16న పరీక్ష.. అయితే 26న హాల్ టికెట్ | Sakshi
Sakshi News home page

16న పరీక్ష.. అయితే 26న హాల్ టికెట్

Published Fri, Aug 28 2015 10:28 PM

16th exam and 26th hall ticket

జన్నారం (ఆదిలాబాద్): పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఉచిత కోచింగ్ అవకాశాన్ని కోల్పోయాడు. సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు తగ్గేదని విద్యార్థి వాపోయాడు. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని కామన్‌పల్లికి చెందిన కామెర విజయ్‌కుమార్ సివిల్స్ కోసం ఉచితంగా కోచింగ్ పొందేందుకు బీసీ స్టడీ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు ఈ నెల16 ఎంట్రెన్స్ పరీక్ష ఉంది. ఇందుకు సంబంధించిన హాల్ టిక్కెట్ నిర్వాహకులు పోస్టు ద్వారా పంపించారు. అయితే.. ఈనెల 8న పోస్టాఫీసుకు వచ్చినా పోస్టుమన్ సకాలంలో ఇవ్వలేదు.


ఈ విషయంలో పలుమార్లు పోస్టుమన్‌ను కూడా విజయ్‌కుమార్ సంప్రదించాడు. అయినా స్పందించలేదు. చివరకు ఈనెల 26న హాల్‌టిక్కెట్ ను అందించాడు. విజయ్‌కుమార్ ఈ మేరకు పోస్టు ప్రధాన కార్యాలయానికి శుక్రవారం వచ్చాడు. పరిశీలిస్తే తనకు పోస్టు ఈనెల 8 వచ్చినట్లు ఉంది. ఈ విషయం తెలుసుకుని సిబ్బందిని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని విజయ్‌కుమార్ తెలిపారు. ‘నేను ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యానని, నా భవిష్యత్తును దెబ్బతీసిన పోస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని’ కోరాడు.

Advertisement
Advertisement