ఆలిండియా సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు 15న | Sakshi
Sakshi News home page

ఆలిండియా సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు 15న

Published Wed, Jan 11 2017 12:21 AM

ఆలిండియా సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షలు 15న - Sakshi

విజయనగరం రూరల్: 2017-18 సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలను ఈ నెల 15న నిర్వహించనున్నట్లు కోరుకొండ సైనిక్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్నల్ రుద్రాక్ష అత్రి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశామన్నారు. ఆరోతరగతి ప్రవేశానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు గణితం, లాంగ్వేజ్ ఎబిలిటీ, 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ఇంటెలిజెంట్ పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. తొమ్మిదో తరగతి ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి 11.30 గంటల వరకు గణితం, సైన్‌‌స పరీక్ష, 12 గంటలనుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంగ్లిష్, సోషల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

 ప్రవేశ పరీక్ష నిర్వహించే కేంద్రాలివీ..
 హైదరాబాద్ (కీస్ బాలికల హైస్కూల్-సెరుుంట్ ఆన్‌‌స రోడ్, సికింద్రాబాద్), కరీంనగర్ (ప్రభుత్వ పాఠశాల- సుభాష్‌నగర్), శ్రీకాకుళం(ఆర్‌సీఎం లయోలా ఇంగ్లిష్ మీడియం స్కూల్-ఇలిసిపురం), విజయనగరం(సెరుుంట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్-కంటోన్మెంట్), విశాఖ పట్నం (ఎస్‌ఎఫ్ ఎస్ హైస్కూల్-సీతమ్మధార), రాజమం డ్రి (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-డీలక్స్ సెంటర్, సారుుకృష్ణ సినిమా థియేటర్ దగ్గర), విజయవాడ(కేబీసీ జెడ్పీ బాలు ర హైస్కూల్-పటమట), గుంటూరు(మాజేటి గురవయ్య హైస్కూల్-అరండల్‌పేట పోలీస్‌స్టేషన్).

Advertisement
Advertisement