ఆగస్టు నుంచి పుష్కరిణి మరమ్మతులు | Sakshi
Sakshi News home page

ఆగస్టు నుంచి పుష్కరిణి మరమ్మతులు

Published Tue, Jul 26 2016 10:25 PM

శ్రీవారి పుష్కరిణి

 
– నెలరోజులపాటు పుష్కరిణి హారతి రద్దు
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని పుష్కరిణికి మరమ్మతులు చేయటం ఆనవాయితీ. ఈ మేరకు ఆగస్టు 1వ తేది నుంచి పుష్కరిణి మూసివేయనున్నారు. నెలరోజుల పాటు పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేయనున్నారు. దీంతో రోజూ సాయంకాలం వేళ ఉత్సవమూర్తులకు అందజేసే పుష్కరిణి హారతి కూడా ఆగస్టులో పూర్తిగా రద్దు చేయనున్నారు. 
శ్రీవారి ట్రస్టులకు రూ.39.37 లక్షల విరాⶠం
 తిరుమల శ్రీవారి ట్రస్టులకు మంగళవారం రూ.39.37 లక్షలు విరాళం అందింది. ఇందులో నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.16.37 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.20 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకు రూ.2 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు రూ.లక్ష ఇచ్చారు. భక్తులు తమ డీడీలను స్థానిక దాతల విభాగంలో అధికారులకు అందజేశారు. 
 
 
 

Advertisement
Advertisement