కదం తొక్కిన బీజేపీ | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన బీజేపీ

Published Tue, Apr 25 2017 7:11 PM

కదం తొక్కిన బీజేపీ - Sakshi

► మతపరమైన రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన
► కలెక్టరేట్‌ ముట్టడికి ఉప్పెనలా కదిలిన నాయకులు
► వ్యూహాత్మకంగా భగ్నం చేసిన పోలీసులు
► ఉద్రిక్త పరిస్థితుల మధ్య నాయకుల అరెస్టు


మెదక్‌రూరల్‌:
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మెదక్‌ జిల్లా బీజేపీ నాయకులు కదం తొక్కారు. ముస్లిం మైనార్టీలకు కల్పిస్తున్న 12 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్‌ ముట్టడికి ఉప్పెనలా కదిలారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్‌ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముందస్తు సమాచారంతో కలెక్టరేట్‌ భవనానికి కొద్దిపాటి దూరంలోనే భారీగా మెహరించిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ  నాయకులు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేశారు. తోపులాట, ఉరుకులు పరుగులు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అనంతరం మెదక్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చోళ్ల రాంచరణ్‌ యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో మూడేళ్లుగా కుటుంబపాలన, నియంత పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఓట్ల కోసం సీఎం కేసీఆర్‌ ఎంఐఎంకు తొత్తుగా మారి, అభివృద్ధి కోసం ఆలోచించడం లేదన్నారు. ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆయన ఆదయ్యబట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ముస్లిలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించే ప్రయత్నం చేస్తే సుప్రీం కోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. ఎట్టి పరిస్తితుల్లో ముస్లిం రిజర్వేషన్‌ను ఒప్పుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని, ఒకవేల వ్యతిరేకం అనుకుంటే సుప్రీంకోర్టు సైతం ముస్లింలకు వ్యతిరేకమవుతుందన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్న నియంతృత్వ పాలనను ప్రజలే ఎండగడతారని హెచ్చారింరు. ఆయన వెంట బీజేపీ జిల్లా కార్యదర్శి కం డెల సుధాకర్, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, మహిళా మోర్చా జిలా అధ్యక్షురాలు లక్ష్మీశైలజ, గుండు మల్లే శం, గోదల మల్లేశం, విష్ణు, జనా ర్దన్, దుర్గేష్, ముత్యంగౌడ్, సునీల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement