వర్ధమాన సినీ హీరో, దర్శకుడికి రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

వర్ధమాన సినీ హీరో, దర్శకుడికి రిమాండ్‌

Published Sun, Aug 20 2017 8:56 AM

వర్ధమాన సినీ హీరో, దర్శకుడికి రిమాండ్‌ - Sakshi

విజయవాడ లీగల్‌: వర్ధమాన సినీ హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితులైన హీరో స్టీఫెన్, దర్శకుడు చలపతికి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. విజయవాడలోని నాల్గవ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఇందిరాప్రియదర్శిని ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వర్ధమాన హీరో కొండూరు స్టీఫెన్‌ ఆలియాస్‌ సృజన్, దర్శకుడు చలపతి ఓ సినిమా షూటింగ్‌ కోసం హీరోయిన్‌తో కలసి సోమవారం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో పడమట దగ్గరకు వచ్చేసరికి తనతో స్టీఫెన్, చలపతి అసభ్యంగా ప్రవర్తించారని హీరోయిన్‌ పటమట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణ సమయంలో ముందు సీట్లో కూర్చున్న తనపై దర్శకుడు చలపతితో పాటు హీరో సృజన్‌ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement