'సీఎం రాజీనామా చేయాలి' | Sakshi
Sakshi News home page

'సీఎం రాజీనామా చేయాలి'

Published Thu, Jul 28 2016 5:59 PM

'సీఎం రాజీనామా చేయాలి' - Sakshi

కరీంనగర్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన ప్రక్క రాష్ట్రం ఒక్క ఎంసెట్‌ నిర్వహిస్తే.. మన తెలంగాణలో రెండు ఎంసెట్‌లు నిర్వహించడం అవగాహనరాహిత్యమని విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వైఫల్యానికి ఇది నిదర్శమని ఆయన అన్నారు. నేరం చేసిన విద్యార్థులకు శిక్షపడేలా చూడాలన్నారు. నేరం చేయని విద్యార్థులు బలికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని జీవన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement