బంగారం భగభగ రూ.30,000 దాటింది | Sakshi
Sakshi News home page

బంగారం భగభగ రూ.30,000 దాటింది

Published Fri, Feb 12 2016 2:17 PM

బంగారం భగభగ రూ.30,000 దాటింది - Sakshi

రూ. 30,000పైకి పుత్తడి..

న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, క్రూడ్ ధరలు, స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి విలువ బలహీనత నేప థ్యంలో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి భారత్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో  10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే భారీగా రూ.1,700  లాభంతో రూ. 30,017 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర రూ. 1,786 లాభంతో రూ. 38,566 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగి ట్రేడింగ్ ముగిస్తే... శుక్రవారం దేశీ స్పాట్ మార్కెట్లలో  పసిడి ధర  రూ.1,000కి పెకైగసే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా చూస్తే...
గురువారం నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న మార్చి డెలివరీ పసిడి కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే... ఔన్స్ (31.1గ్రా)కు 60  డాలర్ల లాభంతో (5 శాతం) 1,255 డాలర్ల వద్ద ట్రేడయింది. వెండి సైతం 16  డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.

 ముంబైలో స్పీడ్ ఇలా...
ముంబై ప్రధాన మార్కెట్‌లో 10 గ్రాములకు 99.9 స్వచ్ఛత పసిడి గురువారం ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.945 ఎగసి రూ. 28,985కి చేరింది.  99.5 స్వచ్ఛత పసిడి ధర కూడా ఇంతే మొత్తం పెరిగి రూ.28,835కు ఎగసింది. పసిడికి ఈ ధర దాదాపు  ఏడాదిన్నర  గరిష్ట స్థాయి. 2014 మే 20 తరువాత ఈ స్థాయికి ధరలు ఎగయడం ఇదే తొలిసారి. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.1,215 ఎగసి రూ.38,000కి ఎగసింది.

 

అంతర్జాతీయ సంకేతాలతో పాటు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయంగా సైతం విలువైన మెటల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. కాగా, భారత్ పసిడి డిమాండ్ 2015లో 849 టన్నులుగా నమోదైందని... ధరలు తగ్గిన పరిస్థితుల్లో కొనుగోలు దారులు జాగరూకతగా వ్యవహరించడమే డిమాండ్ దాదాపు నిశ్చలంగా ఉండడానికి కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డ బ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. 2014లో డిమాండ్ 829 టన్నులు.

Advertisement
Advertisement