తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Published Sat, Aug 27 2016 6:56 PM

రోడ్డుపై బిందెలు పెట్టిన నిరసన తెలుపుతున్న ప్రజలు - Sakshi

ఖిల్లాఘనపురం : తాగునీరు లేక అల్లాడుతున్నామని, వారం రోజులు దాటినా నీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ శనివారం మండల కేంద్రంలోని తోకగేరికి చెందిన ప్రజలు సర్పంచ్‌ సౌమ్యానాయక్‌ ఇంటి ముందు జిల్లా కేంద్రానికి వెల్లే ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా తమ గేరికి వారం గడిచినా రాలేదన్నారు. తమ వీధికి ట్యాంకర్‌ పంపే వరకు ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మశ్చందర్‌రెడ్డి, సర్పంచ్‌ అక్కడికి చేరుకుని ప్రజలతో మాట్లాడి నచ్చజెప్పారు. ట్రాక్టర్‌ ద్వారా 20 ట్యాంకుల నీళ్లను ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని, కరెంట్‌ వచ్చిన వెంటనే తోకగేరికి వాటర్‌ ట్యాంకును పంపిస్తామని సర్పంచ్, ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించి వెళ్లిపోయారు. సుమారు గంట పాటు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 
 

Advertisement
Advertisement