదక్
 24.    మహావీర్ హరిణ వనస్థలి పార్కులో సంరక్షిస్తున్న ముఖ్య జంతువు?
     1) చిరుత    2) జింక  
     3) పులి    4) సింహం
 25.    కేంద్ర కేబినెట్ 40వ టైగర్ రిజర్‌‌వగా ప్రకటించిన అభయారణ్యం?
     1) కవ్వాల్ అభయారణ్యం        
     2) అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం
     3) ప్రాణహిత అభయారణ్యం        
     4) కిన్నెరసాని అభయారణ్యం
 26.    మన రాష్ర్టంలో అతి పొడవైన జాతీయ
 రహదారి?
     1) జాతీయ రహదారి 61        2) జాతీయ రహదారి 63
     3) జాతీయ రహదారి 44        4) జాతీయ రహదారి 163
 27.    ఆసియాలో మూడో అతిపెద్ద బస్‌స్టేషన్ ఏ పట్టణంలో ఉంది?
     1) హైదరాబాద్    2) కరీంనగర్
     3) ఢిల్లీ    4) విజయవాడ
 28.    ఖమ్మం జిల్లాలోని ‘నేలకొండపల్లి’ దేనికి ప్రసిద్ధి?
     1) వెండితీగ పని    2) బుద్ధుని అవశేషాలు
     3) కొయ్యబొమ్మలు    4) పట్టు పరిశ్రమ
 29. 18 శక్తి పీఠాల్లో ఒకటైన ‘జోగులాంబ ఆలయం’ ఎక్కడ ఉంది?
     1) బాసర, ఆదిలాబాద్ జిల్లా        2) కొలనుపాక, నల్లగొండ
     3) ఆలంపూర్, మహబూబ్ నగర్
     4) కాళేశ్వరం, కరీంనగర్
 30.    2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ర్ట సగటు స్త్రీ, పురుష నిష్పత్తి?
     1) 1040    2) 943  
     3) 879    4) 988
 31.    2001 - 2011 మధ్య కాలంలో తెలంగాణ జనాభా వృద్ధి రేటు?
     1) 17.69%     2) 13.58%  
     3) 15.13%     4) 19.96%
 సమాధానాలు
     1) 2     2) 3     3) 2     4) 1      5) 3     6) 2     7) 4      8) 3     9) 1     10) 3     11) 2     12) 4     13) 3     14) 2      15) 4     16) 2     17) 3     18) 4      19) 2     20) 2     21) 4     22) 3     23) 2     24) 2     25) 1     26) 3     27) 1     28) 2     29) 3     30) 4     31) 2.
 
 గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
 1.     తెలంగాణ రాష్ర్టంలో ప్రధానమైన ఎర్ర
 నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా?
     1) 48%    2) 55%
     3) 59%    4) 62%
 2.    ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ కేంద్రం?
     1) కరీంనగర్     2) మంచిర్యాల     3) వరంగల్     4) జగిత్యాల
 3.    తెలంగాణ రాష్ర్ట వర్షపాతంలో నైరుతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా?
     1) 70%    2) 80%
     3) 90%    4) 95%
 4.    కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
     1) పోచారం     2) జన్నారం  
     3) ఏటూరునాగారం     4) పాకాల
 5.    తెలంగాణ విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం?
     1) థర్మల్    2) హైడల్
     3) న్యూక్లియర్    4) బయోఫ్యూయల్
 6.    హైదరాబాద్‌లో ఏరోస్పేస్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
     1) తుర్కపల్లి    2) తుక్కుగూడ
     3) ఆదిభట్ల    4) పొల్లేపల్లి
 7.    తెలంగాణ రాష్ర్టంలో షెడ్యూల్డ్ తెగల జనాభా అత్యధిక శాతం ఉన్న జిల్లా?
     1) వరంగల్     2) ఖమ్మం
     3) ఆదిలాబాద్     4) మహబూబ్‌నగర్
 8.    కిందివాటిలో మిషన్ కాకతీయ ఉద్దేశం కానిది?
     1) చెరువుల పూడికతీత        2) చెరువు గట్టులను బలపరచ డం
     3) ఫీడర్ కాల్వలను బాగుచేయడం    
     4) చెరువులను కలపడం
 9.    టీ-హబ్ కేంద్రం హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది?
     1) ఐఐటీ-హైదరాబాద్        2) ఐఐఐటీ- హైదరాబాద్
     3) హెచ్‌సీయూ  
       4) రహేజా మైండ్ స్పేస్
 10.     ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకొనే ప్రముఖ జాతర?
     1) సమ్మక్క సారక్క    2) నాగోబా
     3) తీజ్    4) కొమరెల్లి
 11. తెలంగాణలో తరి అంటే?
     1) నీటి వసతి ఉన్న భూమి        2) నీటి వసతి లేని భూమి
     3) అటవీ భూమి        
     4) పశువుల మేతకు ఉపయోగించే భూమి
 12.    గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాల సంఖ్య?
     1) 5    2) 7    
     3) 3    4) 6
 13.    ఖీకఇ అంటే?
     1) వెయ్యి మిలియన్ల ఘనపు మీటర్లు
     2) పది మిలియన్ల ఘనపు అడుగులు
     3) వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులు
     4) పది మిలియన్ల ఘనపు మీటర్లు
 14.    {పాణహిత నది ఏ మూడు నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది?
     1)  పెన్‌గంగా, వార్ధా, వెయిన్ గంగా
     2)  పూర్ణ, పెన్‌గంగ, వార్ధా
     3)  ప్రవర, వెయిన్ గంగా, మానేరు
     4)  కొలాబ్, వార్ధా, పెన్‌గంగ
 (ఇందులో పేర్కొన్నది జిల్లాల విభజనకు ముందు సమాచారం. కొత్త జిల్లాలు ఏర్పాటైన క్రమంలో సరిహద్దులు, ఇతర అంశాలు మారతాయి)
 సమాధానాలు
 
      1)1     2) 4     3) 2      4) 2  
     5) 1     6) 3     7) 2     8) 4   
     9) 2     10) 2     11) 1     12) 2   
     13) 3     14) 1     
 

Advertisement
Advertisement