దారిదోపిడీ ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

దారిదోపిడీ ముఠా అరెస్ట్

Published Wed, Dec 7 2016 10:38 PM

దారిదోపిడీ ముఠా అరెస్ట్ - Sakshi

పట్టుబడ్డ తొమ్మి మంది
అందరూ24 ఏళ్లలోపువారే
మూడు వాహనాలు..ఏడు సెల్‌ఫొన్లు  స్వాధీనం
 

కరీంనగర్ క్రైం : కరీంనగర్ శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా దారిదోపిడీలకు పాల్పడుతున్న 9 మంది ముఠాను అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని కాపువాడకు చెందిన మిర్యాకార్ సారుు(20) స్థానిక మటన్‌షాపులో పని చేస్తాడు. అదే కాలనీకి చెందిన కోహెడ వేణు(20), కురెల్లి సారుుచంద్(21), హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన గుత్తం సారుురాం(19), గుమ్మడి రాజేశ్(24), హెచ్‌బీ కాలనీకి చెందిన దేవ కార్తీక్(24), శాషామహల్‌కు చెందిన మధిర హరీష్(20), మారుతినగర్‌కు చెందిన మామిడిపల్లి భువనేశ్వర్(19), అదే కాలనీకి చెందిన మరో బాలుడు(17) జల్సాలకు అలవాటుపడ్డారు. వీరిలో వేణు, సారుుచంద్, భువనేశ్వర్ డిగ్రీ చదువుతుండగా మిగతా వారు వివిధ పనులు చేస్తున్నారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి దారిదోపిడీలు ప్రారంభించారు. ఇలా వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేసేవారు డబ్బులు అరుుపోగానే మళ్లీ దారిదోపిడీలు చేసేవారు.
 
క్లూ దొరకకుండా చోరీలు
ఎలాంటి క్లూ లేకుండా రాత్రిపూట సీసీ కెమోరాలు లేనిచో ఈ ముఠా దారిదోపిడీలు చేసేది. దీంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తనిఖీలు చేసినప్పుడు వీరు తాము విద్యార్థులమని చెప్పుకుంటూ తప్పించుకునేవారు.

ఈ ఏడాది మే 21న  హరీష్, చంద్, మిర్యాకార్ సారుు, భువనేశ్వర్, మైనర్ బాలుడు కలిసి కరీంనగర్ బైపాస్ రోడ్డులోని రామచంద్రపూర్ పెట్రోల్ బంక్ వద్ద ప్రయాణిస్తున లారీ, ట్రాక్టర్లను నిలిపి అందులోని డ్రైవర్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.12,500 వేలు లాక్కుని పారిపోయారు.

ఈ ఏడాది జూన్ 20న మిర్యాకార్ సారుు, వేణు, గుత్తం సారుురాం, దేవ కార్తీక్, గుమ్మడి రాజేశ్ కలిసి బైపాస్‌రోడ్డులో నిలిపి ఉంచిన లారీల అద్దాలు పగలకొట్టి డ్రైవర్లపై దాడిచేసి వారి నుంచి సెల్‌ఫొన్, రూ.17,500 ఎత్తుకెళ్లారు.

ఈ ఏడాది జూలై 7, 16వ తేదీల్లో  హరీష్, మిర్యాకార్ సారుు, భువనేశ్వర్, బాలుడు కలిసి సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో ఉన కొండ సత్యలక్ష్మి గార్డెన్ వద్ద రోడ్డుపై వస్తున్న ఐజర్ వాహనంపై రాళ్లు, కర్రలతో దాడిచేసి డ్రైవర్‌ను కొట్టి అతని వద్ద ఉన్న రూ.11 వేలు దోచుకున్నారు.     

ఆగస్టు 7న, నవంబర్ 2వ తేదీ ఇదే తరహలో దారిదోపిడీలకు పాల్పడ్డారు.
అరుుతే వీరు రాత్రి పూట నేరాలు చేస్తుండడం ఎలాంటి అనవాళ్లు లభించకపోవడంతో పలువురి కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కొద్ది రోజుల క్రితం రాత్రిపూట నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో అనుమానితుడిని పట్టుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో దారిదోపిడీలకు చెందిన క్లూ లభించింది. దీంతో తొమ్మిది మంది కదిలిలకపై నిఘా పెట్టారు. మంగళవారం ఉదయం త్రిటౌన్ సీఐ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న  తొమ్మిది మందిని పట్టుకుని విచారణ చేయగా ఏడు దారిదోపిడీ నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి నుంచి  దోపిడీలకు వినియోగించిన మూడు బైకులు, ఏడు సెల్‌ఫొన్లు స్వాధీనం చేసుకున్నారు.
 
తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి..
యువతపై వారి కుటుంబసభ్యుల పర్యవేక్షణ ఉండాలని సీపీ సూచించారు. నగరంలో గతకొంతకాలంగా దారిదోపిడీలు చేసి పట్టుబడ్డ 9 మందిన కుటుంబ సభ్యులను విచారించగా వారి పర్యవేక్షణ ఉండడం లేదని తెలిసిందని తెలిపారు. ఇటీవల దారిదోపిడీ కేసుల్లో పట్టుబడ్డ 13 మందిలో ఇద్దరు ఇంజినీరింగ్, ఐదు గురు డిగ్రీ విద్యార్థులుండడం బాధాకరమని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న చోరీల నిగ్గు తెల్చడానికి ఏసీపీ రామారావు అధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు.  
 
జిల్లాలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా
జిల్లాలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తోం     దని సీపీ తెలిపారు. ఓ వ్యక్తి, ఓ మహిళ, చిన్న పిల్లలతో అనుమానం రాకుండా సంచరిస్తున్నారని అనుమాని తుల కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచా    రం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే బ్లూకోట్స్ రంగంలోకి దిగాయని 24 గంటలు గస్తీ కొనసాగుతోందని పేర్కొన్నారు. దారిదోపిడీ ముఠాను పట్టుకున్న త్రీటౌన్, టుటౌన్ ఇన్‌స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, సీసీఎస్ ఎస్సైలు సాగర్, ఎల్లాగౌడ్, భాస్కర్, కానిస్టేబుళ్లను సీపీ సత్కరించారు.

Advertisement
Advertisement