ధారూరులో ఆగిన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు | Sakshi
Sakshi News home page

ధారూరులో ఆగిన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు

Published Tue, May 24 2016 10:13 PM

Rajayadani express has stopped in Tharuru

ధారూరు(రంగారెడ్డి జిల్లా): ధారూరు రైల్వే స్టేషన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అరగంట పాటు నిలిచిపోయింది. రుక్మాపూర్ రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయని కారణంగా ధారూరు రైల్వే స్టేషన్‌లో అడ్వాన్స్ స్టాటర్ పనిచేయకుండా మొరాయించింది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ జంక్షన్ మీదుగా వెళ్లె ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వేస్టేషన్ సమీపంలోనే ఆగిపోయింది. రాత్రి 9:05 గంటల ప్రాంతంలో సిగ్నలింగ్ వ్యవస్థ సిబ్బంది వచ్చి మొదట ఒక్క రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన గుల్బర్గా ప్యాసింజర్ రైలు కూడ ధారూరు రైల్వేస్టేషన్ ఔటర్‌లో నిలిచిపోయింది.

తాండూర్ నుంచి వచ్చిన గూడ్స్‌రైళ్లు, రెండు రైల్వే ఇంజన్లు రుక్మాపూర్ రైల్వేస్టేషన్ ఔటర్‌లోనే ఆగిపోయాయి. వికారాబాద్ నుంచి వచ్చిన సిగ్నలింగ్ వ్యవస్థ టెక్నికల్ సిబ్బంది సిగ్నలింగ్ వ్యవస్థను బాగుచేయడంతో 9:30 గంటల తర్వాత ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగాయి. అరగంట పాటు ఎందుకు రైళ్లు ఆగియో తెలియక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సబందిత రైల్వే అధికారులను ఈ విషయమై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాగా ఈ రైల్వే రూట్‌లో ఉన్న పలు రైల్వే స్టేషన్లలో కూడ వివిధ రైళ్లు, గూడ్స్ రైళ్లు ఆగిన సమాచారం.

Advertisement
Advertisement